ముందుమాట
కథలైనా కవితలైనా పాటలైనా పలుకులైనా నాటికలైనా నాదాలైనా- అక్షరాలతో ఊపిరి పోసుకుని అక్షరజాలంతో అర్థవంతమౌతాయి. మేము ప్రత్యేకంగా ఆరాధించే కథనీ, ఆ కథతో విడదీయరాని అనుబంధమున్న ఇతర సాహితీ ప్రక్రియల్నీ విశ్లేషించే సాహితీ సుధా కథా వేదిక- ఈ అక్షరజాలం. సాహిత్యం-సాహితీపరులు, కళలు-కళాకారులు, పత్రికలు–పాత్రికేయులు, బుల్లితెర–వెండితెర, సాంఘికం-రాజకీయం వగైరాలు- జాతీయంగా, అంతర్జాతీయంగా తొక్కిన పాతపుంతలు, తొక్కుతున్న నేటిపుంతలు, తొక్కనున్న కొత్తపుంతలు మన చర్చనీయాంశాలు. మా అవగాహన మేరకు తెలుగువారికీ, తెలుగు భాషకీ, తెలుగుతనానికీ ప్రాధాన్యమిచ్చినా- అభిజ్ఞులకీ వేదిక జాతి మత కుల భాషా వర్గ భేదాలకు అతీతమని మనవి. విమర్శకు సదుద్దేశ్యం, వినూత్న ప్రయోగాలకి చొరవ, ఉన్న మాట చెప్పడానికి ధైర్యం, అన్న మాట ఆకళింపు చేసుకుందుకు సహనం ముఖ్యమని గ్రహించిన సహృదయులకు తెలుగునాట కొదవలేదు. ఈ అక్షరజాలానికి రసపుష్టినివ్వాల్సిందిగా వారందరికీ మా విన్నపం.
ఈ లంకె ద్వారా కూడా మా అక్షరజాలం ని మీరు చేరుకోగలరు: vasumdhara.com
ఈ వేదికపై రచయితలెవరైనా తమ సాహితీవ్యాసంగపు వివరాలను పంచుకోవచ్చును. వారి రచనలనూ ఈ వేదికద్వారా అందజెయ్యవచ్చును.
వసుంధర రచనలు అచ్చులో వస్తున్న వివిధ పత్రికల్లోనూ, వెబ్ పత్రికల్లోనూ వస్తున్నాయి. సమయాభావం చేత వాటిని ఎప్పటికప్పుడు పాఠకులతో పంచుకోలేకపోతున్నాం. ఆసక్తిగల పాఠకులకోసం కొంత సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాంః
ప్రసుతం వసుంధర సీరియల్ ‘ఫారిన్ వెళ్లాలం(నం)డి’ కౌముది వెబ్ పత్రికలో http://www.koumudi.net వస్తున్నది. http://www.pratilipi.com (మచ్చుకి Telugu culture story | గతమెంతొ ఘనకీర్తి « rajagopalarao jonnalagadda “వసుంధర” | ప్రతిలిపి (pratilipi.com)) మా పాత రచనల్నీ; manatelugukathalu.com (మచ్చుకి కృష్ణగాడి – వీర – ప్రేమగాథ – Krishnagadi – Vira – Premagatha – By Vasundhara (manatelugukathalu.com)) మా కొత్త రచనల్నీ తరచుగా పాఠకులకు అందిస్తున్నాయి. వసుంధర రచనలు, పుస్తకాల వివరాలకు లంకెః వసుంధర రచనలు | వసుంధర అక్షరజాలం (vasumdhara.com)
ఈ క్రింది లంకెలు కూడా వీక్షకులకు ఉపయోగపడవచ్చు. ఇందులోని వివరాలకు అదనపు సమాచారం జోడించి సవరించవలసి ఉన్నదిః
సాహితీ సమాచారం సాహితీవైద్యం పుస్తకాలు మన కథకులు మన పత్రికలు మన పాత్రికేయులు విద్యావేత్తలు వసుంధర Flat Forum
Namani Sujanadevi said,
జనవరి 1, 2023 వద్ద 4:33 సా.
Excellent
Vadaparthi Venkataramana said,
డిసెంబర్ 11, 2022 వద్ద 4:18 సా.
వసుంధర అక్షరజాలం సాహితీకారులందరికీ చాలా ఉపయుక్తంగా ఉంది.అభినందనలు…ధన్యవాదాలు.