ముందుమాట

కథలైనా కవితలైనా పాటలైనా పలుకులైనా నాటికలైనా నాదాలైనా- అక్షరాలతో ఊపిరి పోసుకుని అక్షరజాలంతో అర్థవంతమౌతాయి. మేము ప్రత్యేకంగా ఆరాధించే కథనీ, ఆ కథతో విడదీయరాని అనుబంధమున్న ఇతర సాహితీ ప్రక్రియల్నీ విశ్లేషించే సాహితీ సుధా కథా వేదిక- ఈ అక్షరజాలం. సాహిత్యం-సాహితీపరులు, కళలు-కళాకారులు, పత్రికలుపాత్రికేయులు, బుల్లితెరవెండితెర, సాంఘికం-రాజకీయం వగైరాలు- జాతీయంగా, అంతర్జాతీయంగా తొక్కిన పాతపుంతలు, తొక్కుతున్న నేటిపుంతలు, తొక్కనున్న కొత్తపుంతలు మన చర్చనీయాంశాలు. మా అవగాహన మేరకు తెలుగువారికీ, తెలుగు భాషకీ, తెలుగుతనానికీ ప్రాధాన్యమిచ్చినా- అభిజ్ఞులకీ వేదిక జాతి మత కుల భాషా వర్గ భేదాలకు అతీతమని మనవి. విమర్శకు సదుద్దేశ్యం, వినూత్న ప్రయోగాలకి చొరవ, ఉన్న మాట చెప్పడానికి ధైర్యం, అన్న మాట ఆకళింపు చేసుకుందుకు సహనం ముఖ్యమని గ్రహించిన సహృదయులకు తెలుగునాట కొదవలేదు. ఈ అక్షరజాలానికి రసపుష్టినివ్వాల్సిందిగా వారందరికీ మా విన్నపం.

ఈ లంకె ద్వారా కూడా మా అక్షరజాలం ని మీరు చేరుకోగలరు: vasumdhara.com

ఈ వేదికపై రచయితలెవరైనా తమ సాహితీవ్యాసంగపు వివరాలను పంచుకోవచ్చును. వారి రచనలనూ ఈ వేదికద్వారా అందజెయ్యవచ్చును.

వసుంధర రచనలు అచ్చులో వస్తున్న వివిధ  పత్రికల్లోనూ, వెబ్ పత్రికల్లోనూ వస్తున్నాయి. సమయాభావం చేత వాటిని ఎప్పటికప్పుడు పాఠకులతో పంచుకోలేకపోతున్నాం. ఆసక్తిగల పాఠకులకోసం కొంత సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాంః

ప్రసుతం వసుంధర సీరియల్ ‘ఫారిన్ వెళ్లాలం(నం)డి’ కౌముది వెబ్ పత్రికలో http://www.koumudi.net వస్తున్నది.  http://www.pratilipi.com (మచ్చుకి Telugu culture story | గతమెంతొ ఘనకీర్తి « rajagopalarao jonnalagadda “వసుంధర” | ప్రతిలిపి (pratilipi.com)) మా పాత రచనల్నీ;  manatelugukathalu.com (మచ్చుకి కృష్ణగాడి – వీర – ప్రేమగాథ – Krishnagadi – Vira – Premagatha – By Vasundhara (manatelugukathalu.com)) మా కొత్త రచనల్నీ తరచుగా పాఠకులకు అందిస్తున్నాయి. వసుంధర రచనలు, పుస్తకాల వివరాలకు లంకెః వసుంధర రచనలు | వసుంధర అక్షరజాలం (vasumdhara.com) 

ఈ క్రింది లంకెలు కూడా వీక్షకులకు ఉపయోగపడవచ్చు. ఇందులోని వివరాలకు అదనపు సమాచారం జోడించి సవరించవలసి ఉన్నదిః

సాహితీ సమాచారం  సాహితీవైద్యం  పుస్తకాలు   మన కథకులు   మన పత్రికలు మన పాత్రికేయులు  విద్యావేత్తలు  వసుంధర   Flat Forum

 

221 వ్యాఖ్యలు »

 1. madhu said,

  వ‌సుంధ‌ర విజ్ఞాన వికాస మండ‌లి
  సామాజిక యువ‌చైత‌న్య వేదిక
  రి.నెం-4393-96‌
  8ఇంక్లయిన్‌కాల‌నీ, గోదావ‌రిఖ‌ని
  పెద్ద‌ప‌ల్లి జిల్లా ,తెలంగాణ‌రాష్ట్రం

  చంద్రమోహ‌న్ స్మార‌క పుర‌స్కారాలు
  గ‌త ఆరేండ్లుగా విద్యారంగంలో కృషిచేస్తున్న వారికి ఇస్తున్న బామండ్ల‌ప‌ల్లి చంద్ర‌మోహ‌న్ స్మార‌క పుర‌స్కారాల‌ను రెండు సంవ‌త్స‌రాల‌కు గాను ప్ర‌క‌టిస్తున్నాము. గ‌తేడాది క‌రోనా మూలంగా ఇవ్వ‌లేక‌పోయిన పుర‌స్కారంతో పాటు ఈ ఏడాది పుర‌స్కారం కూడా ప్ర‌క‌టిస్తున్నాం.
  విద్యారంగంలో స‌మూల మార్పులు, విద్యార్థుల్లో విద్యా నైపుణ్య‌త పెంపుద‌ల‌కు కృషిచేస్తున్న వారికి ఈ పుర‌స్కారాల‌ను అందిస్తున్నాము. కాగా 2020 సంవ‌త్స‌రానికి గాను స్నేహ‌ల‌త ఉపాధ్యాయురాలు (క‌ల్వ‌చ‌ర్ల, ప్ర‌భుత్వ‌పాఠ‌శాల‌), కె. మాధూరి ఉపాధ్యాయురాలు (బాలికోన్న‌త పాఠ‌శాల‌, గోదావ‌రిఖ‌ని)ల‌కు సంయుక్తంగా పుర‌స్కారాన్ని అందించ‌నున్నాము. 2021 సంవ‌త్స‌రానికి గాను అన్న‌వ‌రం శ్రీనివాస్, స్కూల్ అసిస్టెంట్‌, వేగురుప‌ల్లి మాన‌కోండూరును ఎంపిక చేయ‌డం జ‌రిగింది. త్వ‌ర‌లోనే ఈ పుర‌స్కారాల తేదిని ప్ర‌క‌టిస్తాము.

  మధుక‌ర్ వైద్యుల‌, వ్య‌వ‌స్థాప‌కులు, చదువువెంక‌ట‌రెడ్డి అధ్య‌క్షులు, క‌ట్కూరిశంక‌ర్‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్‌, భూమ‌య్య‌, ప్ర‌.కార్య‌దర్శి, మంద‌ల ర‌వింద‌ర్‌రెడ్డి.

 2. madhu said,

  వ‌సుంధ‌ర విజ్ఞాన వికాస మండ‌లి
  (సామాజిక యువ చైత‌న్య వేదిక‌)
  స్థాపితం-1993. రినెం-4393-96
  గోదావ‌రిఖ‌ని, పెద్ద‌ప‌ల్లి జిల్లా-తెలంగాణ రాష్ర్టం

  గ‌త 28 ఏండ్లుగా వివిధ ఆంశాల‌పై నిర్వ‌హిస్తున్న సాహిత్య‌, సామాజిక‌, సాంస్కృతిక కార్య‌క్ర‌మాల‌ను ఆద‌రిస్తున్న తెలుగు ప్ర‌జ‌ల‌కు ధ‌న్య‌వాదాలు. ఈ క్ర‌మంలో క‌రోనా చ‌దువులు అనే అంశంపై పాఠ‌శాల స్థాయి విద్యార్థుల‌కు రాష్ర్ట స్థాయిలో నిర్వ‌హించిన క‌విత‌ల పోటీకి అనుహ్య స్పంద‌న వ‌చ్చింది. కాగా మేము ప్ర‌క‌టించిన‌ట్టు పోటీకి వ‌చ్చిన క‌విత‌ల్లో ఐదు ఉత్త‌మ క‌విత‌ల‌ను మా న్యాయ నిర్ణేత‌లు నిర్ణ‌యించారు. వీరికి ఐదు స‌మాన బహుమ‌తులు త్వ‌ర‌లోనే అంద‌జేస్తాము.
  విజేత‌ల వివ‌రాలు
  1.ఈదులకంటి నందిని- ప‌ద‌వ‌త‌ర‌గ‌తి, పివీ రంగారావు టీఎస్సార్ స్కూల్ -వంగ‌ర (వ‌రంగ‌ల్ రూర‌ల్‌)
  2. గంటా పౌలినా ఏంజిలిన్‌- 7వ‌త‌ర‌గ‌తి, సెంట్ ఆన్స్‌స్కూల్ ,భీమ‌వ‌రం, పశ్చీమ‌గోదావ‌రి జిల్లా ( ఆంధ్ర‌ప్ర‌దేశ్‌)
  3.ఎన్‌. రోహిణీ, 9వ త‌ర‌గ‌తి, జిల్లాప‌రిష‌త్ స్కూల్‌, కొండ‌పాక‌, సిద్దిపేట జిల్లా
  4. ఆదివైష్ణ‌వి, ప‌ద‌వ‌త‌ర‌గ‌తి, జిల్లా ప‌రిష‌త్ స్కూల్, త‌డ‌పాక‌ల్, ఏర్గ‌ట్ల , నిజామాబాద్ జిల్లా
  5. పి.న‌వ‌నీత‌, 9వ‌త‌ర‌గ‌తి, జిల్లా ప‌రిష‌త్ స్కూల్, దేవ‌ర‌క‌ద్ర‌, మ‌హాబూబ్‌న‌గ‌ర్ జిల్లా

  మ‌ధుక‌ర్ వైద్యుల‌, వ్య‌వ‌స్థాప‌కులు, చ‌దువు వెంక‌ట‌రెడ్డి అధ్య‌క్షులు, క‌ట్కూరి శంక‌ర్‌, వ‌ర్కింగ్ ప్రెసిడెంట్,
  మంద‌ల ర‌వింద‌ర్‌రెడ్డి, శాశ్వ‌త ఆహ్వానితులు భూమ‌య్య ప్ర‌ధాన‌కార్య‌ద‌ర్శి


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.