మార్చి 28, 2024

పరిచయంః రచయిత్రి భవానీ కృష్ణమూర్తి

Posted in సాహితీ సమాచారం వద్ద 12:57 సా. ద్వారా వసుంధర

1. పేరు: డాక్టర్ గోపావఝుల భవానీ కృష్ణ మూర్తి
2. పుట్టినతేదీ: 13.02.1954
3. జన్మస్థలం: ఆత్రేయపురం; తూర్పు గోదావరి జిల్లా; AP
4. విద్యార్హతలు: ఎం.ఏ,తెలుగు; పి హెచ్ డి- తెలుగు
5. తల్లిదండ్రులు: కీ.శే.భమిడిపల్లి తమ్మయ్య శాస్త్రి; కీ.శే.మహాలక్ష్మమ్మ
6. భర్త: శ్రీ గోపావఝుల వేంకట కృష్ణమూర్తి; విశ్రాంత రైల్వే పర్సనల్ ఆఫీసర్ (ప్రస్తుతం: జ్యోతిష గురువు)
7. సంతానం: ఇద్దరు అమ్మాయిలు- పద్మలత, జయలక్ష్మి; ఒక అబ్బాయి: సూర్యనారాయణ(IMF వాషింగ్టన్ USA)
8. నివాసం: పద్మారావు నగర్, సికింద్రాబాద్, తెలంగాణ
9. రచనలు…
తెలుగు నవలః ఉద్యోగినుల సమస్యలు (పిహెచ్.డి సిద్ధాంత గ్రంథం)
నవలలుః నీలాకాశం నవ్వింది, ప్రత్యూష పవనాలు, అమృత భాండం, అనురాగ తరంగాలు, దూరపు కొండలు, ఆత్మ బంధువులు (నవలలు వార, మాస పత్రికల్లో ధారావాహికలుగా ప్రచురించబడినవి). పై ధారావాహిక నవలలే కాకుండా 70 నవలలు ముద్రించబడినవి. వాటిలో కొన్నిః అనురాగవీచికలు, అరుణరాగాలు, పల్లవి, పూలరధం, వనప్రియ, బొమ్మలాట, జీవిత గమ్యం, వలపుతరంగాలు,ప్రేమ పరీక్ష, వలపు వసంతం, రాగ జ్వాల, చైతన్య, ప్రేమ ఉషస్సు, ప్రేమమయి, ప్రేమవాహిని, ప్రణయ కలహం, శ్రీమతికో ప్రేమ లేఖ, అనురాగ సంకేతం, ముద్దబంతి, పరివర్తన, వెన్నెల కిరణాలు.
10. వృత్తి: శ్రీ సాయి విజ్ఞాన భారతి మహిళా డిగ్రీ కళాశాలలో 30 సంవత్సరాలు అధ్యాపకురాలిగా అనుభవం. 11. అవార్డులు బిరుదులు: విజ్ఞాన జ్యోతి, వెలుగు దివ్వె, కవి శారద, సాహిత్య రత్న, కవి కిరీటి, కవి రత్న.
12. సాహిత్య సేవ: 40 సంవత్సరాల రచనానుభవం; 1982 లో మొదటినవల ముద్రణ; 40 కథలు- దిన, వార, మాస పత్రికలలో ప్రచురితాలు; పరిశోధక వ్యాసాలు దిన, వార, మాస పత్రికలలో ప్రచురితాలు (వీటిని M. philగా పరిగణించి డైరెక్టుగా Ph.Dకి అనుమతినిచ్చారు); ఆధ్యాత్మిక, దైవ, భక్తి వంటి పత్రికల్లో సంపూర్ణ కాశీ యాత్ర వ్యాసాలు, ఆధ్యాత్మిక వ్యాసాలు ప్రచురించబడినవి. 13. భాగస్వామ్య సమూహాలు: పంచపదులు, చిమ్నీలు, సమ్మోహనాలు, పెన్ కౌంటర్లు, తేనియలు, సున్నితా లు, బుల్లెట్ పాయింట్స్, తెలుగు వెలుగు,సేవ, కలం స్నేహం; కవితారల వేదిక, గోదావరి రచయితల సంఘం, ఉస్మానియా రచయితల సంఘం మొదలైన సమూహాలలో సుమారు 3000కి పైగా కవితలు రాశాను; ఆయా సమూహాలనుండి సుమారు 500 వరకు ప్రశంసా పత్రాలు పొందాను; లయన్స్ క్లబ్ వారి సన్మానం, కళాశాలలో వివిధ సందర్భాలలో సన్మానాలు పొందాను.

వ్యాఖ్యానించండి

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.