డిసెంబర్ 27, 2022
గడువు తేదీ పెంపుః అంతర్జాతీయ కార్టూన్ పోటీలు, తానా
‘తానా’ కార్టూన్ల పోటీ గడువు తేదీ పెంపు…!
డిశంబర్ 30 లోపు మీ కార్టూన్లు పంపించాలి.
గమనిక:’తెలుగు భాష, సంస్కృతి’ అంశం పై మాత్రమే మీ కార్టూన్లు వుండాలి.
పత్రికల నుండి ప్రోత్సాహం లేదంటూ నిరుత్సాహంతో వున్న తెలుగు కార్టూనిస్టులకు ‘తానా’ రూపంలో అద్భుతమైన ప్రోత్సాహకర ప్రకటన వెలువడింది. మరి ఇంకెందుకు ఆలష్యం…! తెలుగు కార్టూన్ సత్తాను అంతర్జాతీయంగా చాటే అవకాశాన్ని కల్పిస్తోంది ‘తానా’. ఈ పోటీలో మన తెలుగు కార్టూనిస్టులందరూ పాల్గొనాలని మా ఆకాంక్ష.
తానా(తెలుగు అస్సోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా) అధ్వర్యంలో అంతర్జాతీయ స్థాయిలో కార్టూన్ల పోటీ- (లక్ష రూపాయల బహుమతులతో) డిశంబర్ 6 న ప్రకటన విడుదల చేశారు. 5000/-, 3000/- రూపాయల నగదు బహుమతులు 25 మంది కార్టూనిస్టులకు అందించాలని సంకల్పించింది. పోటీకి వచ్చిన కార్టూన్లతో డిజిటల్ ఫార్మాట్ లో పుస్తకం ‘తానా’ రూపొందిస్తుంది.
ఇట్లు
డా. తోటకూర ప్రసాద్ (తానా, డల్లాస్, అమెరికా)
తానా ప్రపంచ సాహిత్య వేదిక
మరియు
కార్య నిర్వహక సంఘం
స్పందించండి