సెప్టెంబర్ 6, 2016

జ్యోత్స్నస్మారక కవితల పోటీ

Posted in కథల పోటీలు, Uncategorized వద్ద 7:36 సా. ద్వారా వసుంధర

ఈ సమాచారం అందించిన శ్రీ ఆనందరావు పట్నాయక్‍కి ధన్యవాదాలు. 

రాయగడ రచయితల సంఘం(రారసం) మూడవ వార్షికోత్సవం పురస్కరించుకొని జాతీయస్థాయి కవితలపోటీ నిర్వహిస్తోంది. ఈ కింద నీయబడిన ఇతివృత్తంతో మప్ఫయి పంక్తులకు మించకుండ కవితలు రాయాలి. ఒక్కొక్కరు ఎన్నైనా కవితలు పంపవచ్చు.

  1. అడపిల్లను ఆదుకో. ఆడపిల్లను చదివించు
  2. .ప్రకృతి
  3. మానవీయ విలువలు

హామీపత్రం మీద మాత్రమే రచయిత, రచయిత్రుల పేర్లు ఉండాలి. ఫోను నంబరు విధిగా రాయప్రార్ధన. కవితలు ఈ దిగువ చిరునామాకి 30-09-2016 నాటికి చేరాలి.

  1. ఆనందరావుపట్నాయక్, నేతాజీనగర్, రాయగడ-765001
  2. సింగిడి రామారావు, నాల్గవ వీధి, శాస్త్రినగర్, రాయగడ-765001

విజేతలకు 08-10-2016 తేదీన జరిగిన వార్షికోత్సవ సభలో కిందపేర్కొన్న బహుమతులీయబడును

  1. ప్రధమ బహుమతి- రూ.750, జ్ఞాపిక, ప్రశంసాపత్రం
  2. ద్వితీయ బహుమతి-500, , జ్ఞాపిక, ప్రశంసాపత్రం
  3. తృతీయ బహుమతి-300, , జ్ఞాపిక, ప్రశంసాపత్రం
  4. ప్రోత్సాహక బహుమతులు-200, జ్ఞాపిక, ప్రశంసాపత్రం

 

ఫిబ్రవరి 29, 2016

సాహితీ విశేషాలు – సాక్షి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం, Uncategorized వద్ద 10:19 సా. ద్వారా వసుంధర

lit inf

ఫిబ్రవరి 28, 2016

సాహితీ విశేషాలు (తెలుగు వెలుగు మార్చి 2016)

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం, Uncategorized వద్ద 8:50 సా. ద్వారా వసుంధర

telugu velugu march 2016 potilu

ఫిబ్రవరి 27, 2016

వ్యాసరచన పోటీ- జాగృతి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం, Uncategorized వద్ద 4:09 సా. ద్వారా వసుంధర

అంశం : తీవ్రవాదంపై పోరాటంలో యువత పాత్ర

ప్రపంచంలో తీవ్రవాదం పెరిగిపోతున్నది, తీవ్రవాదులు ఎక్కడ పడితే అక్కడ బాంబులు పెట్టి అమాయక పౌరులను నిర్దాక్షిణ్యంగా హతమారుస్తున్నారు. తుపాకులతో కాల్చేస్తున్నారు. ఒక యుద్ధమే చేస్తున్నారు. ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని మతాల-వర్గాలకు చెందిన ప్రజలు ఈ మారణ¬మానికి  ఆహుతి అవుతున్నారు. చివరకు పసిపిల్లలను కూడా వదలటం లేదు. జాలి, దయ, కరుణ, నీతి, నియమం లేని ఈ తీవ్రవాదాన్ని అంతమొందించాలంటే నేటి సమాజం, దేశాలు, ప్రపంచం ఏమి చేయాలి? ఏ విధంగా పోరాడాలి? ఈ పోరాటంలో యువతరం పాత్ర ఏమిటి? అనే అంశాలపై స్ఫూర్తివంతమైన వ్యాసం రాయండి.

ఈ పోటీలో ఎంపికైన వ్యాసాలకు మొదటి, రెండవ, మూడవ బహుమతులుంటాయి. బహుమతి పొందిన వ్యాసాలను జాగృతి పత్రికలో ప్రచురిస్తాము.

*     వ్యాసపోటీలో 25, ఆలోపు వయసు గల వారు మాత్రమే పాల్గొనాలి. రచనతోపాటు రచయిత ఫోటో పంపాలి.

*     వ్యాసం నిడివి 1200 పదాల నుండి 1500 పదాలు. ప్రచురిస్తే 3 పుటలకు మించరాదు. వ్యాసం రాసిన పుటలలో ఎక్కడా రచయిత పేరు, చిరునామా రాయరాదు.

*     వ్యాసం తమ సొంతమేనని చెపుతూ పేరు, పూర్తి చిరునామాతో విడిగా హామీపత్రం జతచేయాలి.

*    వ్యాసాలను టైపు చేసి లేదా చక్కగా చేతితో రాసి ఈ క్రింది చిరునామాకు పోస్టు చేయండి, లేదా మెయిల్‌ చేయండి.

వ్యాసం చేరడానికి ఆఖరు తేది 7 మార్చి, 2016

చిరునామా : వ్యాసరచన పోటీ, జాగృతి వారపత్రిక, 3-4-228/4/1, కాచిగూడ, హైదరాబాద్‌ – 500027. ఇ మెయిల్‌ : jagritiweekly@gmail.com

పోటీలో విజేతలకు బహుమతులు

ప్రథమ బహుమతి రూ. 5000/-

ద్వితీయ బహుమతి రూ. 3000/-

తృతీయ బహుమతి రూ. 2000/-

ఫిబ్రవరి 7, 2016

కథల పోటీ- సాక్షి

Posted in కథల పోటీలు, Uncategorized వద్ద 1:52 సా. ద్వారా వసుంధర

ఈ సమాచారం అందించిన శ్రీ రాజేష్ యాళ్లకి ధన్యవాదాలు.

సాక్షి

story comp sakshi

తరువాతి పేజీ