ఏప్రిల్ 30, 2024

ఎమ్మెస్సార్ జాతీయ స్థాయి కథల పోటీ 2024

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 7:13 సా. ద్వారా వసుంధర

ఎమ్మెస్సార్ జాతీయ స్థాయి కథల పోటీ 2024
2024 జాతీయస్థాయి కథల పోటీకి కథలకు ఆహ్వానం
(నవ్యత, సృజన ముఖ్యం)
కీ.శే. శ్రీ మలిశెట్టి సీతారామ్ గారి స్మారకార్థం ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఔత్సాహిక రచయితల నుండి కథలను ఆహ్వానిస్తున్నాము.
బహుమతి పొందిన కథలతో బాటు మరి కొన్ని ఎంపిక చేసిన ఉత్తమ కథలతో “కథా ప్రపంచం 2024” పుస్తకం ప్రచురించబడుతుంది.
మరియు
కమిటీ ఎంపిక చేసే సాహితీవేత్తకు శ్రీ మలిశెట్టి సీతారామ్ స్మారక సాహితీ పురస్కారం2024 అందచేయ బడుతుంది

శ్రీ మలిశెట్టి సీతారామ్ స్మారక సాహితీ పురస్కారం 2024 విజేత వివరాలు, కథల పోటీ విజేతల వివరాలు సంయుక్తంగా ప్రకటించబడతాయి.
నగదు బహుమతి వివరాలు
ప్రథమ బహుమతి: రూ.5,000/-
ద్వితీయ బహుమతి:రూ3,000/-
తృతీయ బహుమతి:రూ.2,000/-

                                                                                                                                                                                                కథల నిడివి : డిటిపి చేసినట్లయితే పిడిఎఫ్5 పేజీలకు మించకుండా. +  1 పేజీ హామీపత్రం

రచయిత పూర్తి చిరునామా, ఫోన్ నంబర్ సహా కథలను పంపగలరు.

గమనిక :అనువాద రచనలు, అనుసరణలు,ఇతర పోటీలలో ఇప్పటికే పరిశీలనలో ఉన్న కథలను పంపరాదు. గతంలో మలిశెట్టి సీతారాం స్మారక కథల పోటీలకు కథలు పంపిన వారు, బహుమతులు పొందిన వారు కూడా ప్రస్తుత కథల పోటీలో పాల్గొనవచ్చు.
కార్యక్రమ నిర్వహణ: ఎమ్మెస్సార్ సాహీతీ పురస్కార కమిటి

ముఖ్య గమనిక : కథలను కేవలం ఇ-మెయిల్ ద్వారా మాత్రమే 30 జూన్ లోగా పంపగలరు msreducationalsociety@gmail.com కథలు చేరడానికి చివరి తేదీ: జూన్ 30, 2024

ఇతర వివరాలకు

యుగంధర్: 93947 82540,
శాస్త్రి : 88857 62720

ఇట్లు
భవదీయుడు,
మలిశెట్టి శ్యాం ప్రసాద్,
9985013234
కార్యదర్శి, MSR ఎడ్యుకేషనల్ సొసైటీ, గుర్రంకొండ,ఆంధ్ర ప్రదేశ్.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.