ఆగస్ట్ 26, 2022

కొత్తవారికి ఆహ్వానంః పాడుతా తీయగా

Posted in సంగీత సమాచారం వద్ద 7:37 సా. ద్వారా వసుంధర

శ్రీ దాసరి వెంకటరమణ (వాట్సాప్) సౌజన్యంతో

సంగీత శిక్షణాలయం వారికి
నమస్సులు..!

ఈటీవీలో గత 27 సంవత్సరాలుగా ప్రసారం అవుతున్న “పాడుతా తీయగా” కార్యక్రమం గురించి మీకు ప్రత్యేకంగా వివరించక్కర్లేదు.

స్వర్గీయ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారి ప్రియ మానసపుత్రిక “పాడుతా తీయగా”. తెలుగు సినీరంగానికి ఎందరో గాయనీ గాయకులను, ప్రపంచానికి వేలమంది సంగీత కళాకారులను పరిచయం చేసిన అద్భుత వేదిక ఇది.

తెలుగు సంగీతం అనేది ఎన్నటికీ ఇంకిపోకుండా నిరంతరం కొత్త కళాకారులను ప్రోత్సహించాలి, వారికి గుర్తింపు తీసుకుని రావాలనేది బాలు గారి శాసనం. ఈటీవీ ఆశయం.

అందుకే బాలు గారి తర్వాత వారి తనయుడు ఎస్పీ చరణ్‌ పర్యవేక్షణలో “పాడుతా తీయగా” విజయవంతంగా నడుస్తోంది.

ఈ నేపథ్యంలోనే
“పాడుతా తీయగా” ద్వారా మీమీ ప్రాంతాల్లోని ప్రతిభావంతులైన యువ గాయనీ గాయకులకు అవకాశం కల్పించాలని ఈటీవీ అభిలాష.

సంగీత శిక్షణలో మీకున్న అనుభవంతో మీరు అందుకు తగిన వారిని గుర్తించటంలో సహకరించాలని కోరుకుంటున్నాము. మీనుంచి మేం ఆశిస్తున్న సహకారం ఏంటంటే…

18 ఏళ్ల నుంచి 22 ఏళ్లలోపు

8 ఏళ్ల నుంచి 12 ఏళ్లలోపు

ఈ రెండు ఏజ్‌ గ్రూప్స్‌ వాళ్లకు పాడుతా తీయగా సెలక్షన్స్ ఉంటాయి.

మీ వద్ద శిక్షణ పొందుతున్న వారిలో గాయకులుగా రాణిస్తారని మీకు నమ్మకమున్న వారిని సూచించండి.

వారు స్వయంగా పాడిన ఏదైనా పాటను వీడియో రికార్డు చేసి మాకు వాట్సప్‌లో పంపాలి.

29-8-2022 నుంచి 10-9-2022 లోపు వచ్చిన వీడియోలనే పరిగణలోకి తీసుకుంటాము.

వీడియో రికార్డు చేసే సమయంలో ఎటువంటి ఆడియో డిస్ట్రబెన్స్ లేకుండా చూసుకోగలరు.

పాట ప్రారంభించే ముందు తమ పేరు, వయస్సు, ఊరు, జిల్లా, ఫోన్‌ నెంబర్ తప్పకుండా చెప్పాకే పాట రికార్డ్ చేయాలి.

వివరాలు చెప్పకుండా వీడియో పంపితే ఒకవేళ సెలక్ట్ అయితే సమాచారం తెలపటం కష్టమవుతుంది.

ప్రాథమికంగా ఎంపికైన వారికి ఈటీవీ నుంచి సమాచారం తెలియచేస్తాము. అంతవరకూ మీనుంచి దయచేసి ఎటువంటి కాల్స్ చేయకూడదు.

వీడియోలు పంపాల్సిన వాట్సప్ నెంబర్

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: