ముందుమాట

కథలైనా కవితలైనా పాటలైనా పలుకులైనా నాటికలైనా నాదాలైనా- అక్షరాలతో ఊపిరి పోసుకుని అక్షరజాలంతో అర్థవంతమౌతాయి. మేము ప్రత్యేకంగా ఆరాధించే కథనీ, ఆ కథతో విడదీయరాని అనుబంధమున్న ఇతర సాహితీ ప్రక్రియల్నీ విశ్లేషించే సాహితీ సుధా కథా వేదిక- ఈ అక్షరజాలం. సాహిత్యం-సాహితీపరులు, కళలు-కళాకారులు, పత్రికలుపాత్రికేయులు, బుల్లితెరవెండితెర, సాంఘికం-రాజకీయం వగైరాలు- జాతీయంగా, అంతర్జాతీయంగా తొక్కిన పాతపుంతలు, తొక్కుతున్న నేటిపుంతలు, తొక్కనున్న కొత్తపుంతలు మన చర్చనీయాంశాలు. మా అవగాహన మేరకు తెలుగువారికీ, తెలుగు భాషకీ, తెలుగుతనానికీ ప్రాధాన్యమిచ్చినా- అభిజ్ఞులకీ వేదిక జాతి మత కుల భాషా వర్గ భేదాలకు అతీతమని మనవి. విమర్శకు సదుద్దేశ్యం, వినూత్న ప్రయోగాలకి చొరవ, ఉన్న మాట చెప్పడానికి ధైర్యం, అన్న మాట ఆకళింపు చేసుకుందుకు సహనం ముఖ్యమని గ్రహించిన సహృదయులకు తెలుగునాట కొదవలేదు. ఈ అక్షరజాలానికి రసపుష్టినివ్వాల్సిందిగా వారందరికీ మా విన్నపం.

ఈ లంకె ద్వారా కూడా మా అక్షరజాలం ని మీరు చేరుకోగలరు: vasumdhara.com

ఈ వేదికపై రచయితలెవరైనా తమ సాహితీవ్యాసంగపు వివరాలను పంచుకోవచ్చును. వారి రచనలనూ ఈ వేదికద్వారా అందజెయ్యవచ్చును.

వసుంధర రచనలు అచ్చులో వస్తున్న వివిధ  పత్రికల్లోనూ, వెబ్ పత్రికల్లోనూ వస్తున్నాయి. సమయాభావం చేత వాటిని ఎప్పటికప్పుడు పాఠకులతో పంచుకోలేకపోతున్నాం. ఆసక్తిగల పాఠకులకోసం కొంత సమాచారాన్ని ఇక్కడ ఇస్తున్నాంః

ప్రసుతం వసుంధర సీరియల్ ‘ఫారిన్ వెళ్లాలం(నం)డి’ కౌముది వెబ్ పత్రికలో http://www.koumudi.net వస్తున్నది.  http://www.pratilipi.com (మచ్చుకి Telugu culture story | గతమెంతొ ఘనకీర్తి « rajagopalarao jonnalagadda “వసుంధర” | ప్రతిలిపి (pratilipi.com)) మా పాత రచనల్నీ;  manatelugukathalu.com (మచ్చుకి కృష్ణగాడి – వీర – ప్రేమగాథ – Krishnagadi – Vira – Premagatha – By Vasundhara (manatelugukathalu.com)) మా కొత్త రచనల్నీ తరచుగా పాఠకులకు అందిస్తున్నాయి. వసుంధర రచనలు, పుస్తకాల వివరాలకు లంకెః వసుంధర రచనలు | వసుంధర అక్షరజాలం (vasumdhara.com) 

ఈ క్రింది లంకెలు కూడా వీక్షకులకు ఉపయోగపడవచ్చు. ఇందులోని వివరాలకు అదనపు సమాచారం జోడించి సవరించవలసి ఉన్నదిః

సాహితీ సమాచారం  సాహితీవైద్యం  పుస్తకాలు   మన కథకులు   మన పత్రికలు మన పాత్రికేయులు  విద్యావేత్తలు  వసుంధర   Flat Forum

 

221 వ్యాఖ్యలు »

  1. madhu said,

    వ‌సుంధ‌ర విజ్ఞాన వికాస మండ‌లి
    (సామాజిక యువ చైత‌న్యవేదిక‌)
    రినెం-4393-96, స్థాపితం-1993
    8వ ఇంక్ల‌యిన్‌కాల‌నీ, గోదావ‌రిఖ‌ని, పెద్ద‌ప‌ల్లి జిల్లా

    గ‌డ‌చిన 27 ఏండ్లుగా వివిధ సంద‌ర్భాల‌కు అనుగుణంగా వ‌సుంధ‌ర విజ్ఞాన వికాస మండ‌లి సామాజిక‌, సాంస్కృతిక‌, విజ్ఞాన కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తున్న‌ది. గ‌త గ‌త ఏడాది క‌రో్నా కార‌ణంగా కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించ‌లేక‌పోయాం. ప్ర‌తి ఏడాది రాష్ట్ర‌స్థాయి పాఠ‌శాల‌ల విద్యార్థుల‌ను ప్రోత్స‌హించేందుకు నిర్వ‌హిస్తున్న రాష్ట్ర స్థాయి క‌విత‌ల పోటీల‌లో భాగంగా ఈ ఏడాది (క‌రోనాచ‌దువులు) అనే అంశం మీదా ప‌ద‌వ‌త‌ర‌గ‌తి లోపు విద్యార్థుల నుంచి క‌విత‌లు ఆహ్వానిస్తున్నాము. మాకు వ‌చ్చిన క‌విత‌ల్లో ఐదు ఉత్త‌మ క‌విత‌ల‌కు బ‌హుమ‌తులు అంద‌జేస్తాం. క‌వితలు మాకు చేరాల్సిన చివ‌రితేది ఫిబ్ర‌వ‌రి 20.
    అంశం- క‌రోనాచ‌దువులు
    చివరితేది- 20 ఫిబ్ర‌వ‌రి 2021
    క‌విత‌లు పంపాల్సిన చిరునామా
    చ‌దువు వెంక‌ట‌రెడ్డి
    అధ్య‌క్షులు
    వ‌సుంధ‌ర విజ్ఞాన వికాస మండ‌లి
    క్వార్ట‌ర్‌నెం- టీటూ-881, తిల‌క్‌న‌గ‌ర్‌
    గోదావ‌రిఖ‌ని-505209, పెద్ద‌ప‌ల్లి జిల్లా.
    సంప్ర‌దించాల్సిన పోన్‌నెంబ‌ర్లు- 9182777409, 9492463462,9849950188

  2. Sirisha said,

    Sir, we were unable to reach “Rachana” Sai garu on his landline number in Hyderabad. Could you please mail me details of his new contact number?

    • sai garu’s landline is not working properly. i sought his permission before giving his mobile number. sorry for the delay you may contact him at 99485 77517.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.