ఆగస్ట్ 16, 2018

కవితలకు ఆహ్వానం

Posted in సాహితీ సమాచారం, Uncategorized వద్ద 7:05 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచార కలశం సౌజన్యంతో

కాళేశ్వరం ప్రాజెక్టు పై కవితా సంకలనం కొరకు కవితలకు ఆహ్వానం…

ప్రాజెక్టులు ఆధునిక దేవాలయాలు.
రాష్ట్రంలో ఎంతో ప్రతిష్టాత్మకమైన కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో రూపశిల్పులకు కవుల అక్షరనీరాజనం…

మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం మరియు జయశంకర్ సారస్వత సమితి సంయుక్తంగా.. కాళోజి జయంతిన జరుపుకునే తెలంగాణా భాషా దినోత్సవం పురస్కరించుకోని… సెప్టెంబరు తొమ్మిది (09-09-2018) న కాళేశ్వరం ఆలయ ప్రాంగణంలో ఇంజీర్లకు అక్షరనీరాజనం అందించడంతో పాటు కవి సమ్మేళనం మరియు సంకలన ఆవిష్కరణ చేయడం జరుగుతుంది.

కావున ఇట్టి మహత్కార్యంలో మీరు పాల్గొని మీకవితలను అందించి ఆధునిక దేవాలయ రూపశిల్పులకు అక్షర నీరాజనం అందించండి.

మీ కవితలను ఈ నెల ఇరువై అయిదవ తేదీ (25-08-2018) వరకు పంపవలసి ఉంటుంది.

మీరు పంపే కవనం పద్య గద్య గేయ, వచనము ఇలా ఏ రూపంలో అయినా పంపవచ్చు. కాకపోతే పదహారు లైన్లకు మించి యుండరాదు.
మీ పరిచయం నాలుగు లైన్లకు మించి ఉండరాదు.

అక్షరదోషాలు ఉండకుండా భావయుక్తమైన కవితలను మాత్రమే స్వీకరించబడుతుంది.
మీ కవితల ఎంపిక విషయంలో సంకలనకర్తలదే తుది నిర్ణయం.

మరెందుకు ఆలస్యం… వెంటనే మీ కవితలను పంపించండి..

మరిన్ని వివరాలకు సంప్రదించండి

సంకలన కర్తలు:-
గోగులపాటి కృష్ణమోహన్
అధ్యక్షులు
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రచయితల సంఘం
9700007653
మరియు

గడ్డం లక్ష్మయ్య
జయశంకర్ సారస్వత సమితి
9848693280

మీకు ఆసక్తి ఉంటే వెంటనే ఈ క్రింది లింకు ద్వారా గ్రూపులో చేరవచ్చు…

అంశానికి సంబంధించిన కవితలు తప్ప మరేవిధమైన పోస్టులు పెట్టరాదని విజ్ఙప్తి.

ఈ పోస్టును మీకు తెలిసిన అన్ని సాహిత్య గ్రూపులకు చేరవేయగలరు.

https://chat.whatsapp.com/0fmXn2tTjJyAGLW7KHCKwd

ఆగస్ట్ 15, 2018

ఆహ్వానం- చైతన్యభారతి

Posted in సాహితీ సమాచారం, Uncategorized వద్ద 1:01 సా. ద్వారా వసుంధర

invite

ఆహ్వానం – డిట్రాయిట్ తెలుగు సమితి

Posted in సాహితీ సమాచారం, Uncategorized వద్ద 12:54 సా. ద్వారా వసుంధర

detroit

దేశభక్తి కథల పోటీలు – ప్రతిలిపి

Posted in కథల పోటీలు, Uncategorized వద్ద 12:52 సా. ద్వారా వసుంధర

“భారతదేశం నా మాతృభూమి భారతీయులంతా నా సహోదరులు” ఈ వాఖ్యమొకటి చాలు కదా మనమంతా ఒకటేనని చెప్పడానికి. అఖండ భారతదేశంలో వివిధ ప్రాంతాల వారు వివిధ అభిప్రాయాలు కలిగి ఉంటారు. కానీ మనమంతా కలిసి జరుపుకునే అతి పెద్ద పండుగ స్వాతంత్ర దినోత్సవం. మరి మన దేశానికి స్వాతంత్రం కోసం ఆనాడు ఎంతోమంది వారి జీవితాలను త్యాగం చేశారు. అలాగే నేడు మన సైనికులు, నేవీ, రక్షణ అధికారులు ఇలా వివిధ రంగాలలో మన దేశాన్ని ఇంకా అనుక్షణం కాపాడుతూనే ఉన్నారు. వారి సేవలను స్మరించుకోవడానికి ప్రతిలిపి కథల పోటీతో మీ ముందుకు వచ్చింది.

దేశభక్తికి సంబంధించిన కథలు ప్రతిలిపి ఆహ్వానిస్తోంది. మీరు రాసే కథలలోని పాత్రలు దేశం కోసం ఎలా పోరాడాయి, దేశం కోసం ఎలాంటి త్యాగాలు చేశాయి, ఇలా ఏదైనా భారతదేశాన్ని దృష్టిలో ఉంచుకొని మీ కథలు పంపవలసి ఉంటుంది. ఈ స్వాతంత్ర దినోత్సవం ఒక మంచి దేశభక్తీ కథ మన ప్రతిలిపి పాఠకులు అందివ్వండి.

ఈ పోటిలో గెలుపొందిన వారికి బహుమతులు క్రింది విధముగా ఉండును:-

మొదటి బహుమతి :- 1500
రెండవ బహుమతి :-1000
మూడవ బహుమతి : 500

ఈ పోటీలో పాల్గొనడానికి పద్ధతులు :

మొదటిది :
a)ఈ పోటీకి మీ కథలను సమర్పించడానికి క్రింద ఉన్న “పాల్గొనండి” బటన్ పై క్లిక్ చేసి సులువుగా మీ కథలను అప్లోడ్ చేయండి.
b) కథలను అప్లోడ్ చేయగానే క్రింద ఇచ్చిన స్పేస్ లో మీ రచనలు కనపడుతాయి.
c) మీ కథలను గడువుకు రెండు రోజుల ముందు పాఠకులకు మరియు మీ ప్రొఫైల్ లోకి జతచేయబడును.
d) ఈ సదుపాయం కేవలం డెస్క్టాప్, ల్యాప్టాప్ మరియు మొబైల్ వెబ్సైట్ నుండి చేయవచ్చు. యాప్ కి అందుబాటులో లేదు గమనించగలరు. 

రెండవది :
మీ కథలు తెలుగులో టైపు చేసి యూనికోడ్ ఫార్మాట్ లో telugu@pratilipi.com కి మెయిల్ చేయండి. మెయిల్ సబ్జెక్టు లో “దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ ” అని రాయడం మరవద్దు.

నియమాలు :-

1.ప్రతి రచయిత ఐదు కథల వరకు పంపవచ్చు. కథలు మీ సొంతం అయ్యి ఉండాలి.
2. పూర్వం ప్రతిలిపిలో ప్రచురింపబడిన రచనలు పోటికి పంపరాదు, వేరే ఎక్కడైనా ప్రచురణ అయినవి స్వీకరించబడును.
3. యూనికోడ్ కాకుండా ఇతర ఏ ఫార్మాట్ వెబ్ సైట్ లో అప్లోడ్ చేయలేము కనుక మీ కథలు యూనికోడ్ లో పంపి సహకరించగలరు.

ముఖ్యమైన తేదీలు :
1.మీ రచనలు పంపడానికి చివరి తేది ఆగస్ట్ – 28 – 2018.
2 ఆగస్ట్ – 28 -2018 నుండి ఆగస్ట్ – 29 – 2018 మధ్య మీ రచనలు వెబ్ సైట్ లోకి అప్లోడ్ చేస్తాము.
3. ఆగస్ట్ -29- 2018  న ఫలితాలు ప్రకటించే తేదిని తెలుపబడును. 

ఫలితాలు ప్రకటించే పద్ధతి :
విజేతల ఎంపిక రచనలకు వచ్చిన పాఠకుల సంఖ్య, రేటింగ్ మరియు రచనను చదవడానికి పాఠకులు కేటాయించిన సమయం వీటిని పరిగణంలోకి తీసుకోని మా సాంకేతిక వర్గం అందించే పట్టిక ఆధారంగా విజేతలను ప్రకటించబడును.మీ కథలను అత్యధిక పాఠకులకు చేరవేసే ప్రయత్నం చేస్తాము.

సందేహాలకు : మెయిల్ – telugu@pratilipi.com  మొబైల్ – 7259511956

ధన్యవాదములు

ఇట్లు

మీ భవదీయుడు

జాని.తక్కెడశిల

ప్రతిలిపి (తెలుగు విభాగం,రచయితల అనుసంధాన కర్త )

బెంగళూరు

మొబైల్ –7259511956

watsup:9491977190

ప్రతిలిపి యాప్ డౌన్లోడ్ కొరకు లింక్ పై క్లిక్ చేయండి  http://goo.gl/xXSuaO

ఆగస్ట్ 11, 2018

కథల పోటీ – జాగృతి వారపత్రిక

Posted in కథల పోటీలు, Uncategorized వద్ద 8:09 సా. ద్వారా వసుంధర

సాహిత్య సమాచార కలశం వాట్సాప్ గ్రూప్ సౌజన్యంతో

jagruti sk

తర్వాతి పేజీ