సెప్టెంబర్ 28, 2022

సంస్మరణః మహాకవి జాషువా

Posted in కవితాజాలం, సాహితీ సమాచారం వద్ద 12:26 సా. ద్వారా వసుంధర

బాలసాహితీశిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో

సాంద్రప్రవాహ జ్వాల
జాషువా కవనహేల
(నేడు జాషువా కవిజయంతి)
“నాకవచంబహింస,సహనంబు మహాయుధ,మెక్కిరింత ధ
ర్మైకనిరూఢి,సత్యము నియంత,యనంతజగత్తు మొత్తమై
నా కెదురైన గెల్తును,వినాశపుబాంబుల
గుండెకాయలో
బాకును,
లోకమోహన సబర్మతి సన్మునికిం గుమారుడన్!”
ఈ పద్యం జాషువా” కొత్త లోకం”లోనిది. స్వాతంత్ర్యా నంతరం వ్రాసిన ఈ ఖండిక
ఒక ఆత్మ నిర్భయాన్ని ప్రకటిస్తుంది.
పద్యము నిండా నూతన జాతీయాలను కవి ఎంత చక్కగా కల్పించాడో పద్యం చదువుతుంటే మనలో దేశభక్తి ఉప్పొంగక మానదు. జాషువా గారికి గాంధీజీ అంటే ఎనలేని భక్తి. లోకమోహన సబర్మతి సన్మునికిం గుమారుడన్!”అనడంలో ఇదే మనకి స్ఫురిస్తుంది. గాంధీపై ఒక శతకమువంటి ఖండికనే వ్రాసి ఆయనపై గల భక్తిని చాటుకున్నారు జాషువా గారు. వారి కవితా భావనలలో ఎంతో నూతనత్వం వైవిధ్యం ఉంటుంది. “బాంబుల గుండెలలో బాకును” అని చెప్పడం అందుకు ఉదాహరణం.
“గబ్బిలం”తో అనలెత్తిన కవితాప్రవాహం.
“స్వప్న కథా”పర్యావరణానికి తీసుకొనిపోయి,”పిరదౌసి”కవి
వరదకన్నీటిరెప్పలక్రిందనుండిజారి,”ముంటాజమహలు”
హృదయ ద్వానాలు వినిపించి
“కాందిశీకుని”కథాప్రయాణ
ముగుండా ప్రవేశించి,
“నేతాజీ”దేశభక్తిస్తుతి
ఖండికగా వీరరసముతో
చిప్పిలి,”స్వయంవరం””కొత్తలో కం” “క్రీస్తు చరిత”,”ముసాఫరులు, “నాకథ” “నాగార్జున సాగర్”
వంటి కవితాఖండికలతో
ఈ “నవయుగ కవి చక్రవర్తి”
తెలుగు కవితామ తల్లి యశస్సును,చరిత్రను,పండించినాడు.అస్పృశ్యతాజాఢ్యమును వదలమని,కవితాకరవాలముతో పోరాడినాడు.కథాకథన విధిని వీరిపద్యము తదుపరి భావంబెట్టిదో పఠనాశక్తిని పెంచుకొను, నూత్న ప్రయోగములు,సరళసంస్కృతపదపరిమళాలు,అచ్చతెనుగు మచ్చుతునకలు కలసి
విద్యుత్వాహికలైన పద్యములనల్లినాడు.దేశభక్తినుద్ఘాటించు పద్యములు,చరిత్రకథాదీపికలు వీరికవిత్వంలో అడుగడుగునా దర్శనమిస్తాయి.ఒక నూతన ఒరవడిని సృష్టించి,నాటి మేటి కవుల సరసను నిల్చుటేగాక,
వారిచే ప్రశంసల వర్షమును
కనకాభిషేకరూపమున కురిపించుకొని,గండపెండెరమును తొడిగించికొనినాడు.
తెలుగు కవితా వనంలో
కవితాచందనవృక్షమైన జాషువాకు నతులర్పిస్తున్నాను.
కిలపర్తి దాలినాయుడు

ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: