మార్చి 7, 2023

వచన కవితా పోటీ ఫలితాలుః ఎంవిఆర్ ఫౌండేషన్

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 5:54 సా. ద్వారా వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం (వాట్‍సాప్) సౌజన్యంతో

శుభోదయం
ఎం.వి.ఆర్.ఫౌండేషన్,
హైదరాబాద్
భారత అమృతోత్సవాల సందర్భంగా నిర్వహించిన వచన కవితా పోటీల ఫలితాలు
ఈ పోటీలకు అందిన కవితలను పరిశీలించి బహుమతి కవితలను ఎంపిక చేసిన న్యాయనిర్ణేత సుప్రసిద్ధ కవయిత్రి డాక్టర్ సి. భవానీ దేవి గారికి ఎం.వి.ఆర్. ఫౌండేషన్ తరుపున హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిజేస్తున్నాము.
ఈ పోటీకి అందిన కవితలలో విశిష్ట కవితగా ‘అప్పుడే మన స్వతంత్రకు పరమార్థం’ ను గుర్తించి ఆ కవిత రచయిత
శ్రీ ఉప్పలూరి ఆత్రేయ శర్మ గారిని 2000 రూపాయల ప్రత్యేక పురస్కారానికి ఎంపిక చేయటం జరిగింది.

ప్రధమ బహుమతి
శ్రీ శింగరాజు శ్రీనివాస రావు..ఒంగోలు వారు రచించిన ‘ఐక్యభారత్’ కవిత
2000 రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నది.

ద్వితీయ బహుమతి
శ్రీ రాజేశ్వరరావు లేదాళ్ళ..
లక్షెట్టి పేట వారు రచించిన ‘ప్రగతిపథం’ కవిత 1000 రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నది.

తృతీయ బహుమతి
శ్రీ వడ్డాది రవికాంత శర్మ..
అశోక్ నగర్,హైదరాబాద్ వారు రచించిన ‘దేశమాత ప్రార్థన’ కవిత 500 రూపాయల నగదు బహుమతిని గెలుచుకున్నది.

ఈ పోటీలో పాల్గొన్న కవులకు, కవయిత్రులకు ప్రతిఒక్కరికీ ప్రత్యేక ధన్యవాదాలు.

నిర్వహణ
మట్టిగుంట వెంకటరమణ

మార్చి 4, 2023

ఉగాది కవితల పోటీః ప్రజామణిపూస

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 4:16 సా. ద్వారా వసుంధర

సాహిత్య సమాచారకలశం (వాట్‍సాప్) సౌజన్యంతో

ఫిబ్రవరి 20, 2023

కథలు, కవితల పోటీః సాహో

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 11:41 ఉద. ద్వారా వసుంధర

సాహిత్య సమాచారకలశం (వాట్‍సాప్) సౌజన్యంతో

ఫిబ్రవరి 11, 2023

2023 కథా, కవితా పురస్కారాల పోటీలుః నెచ్చెలి

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 10:17 ఉద. ద్వారా వసుంధర

నెచ్చెలి పత్రిక (ఈమెయిల్) సౌజన్యంతో

 నెచ్చెలి-2023 కథా, కవితా పురస్కారాల పోటీలు

(ఆఖరు తేదీ మే10, 2023)

నెచ్చెలి 4వ వార్షికోత్సవం (జూలై10, 2023) సందర్భంగా నిర్వహిస్తున్న  కథా, కవితా పురస్కార పోటీలకు రచనలకు ఆహ్వానం!

మొదటి బహుమతి పొందిన కథకు
*శ్రీమతి కె.వరలక్ష్మి ఉత్తమ కథా పురస్కారం*

మొదటి బహుమతి పొందిన కవితకు
*డా|| కె.గీత ఉత్తమ కవితా పురస్కారం*

బహుమతులు:

కథలకు:
మొదటి బహుమతి (ఉత్తమ కథా పురస్కారం)- రూ.2500/-
ద్వితీయ బహుమతి – రూ.1500/-
తృతీయ బహుమతి – రూ.1000/-
ప్రత్యేక బహుమతులు – 2- రూ.500/-

కవితలకు:
మొదటి బహుమతి (ఉత్తమ కవితా పురస్కారం)- రూ.1500/-
ద్వితీయ బహుమతి – రూ.1000/-
తృతీయ బహుమతి – రూ.500/-
ప్రత్యేక బహుమతులు -4- రూ.250/-

సాధారణ ప్రచురణకు 20 కథలు, 20 కవితలు స్వీకరించబడతాయి.

ఎంపిక చేసిన కథలు, కవితలు “నెచ్చెలి”లో జూలై నెల నుండి నెలనెలా ప్రచురింప బడతాయి.

నిబంధనలు:-
* ఇతివృత్తం: స్త్రీలకి సంబంధించిన అంశం ఏదైనా.  
* రచనతో బాటూ ఎక్కడా ప్రచురణ కాలేదనీ, పరిశీలనకు పంపలేదని హామీపత్రం జతచెయ్యాలి. హామీపత్రం లేని కథలు, కవితలు స్వీకరించబడవు.
* కథలు వర్డ్ ఫైల్ లో పది పేజీలకు మించకుండా, కవితలు వర్డ్ ఫైల్ లో 2 పేజీలకు మించకుండా తప్పనిసరిగా యూనికోడ్ లో ఉండాలి.  పీడీఎఫ్ కూడా జత చెయ్యాలి.
* ఒక్కొక్కరు ఒక్క కథ (లేదా) ఒక కవిత- ఏదైనా ఒక్కటి మాత్రమే పంపాలి.
* రచనతో బాటూ చిన్న పారాగ్రాఫులో యూనికోడ్ లో రచయిత(త్రి) పరిచయం, ఫోటో, ఈ-మెయిలు, ఫోను నంబరు జతపరచాలి.
* ఈ-మెయిలు మీద “ నెచ్చెలి- కథ-కవితల పోటీ-2023కి” అని రాసి editor@neccheli.com కు పంపాలి.
*నెచ్చెలిలో నచ్చిన మూడు రచనల మీద గానీ, నెచ్చెలి యూట్యూబ్ వీడియోల మీద గానీ విశ్లేషణాత్మక వ్యాఖ్యలు పత్రికలో (లేదా) యూట్యూబులో తప్పనిసరిగా పోస్టు చెయ్యాలి. పోస్టు చేసిన వ్యాఖ్యల వివరాలు ఈ-మెయిలుకి జతపరచాలి.
* రచనలు చేరవలసిన ఆఖరుతేదీ: మే10, 2023. గడువుతేదీ తర్వాత అందినవి పరిశీలింపబడవు.
* బహుమతుల విషయంలో న్యాయనిర్ణేతలదే తుది నిర్ణయం. ఈ విషయంలో ఉత్తర ప్రత్త్యుత్తరాలకు తావులేదు.
* పోటీ ఫలితాలు “నెచ్చెలి” 4వ జన్మదిన సంచికలో జూలై 10, 2023న వెలువడతాయి.

***

నిర్వాహకులు:
డా.కె.గీత, సంస్థాపక సంపాదకులు,  నెచ్చెలి అంతర్జాల వనితా మాస పత్రిక

ఉగాది కవితల పోటీ ఫలితాలుః సాహితీకిరణం

Posted in కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 9:16 ఉద. ద్వారా వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం (వాట్‍సాప్) సౌజన్యంతో

గత పేజీ · తర్వాతి పేజీ