మే 6, 2022

నేల మీద నెలవంక: ప్రతిలిపి ధారావాహికల పోటీ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 5:44 సా. ద్వారా వసుంధర

నేల మీద నెలవంక

నమస్తే..

ప్రతిలిపి నిర్వహిస్తున్న నేల మీద నెలవంక  ధారావాహికల పోటికి స్వాగతం.  ఇది రెండు నెలల పాటు జరిగే సరికొత్త పోటి. ఈ పోటికి రచయిత ఎలాంటి అంశం మీద అయినా ధారావాహికలు రాయవచ్చు. ధారావాహిక కనీసం 10 భాగాలు ఉండేలా చూసుకోవాలి. ఎలాంటి పదపరిమితి లేదు.

మీరు మీ ధారావాహికలను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు.

మీ ధారావాహికలను స్వీయప్రచురణ చేయడానికి మీ ప్రొఫైల్లోకి వెళ్ళి “వ్రాయండి” అనే బటన్ మీద క్లిక్ చేసి, కొత్తరచనను జోడించండి. మీ ధారావాహిక యొక్క శీర్షికను జత పరిచి 5-10 వాక్యాల్లో సంగ్రహాన్ని రాసి ధారావాహికను కొనసాగించి ప్రచురించండి. ప్రతిలిపి ఫోటోగ్యాలరీలో మీ ధారావాహికకు తగ్గ ఫోటోని జోడించి, విభాగం అనే చోట “కథ”ను సెలెక్ట్ చేసి, వర్గం అనే చోట “నేల మీద నెలవంక” అనే వర్గంతో పాటు మీ ధారావాహికకు సరిపోయే మరో రెండు వర్గాలను కూడా సెలెక్ట్ చేసి నేను అంగీకరిస్తున్నాను అని చివరగా ప్రచురించండి. ఈ పోటీ చివరి తేది ముగియగానే “నేల మీద నెలవంక” అనే వర్గం తీసివేయడం జరుగుతుంది. కావున మీరు తప్పకుండా “నేల మీద నెలవంక” అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను  సెలెక్ట్ చేసుకోవాలి.

బహుమతులు:

1. మొదటి బహుమతి:9000

2. రెండవ బహుమతి: 5000

3. మూడవ బహుమతి:2500

4. నాల్గవ బహుమతి: 2000

5. ఐదవ బహుమతి:1500

6. మొదటి పది మంది రచయితలకు ప్రశంసా పత్రాలు (హార్డ్ కాపీ) పంపడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

1. మీ ధారావాహికలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది:2.మే.2022

2. మీ ధారావాహికలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది:30.జూన్.2022

3. ఫలితాలు ప్రకటించే తేది: 6.జూలై.2022

తరచుగా అడిగే ప్రశ్నలు:

1. నేను ఎప్పుడూ ధారావాహిక రాయలేదు. నేను కూడా పాల్గొనవచ్చా?

తప్పకుండా పాల్గొనవచ్చు. ధారావాహిక ఎలా రాయాలో…? సందేహాలు ఉంటే మా ప్రతిలిపి బృందం మీకు సహాయం అందిస్తుంది.

2. పోటీలో ఎన్ని ధారావాహికాలైనా  రాయవచ్చా?

అవును. ఈ పోటీలో ఒక రచయిత ఎన్ని ధారావాహికాలైనా రాయవచ్చు. కాకపోతే ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలి.

3. పోటికి రాసే ధారావాహికను సబ్స్క్రిప్సన్ లో పెట్టవచ్చా?

అవును. తప్పకుండా పెట్టవచ్చు. కాకపోతే పోటీ ముగిసేలోగా మీ సిరీస్ యొక్క అన్ని భాగాలు అన్ లాక్ అయి ఉండాలి.

సలహాలు-సూచనలు:

1. మీరు ధారావాహిక రాయవలసి ఉంటుంది. ధారావాహిక ఏ అంశం మీద అయినా రాయవచ్చు. ఎన్ని ధారావాహికలు అయినా రాయవచ్చు.

2. ధారావాహిక కనీసం పది భాగాలు, అంతకు మించి ఎన్ని భాగాలు అయినా ఉండవచ్చు.  తప్పకుండా మీ ధారావాహిక యొక్క అన్ని భాగాలు ఒకే లింక్ లో ఉండాలి. అలా ఉన్న ధారావాహికలు మాత్రమే పోటీకి తీసుకొనబడతాయి. 

3. ప్రతిలిపిలో ఇంతకముందు ప్రచురించిన ధారావాహికలు పోటీకి తీసుకోబడవు. ధారావాహికలు పూర్తిగా మీ సొంతం అయి ఉండాలి. నాణ్యత ఉండి, ఇరభై కంటే ఎక్కువ భాగాలు ఉన్న ధారావాహికలను భవిష్యత్తులో ప్రీమియం విభాగంలోకి చేర్చుకునే అవకాశం ఉంటుంది.

4. తప్పనిసరిగా సంగ్రహం 5-10 వాక్యాలలో రాయాలి.

మరిన్ని సందేహాలకు events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: