జనవరి 14, 2023

ముత్యాల ముగ్గు పోటీః తెలుగు NRI రేడియో

Posted in ఇతర పోటీలు, కళారంగం వద్ద 6:41 సా. ద్వారా వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం (వాట్‍సాప్) సౌజన్యంతో

ప్రపంచ వ్యాప్తంగా వివిధ దేశాల్లో ఉన్న మహిళలందరికీ సంక్రాంతి పండగ సందర్భంగా సువర్ణ అవకాశం..! తెలుగు NRI రేడియో ( తెలుగువారి గుండె చప్పుడు ) నిర్వహిస్తున్న ముత్యాల ముగ్గు కాంటెస్టులో పాల్గొనండి..! ఎన్నో ఆకర్షణీయమైన బహుమతులు
గెలుపొందండి..!

అంద‌మైన ముత్యాల ముగ్గులు వేసి గెలుపొందిన వారికీ

1st ప్రైజ్ – లక్ష విలువ గల గోల్డ్ పెండెంట్.. స్పాన్సర్డ్ బై .. మాయ జువెల్లర్స్. http://www.maayafinejewels.com

2nd ప్రైజ్ – శాంసంగ్ 5 జి ఫోన్

3rd ప్రైజ్ – లేటెస్ట్ ఒప్పో 5జి ఫోన్ లను అందివ్వ‌బోతున్నామ‌ని తెలుపుట‌కు సంతోషిస్తున్నాము.

దీనికి మీరు చేయాల్సిందల్లా సంక్రాంతి రోజున మీ ఇంటిముందు ముగ్గు వేసి, దాని పక్కన తెలుగు ఎన్నారై రేడియో -2023 (తెలుగువారి గుండె చప్పుడు ) అని రాసి , ఫోటో తీసి మాకు వాట్సాప్ నెంబర్ కి +919849410062 పంపండి.

ముత్యాలముగ్గు పోటీ చివరి తేదీ- 17- జనవరి- 2023

నోట్: ముగ్గు ప్రక్కన తెలుగు NRI రేడియో -2023 (తెలుగు వారి గుండె చప్పుడు) అని రాయకపోతే అవి చెల్లవు.

యాసలు వేరైనా భాష ఒక్కటే..
దేశాలు వేరైనా రేడియో ఒక్కటే..
అదే తెలుగు NRI రేడియో.
తెలుగు NRI రేడియో యాప్‌ను ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకోండి. 24 గంటలు వీనులవిందైన సంగీతాన్ని ఆస్వాదించండి.

మిత్రులారా , మీ కుటుంబములో/ మీ వాట్సాప్ గ్రూప్/ మీ ఊరిలో ఎవరో ఒకరికి అద్భుతముగా ముగ్గు వేసే నైపుణ్యం ఉండవచ్చు వాళ్లకు కూడా ఇది షేర్ చేయండి , సంక్రాంతి పండగ రోజు లక్ష రూపాల విలువగల డైమండ్ లాకెట్ మరియు స్మార్ట్ ఫోన్స్ మీ కుటుంబ సభ్యులదే కావచ్చు , మరి ఇంకెందుకు ఆలస్యం , వెంటనే షేర్ చేయండి …

సలహాలు/సూచనలు పంపాలంటే (లేదా) మీరు కూడా రేడియో వ్యాఖ్యాత (RJ – రేడియో జాకీ) కావాల‌నుకుంటే ఇమెయిల్ చేయండి info.telugunriradio@gmail.com
http://www.telugunriradio.com

జనవరి 5, 2023

కథలు, జోక్సు పోటీలుః మనతెలుగుకథలు.కామ్

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 12:47 సా. ద్వారా వసుంధర

manatelugukathalu.com

మనతెలుగుకథలు.కామ్ వారి ఉగాది 2023 కథలు మరియు జోక్సు పోటీలుః

సంక్రాంతి 2021, విజయదశమి 2021, ఉగాది 2022 మరియు విజయదశమి 2022 కథల పోటీలు విజయవంతంగా పూర్తి చేసిన సందర్భంగా రచయితలకు, పాఠకులకు ముందుగా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము

ఉగాది 2023 కథల పోటీలు

ఇప్పుడు ఉగాది 2023 కథల పోటీని ప్రకటిస్తున్నాము.

ఉగాది 2023 కథల పోటీ బహుమతుల వివరాలు :

ఏకైక ప్రథమ బహుమతి రూ: 5000 /-

ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 500 /-

మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.

నిబంధనలు :

*కథ నిడివి రచయిత సౌకర్యాన్ని బట్టి ఉండవచ్చు.

*కాపీ కథలు, ఇదివరకే ప్రచురింపబడ్డ కథలు, అనువాద కథలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న కథలు పంపరాదు.

*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ కథలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.

*ఒకరు ఎన్ని కథలయినా పంపవచ్చును.

మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.

*వెంటనే మీ కథలను ‘మనతెలుగుకథలు.కామ్’ వారికి పంపించండి.

* మీ కథలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.

*లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.

*పి.డి.ఎఫ్ రూపంలో పంపే కథలు పరిశీలింపబడవు.

*కథలు మాకు చేరవలసిన చివరి తేదీ : 20 /03/2023

*ఫలితాలు 15/04/2022 న ‘మనతెలుగుకథలు.కామ్’ లో ప్రచురింపబడతాయి.

*తుది నిర్ణయం ‘మనతెలుగుకథలు.కామ్’ వారిదే.

*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.

*ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.

*మనతెలుగుకథలు.కామ్’ యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.

ఉగాది 2023 జోక్స్ పోటీలు

*16/09/2022 నుండి 20 /03 /2023 వరకు ఎక్కువ జోక్స్ పంపిన వారికి రూ: 1000 /- బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది.

*ఫలితాలు 15/04/2022 న ‘మనతెలుగుకథలు.కామ్’ లో ప్రచురింపబడతాయి.

జనవరి 1, 2023

పోటీల ఫలితాలుః హాస్యానందం

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, కార్టూన్ల పోటీ, సాహితీ సమాచారం వద్ద 9:07 సా. ద్వారా వసుంధర

హాస్యానందం (వాట్‍సాప్) సౌజన్యంతో

డిసెంబర్ 27, 2022

వేమన పద్య పోటీలు

Posted in ఇతర పోటీలు, బాల బండారం, సాహితీ సమాచారం వద్ద 7:17 సా. ద్వారా వసుంధర

షార్ వాణి శ్రేయోభిలాషులు (వాట్‍సాప్) సౌజన్యంతో

డిసెంబర్ 13, 2022

వ్యాసరచన పోటీః తపస్వి మనోహరం

Posted in ఇతర పోటీలు, సాహితీ సమాచారం వద్ద 12:04 సా. ద్వారా వసుంధర

షార్ వాణి శ్రేయోభిలాషులు (వాట్‍సాప్) సౌజన్యంతో

గత పేజీ · తర్వాతి పేజీ