ఏప్రిల్ 12, 2024

కథ, కవిత, పాట, వ్యాసరచన పోటీలుః జాషువా సాంస్కృతిక వేదిక

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 6:18 సా. ద్వారా వసుంధర

ఏప్రిల్ 5, 2024

రచయితలకు పోటీల సూచిక ఏప్రిల్ 5 2024

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 5:22 సా. ద్వారా వసుంధర

రచయితలకు పోటీల సూచిక మార్చి 3 2024

2024లో జనవరినుంచి డిసెంబరు దాకా ప్రతి నెలా 25వ తేదీలోపు రచనలు చేరేలా పంపమంటున్న విలక్షణ పోటీః సాహితి సామ్రాట్ పోటీలుః సుమతి

సెప్టెంబర్ 15, 2024 వరకూ ఏ రోజైనా కథలు పంపుతూ, వారం వారం బహుమతులు పొందే అవకాశాన్నిచ్చే రచయితలకిస్తున్న మరో విలక్షణ పోటీః మనతెలుగుకథలు.కామ్ కథల పోటీ ప్రకటన

ఇది కాక ఇంకా

మాకు అందిన సమాచారాన్ని అక్షరజాలం పాఠకుల సౌలభ్యంకోసం ఇక్కడ క్రోడీకరించి ఇస్తున్నాం. దీనికి అదనపు సమాచారం ఉంటే అందించగలరు. ఇందులో పొరపాట్లు ఉంటే సూచించగలరు. ఈ సమాచారం ఎప్పటికప్పుడు అప్‍డేట్ చేస్తుంటాం. కాబట్టి 2024 మే నెలలో కొత్త జాబితా ఇచ్చేవరకూ ఈ లంకెను భద్రపర్చుకోగలరు.

చివరి తేదీ ఏప్రిల్ 14, 2024 నవలల పోటీః ఉషా – సుజనా ఫౌండేషన్

చివరి తేదీ ఏప్రిల్ 15, 2024 కథా నాటిక, స్వీయనాటిక రచనల పోటీః తెలుగు కళాసమితి

చివరి తేదీ ఏప్రిల్ 15, 2024 ఉగాది కథల పోటీః విమల సాహితి

చివరి తేదీ ఏప్రిల్ 15, 2024 కథ, కవిత, పాట, వ్యాసరచన పోటీలుః జాషువా సాంస్కృతిక వేదిక

చివరి తేదీ ఏప్రిల్ 20, 2024 కవితల పోటీలుః అరసం

చివరి తేదీ ఏప్రిల్ 20, 2024 గడువు తేదీ పెంపుః నవలల పోటీ (ఉషా)

చివరి తేదీ ఏప్రిల్ 20, 2024 క్రైం స్టోరీస్’ కథల పోటీః భవానీ సాహిత్య వేదిక

చివరి తేదీ ఏప్రిల్ 30, 2024 కథల పోటీః కథావేదిక

చివరి తేదీ ఏప్రిల్ 30, 2024 కవితావేదిక కవితల పోటీ-2024

చివరి తేదీ ఏప్రిల్ 30, 2024 కథల పోటీః వాసా ఫౌండేషన్

చివరి తేదీ ఏప్రిల్ 30, 2024 కథల పోటీః మా సామాజిక సంక్షేమ సంఘం

చివరి తేదీ ఏప్రిల్ 30, 2024 రచనల పోటీః జాషువా సాంస్కృతిక వేదిక

చివరి తేదీ ఏప్రిల్ 30, 2024 కామెడీ కథల పోటీః స్వాతి

చివరి తేదీ ఏప్రిల్ 30, 2024 రాష్ట్రస్థాయి కవితల పోటీ: జాతీయ కవితా వేదిక

చివరి తేదీ మే 5, 2024 నవలల పోటీః తపస్వి మనోహరం

చివరి తేదీ మే 10, 2024 కథ, కవిత పురస్కారాలు 2024ః నెచ్చెలి

చివరి తేదీ మే 10, 2024 కథల పోటీః కథామంజరి

చివరి తేదీ మే 10, 2024 గడువు తేదీ పెంపుః ఉషా – సుజనా ఫౌండేషన్ నవలల పోటీ

చివరి తేదీ మే 15, 2024 కథలు, కవితల పోటీః ‘తెలుగు తల్లి’ కెనడా డే

చివరి తేదీ మే 15, 2024 కథల పోటీః మాధురి

చివరి తేదీ జూన్ 15, 2024 ప్రపంచ స్థాయి కథల పోటీః ఉషా

చివరి తేదీ జూన్ 15, 2024 చిరునామా మార్పుః ప్రపంచ స్థాయి కథల పోటీ

చివరి తేదీ ఆగస్ట్ 1, 202పిల్లల నవలల పోటీ (గడువు తేదీ పెంపు)

మార్చి 30, 2024

రచనల పోటీః జాషువా సాంస్కృతిక వేదిక

Posted in ఇతర పోటీలు, కథల పోటీలు, కవితల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 12:22 సా. ద్వారా వసుంధర

మేడే సందర్భంగా రచనల పోటీ
మేడే సందర్భాన్ని పురస్కరించుకొని వివిధ సాహిత్య ప్రక్రియల్లో రచనల పోటీ నిర్వహిస్తున్నట్టు జాషువా సాంస్కృతిక వేదిక తెలిపింది. అభివృద్ధిలో అసమానతలు, దోపిడీ, వివక్ష, సామాజిక సంక్షోభం తదితర అంశాలను ఇతివృత్త కేంద్రంగా తీసుకొని రచయితలు తమ రచనలు పంపవచ్చు. కథలు, కవితలు, పాటలు, వ్యాసాల ప్రక్రియల్లో ఈ పోటీ ఉంటుంది. ఒక్కో విభాగంలో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు వరుసగా రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2 వేలు చొప్పున ఉంటాయి. ప్రతి విభాగంలోనూ రూ.వెయ్యి చొప్పున రెండు ప్రోత్సాహక బహుమతులూ ఉంటాయి. 20.4.2024 లోగా రచనలను  ఈమెయిల్‌ ద్వారా మాత్రమే పంపించాలి. ఆ నెలాఖరుకల్లా రచనల ఎంపిక ప్రక్రియను పూర్తి చేసి, 5.5.2024 ఆదివారం విజయవాడలో జరిగే సభలో విజేతలకు బహుమతీ ప్రదానం ఉంటుంది. రచనల ఎంపిక పూర్తయిన వెంటనే, బహుమతి పొందిన రచనలతో పాటు ఇంకొన్ని మేలైన రచనలతో మే 5వ తేదీ నాటిక పుస్తకాలు ప్రచురించే ఆలోచన ఉంది. కాబట్టి, రచనలు తప్పకుండా యూనికోడ్లో లేదా పేజీ మేకర్లో తమ రచనలు పంపాలి. ఒక్కో రచయిత/ రచయిత్రి కథ, కవిత, పాట, వ్యాసం … నాలుగు ప్రక్రియల్లోనూ రచనలు పంపొచ్చు. అయితే, ఒక్కో విభాగంలో ఒకటికి మించి రచనలు పంపకూడదు. కథలు, వ్యాసాలూ ఎ4 సైజులో 4, 5 పేజీల వరకూ ఉండొచ్చు. కవితలు, పాటలకు ప్రత్యేకించి నిడివిపై నిబంధన లేనప్పటికీ` కవిత 30 పంక్తులకు అటూ ఇటూగా, పాట ఒక పల్లవి, 4 చరణాలుగా ఉంటే మంచిది. ఏ ప్రాంతంలో నివసిస్తున్న తెలుగు వారైనా, ఈ పోటీల్లో పాల్గొనవచ్చు.
రచనలు పంపాల్సిన మెయిల్‌ ఐడి :sramikasambaralu24@gmail.com
రచనలు చేరటానికి చివరి తేదీ :  20.4.2024

మార్చి 22, 2024

ఆహ్వానంః తెలుగు భాషపై నీ పట్టు చూపెట్టు

Posted in ఇతర పోటీలు, భాషానందం, సాహితీ సమాచారం వద్ద 11:01 ఉద. ద్వారా వసుంధర

మార్చి 20, 2024

వక్తృత్వ మరియు వ్యాస రచన పోటీలు: రంజని

Posted in ఇతర పోటీలు, సాహితీ సమాచారం వద్ద 7:34 సా. ద్వారా వసుంధర

రంజని తెలుగు సాహితీ సమితి
శ్రీ క్రోధి నామ సంవత్సర ఉగాది 2024

వక్తృత్వ మరియు వ్యాస రచన పోటీలు
బహుమతులు : రెండు ప్రక్రియ లలో.. ప్రధమ (రూ.500/-), ద్వితీయ ( రూ 300/-), తృతీయ (రూ 200/-)
తేదీ, సమయం: 25 .3.3024 , మరియు 26.03.2024 మధ్యాహ్నం ఒంటిగంటకు
స్థలం: 2nd floor, Old Record (A&E) పైన.

అంశాలు—

1 “మాతృ భాష పట్ల మమకారం ఎలా వ్యక్తపరచవచ్చు?”

    2 “మన మాతృభాష మనగలగాలంటే మనమేంచేయాలి?”

    3 “ఎన్నో భాషలు నేర్చుకున్నప్పటికీ గానీ మాతృభాష ప్రాశస్త్యం ఎనలేనిది”.

    పైన చెప్పినవే కాదు,
    మీకిష్టమైన పుస్తకాన్ని పరిచయం చేస్తారో, మీకు నచ్చిన తెలుగు సినిమాను సమీక్షిస్తూ ఆనందింప జేస్తారో,
    మీకు ఆనందమో/దుఃఖమో కల్గించిన సంఘటనను వర్ణించి చెబుతారో మీ ఇష్టం.
    వ్యవధి….
    వక్తృత్వ పోటీ ( 25.03.2024)…5 నిమిషాలు
    వ్యాసం(26.03.2024)… 1గం నుంచి 2 వరకు.
    ( గెలుపొందిన వ్యాసాలు ఉగాది రంజని సంచిక లో అచ్చు వేయబడతాయి)
    ఏ జీ ఆఫీసు ఉద్యోగులు అందరూ, ముఖ్యంగా, నూతన ఉద్యోగులు అధిక సంఖ్యలో పాల్గొని పోటీలను విజయవంతం చేయాలని మా విజ్ఞప్తి🙏

    తర్వాతి పేజీ