ఏప్రిల్ 7, 2014

కథ 2013- పుస్తకావిష్కరణ

Posted in సాహితీవైద్యం వద్ద 9:14 సా. ద్వారా వసుంధర

katha 2013

జనవరి 9, 2014

సాహిత్యప్రస్థానం

Posted in సాహితీవైద్యం వద్ద 2:00 సా. ద్వారా వసుంధర

ఈ క్రింది సమాచారం అందజేసిన శ్రీ అరిపిరాల సత్యప్రసాద్‍కి ధన్యవాదాలు.

సాహిత్యాభిమానులకు/రచయితలకు
నమస్కారం
    సాహిత్య ప్రస్థానం మాసపత్రిక 2002 నుండి వెలువడుతూ తెలుగు సాహిత్యక్షేత్రంలో తనకంటూ విశిష్టతను సంపాదించుకున్నది. ఔత్సాహికుల రచనలకు ప్రోత్సాహాన్ని అందిస్తూనే సీనియర్‌ రచయితల రచనలకూ సిసలైన వేదికగా అలరారుతున్నది. విస్తరిస్తున్న ఇంటర్నెట్‌ అవకాశాలనూ అందిపుచ్చుకుని వెబ్‌సైట్‌www.prasthanam.com ను కూడా నిర్వహిస్తున్నది. వివిధ భాషలకు చెందిన ప్రసిద్ధ సాహిత్య వేత్తల ఫొటోలు ఈ వెబ్‌సైట్‌లో ప్రత్యేక ఆకర్షణగా ఉన్నాయి. ఇప్పటి వరకూ వచ్చిన ప్రస్థాణం సంచికలతో పాటు ప్రత్యేక సంచికలు కూడా  ఆర్కివ్స్‌గా వెబ్‌సైట్‌లో నిర్వహిస్తున్నది. సాహిత్యాభిమానులకు కనుల విందుగా ప్రస్థానం వెబ్‌సైట్‌లో వెలకట్టలేని సాహిత్య సంపదను అందుబాటులో ఉంచడం జరిగింది. తెలుగు భాషా, సాహిత్యాభిమానులందరూ ఈ అవకాశాన్ని ఉపయోగించుకోగలరని విజ్ఞప్తి చేస్తున్నాం. ప్రస్థానం వెబ్‌సైట్‌www.prasthanam.com ను సందర్శించండి! విస్తారమైన సాహిత్య సంపదను అందుకోండి! మీ మిత్రులందరికీ తెలియజేయండి! తెలుగు భాషాభివృద్ధి కృషిలో మీరూ భాగస్వాముల కండి!

                                                                           శుభాకాంక్షలతో….
                                                                   – వొరప్రసాద్‌

డిసెంబర్ 26, 2013

రావూరి భరద్వాజ

Posted in సాహితీవైద్యం వద్ద 8:05 సా. ద్వారా వసుంధర

ravuri bharadvaja1964లో కెమిస్ట్రీలో రీసెర్చి స్కాలరుగా ఉన్నప్పుడు- సమాచార సేకరణకు రోజూ ఆంధ్రా యూనివర్సిటీ లైబ్రరీకి వెళ్లేవాణ్ణి. మధ్యలో మార్పుకోసం తెలుగు విభాగానికి వెళ్లి కథా సాహిత్యాన్ని చదివేవాణ్ణి. అప్పుడు పరిచయమైన కొత్త రచయితల్లో రావూరి భరద్వాజ ఒకరు. వారి కథల్లోని విలక్షణత, సహజత్వం, నిర్భయత్వం, అంతర్లీన సందేశం- అప్పట్లో నన్ను ఆశ్చర్యచకితుణ్ణి చేశాయి. కథలంటే ఇలా ఉండాలి, ఇలా వ్రాయాలి- అన్న భావాన్ని, ప్రేరణని కలిగించాయి. శృంగారపరంగా చలానిది భావుకత ఐతే- రావూరిది వాస్తవికత. విశ్లేషణలో వారిది కొడవటిగంటి స్థాయి. పరిశీలనలో సాటి ఉత్తమ రచయితలకి సాటి. అసహాయురాలైన కోడలిని కోరిన మామ, పూట గడవని స్థితిలో కూడా రాత్రి సౌఖ్యంతో సరిపెట్టుకునే దంపతులు, గొప్పవాడింటి పక్కన కొద్దివాడు, అపరిచితుడు భార్యపట్ల అసభ్యంగా ప్రవర్తిస్తే- అందుకు భార్యనే తప్పుపట్టే భర్త- అప్పట్లో మాకు దిశానిర్దేశం చేసిన కొన్ని గొప్ప కథలు. ఇలాంటివి ఒకటి కాదు, రెండు కాదు- కొన్ని పదులైనా చదివి- కథకుడంటే భరద్వాజ అనుకున్నానప్పుడు. ఆ రచనలకోసం ఇప్పుడు ప్రయత్నిస్తుంటే ఎక్కడా దొరకడం లేదు. ఇటీవల రావూరి వారికి జ్ఞానపీఠం లభించడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తే, ఆ తర్వాత కొంత కాలానికే ఆయన కన్ను మూయడం అంతకు మించిన మనస్తాపాన్ని కలిగించింది. ఐతే అప్పటికి ఆయన వ్నయసు 86 సంవత్సరాలు కావడంతో- పండుటాకు అని సరిపెట్టుకోవచ్చు. కానీ ఆయన రచనలు నిత్యహరితాలు కాబట్టి- అవి అలభ్యమైతే పండుటాకులని సరిపెట్టుకోలేం. ఈ సందర్భంగా వారి రచనలన్నీ పాఠకులకు అందుబాటులోకి తీసుకొచ్చే బాధ్యత- జ్ఞానపీఠ సత్కారంకంటే ముఖ్యమైనది. ఆ విషయాన్నితెలుసుకోవలసినవారు తెలుసుకునే అదృష్టం మనకు కలుగుతుందని ఆశిస్తూ- అక్టోబర్ 28 (2013) దినపత్రికలో వారిపై వచ్చిన వ్యాసాన్ని ఇక్కడ అందజేస్తున్నాం.

ravuri bharadvaja

మే 12, 2011

కథలే కన్నానురా…

Posted in సాహితీవైద్యం వద్ద 4:00 సా. ద్వారా వసుంధర

జాగృతి వారపత్రిక దీపావళి సందర్భంగా నిర్వహించిన ‘స్వర్గీయ శ్రీ వాకాటి పాండురంగారావు స్మారక కథా పురస్కారం’లో బహుమతులందుకుని- నవంబర్‌ 8 (2010) సంచికలో ప్రచురితమైన- 5 కథల విశ్లేషణ రచన మాసపత్రిక ఫిబ్రవరి (2011) సంచికలో వచ్చింది. ఆ వివరాలకు ఇక్కడ క్లిక్ చెయ్యండి.

జనవరి 6, 2010

కథ-నవల

Posted in సాహితీవైద్యం వద్ద 7:30 సా. ద్వారా kailash

సాహితీ వ్యవసాయంలో నవల అనే మహావృక్షానికి- విత్తనం కథ. రైతు- పండిన పంటలో ఎక్కువ భాగాన్ని ఆహారపు దినుసుగా ఉపయోగించి తక్కువ భాగాన్ని విత్తనాలుగా వాడినట్లే- రచయితలు ఇతివృత్తాల్ని ఎక్కువగా కథలుగానూ, తక్కువగా  నవలలుగానూ మలచుకోవడం జరుగుతుంది.
కథ వ్రాసినా, నవల వ్రాసినా- రచయితకి తన రచనలోని పాత్రల, సన్నివేశాల నేపధ్యంపట్ల సమగ్రమైన అవగాహన అవసరం. అప్పుడా రచన- కథా, నవలా అన్న విచక్షణకి- అనుభవం తోడ్పడుతుంది. ఐనా ఒకోసారి తలలు పండినవారు కూడా తప్పటడుగు వేయడం కద్దు. అలాంటి సందర్భం
మాకెలా వచ్చిందో చెప్పేముందు మన సినీ దర్శకుల ప్రస్తావన కొంత అవసరం.
మా అభిప్రాయంలో సినీ దర్శకుడంటే- చిన్న కథను విని- దాన్ని చలనచిత్ర కావ్యంగా సందర్శించగల సృజనాత్మకత ఉన్నవాడు. మా అనుభవంలో మన సినీ దర్శకుల్లో ఎక్కువమంది- రచయిత సినీ సన్నివేశపరంగా చెబితే తప్ప కథని ఆస్వాదించలేనివారే! అందుకే మనకి కథా రచయితలు, సినీ కథా రచయితలు వేరుగా ఉండడం- వేలాది మంచి కథలు పుట్టుకొస్తున్నా- తగిన కథ దొరకడం లేదని సినీ దర్శకులు వాపోతూండడం- సినీ నట-దర్శక-నిర్మాతలే సినీ కథా రచయితలుగా భాసిల్లుతూ- హిట్ సినిమాలనే తప్ప మంచి కథాచిత్రాలనందించలేకపోవడం మామూలైంది. 
కథలోని బలమైన అంశాన్ని కొందరు ప్రముఖ దర్శకులకి క్లుప్తంగా వినిపించి- వారు పెదవి విరిస్తే ఆశ్చర్యపడి- ఆ కథని నవలగా మలచాక- కొందరు సినీ నిర్మాతలు తమకి తాముగా అడిగి తీసుకోవడం మాకు స్వానుభవం.
ఊహలోని సన్నివేశాలని కుదించి సూటిగా క్లుప్తంగా చెప్పే ప్రక్రియకి అలవటు పడ్డ మేము- బహు పాత్రలున్న ఓ కథాంశాన్ని- “ఎవరి జీవితం వారిది” అనే కథగా వ్రాసి ఓ ప్రముఖ పత్రిక నిర్వహించిన కథల పోటీకి పంపితే- అది సాధారణ ప్రచురణకి కూడా నోచుకోకుండా వెనక్కి వచ్చింది. సన్నివేశాలపట్ల పూర్తి అవగాహన ఉండడంవల్ల మాకా కథలో ఏ లోపమూ కనిపించకపోయినా- పత్రిక నిర్ణయంపట్ల గౌరవముండడంవల్ల కథని తిరగ వ్రాయాలని సంకల్పించాం. ఆ ప్రయత్నంలో మా తప్పటడుగు అర్థమైంది. అది కథ కాదు, నవల. “కట్టె, కొట్టె, తెచ్చె” లో రామాయణ సారాంశం ఉండొచ్చు కానీ- రామాయణ సౌందర్యం ఇమడదు. అలా ఆ కథనుంచి “శ్రీరాముని దయచేతను” నవల ఉద్భవించింది. అది మాకు ఎంత తృప్తినిచ్చిందంటే- ఒకరిద్దరు ప్రచురణకి నిరాకరించినా- మరి మార్పులు, చేర్పులకి కూడా ప్రయత్నించలేదు. ఆ నవల రచన మాసపత్రికలో ధారావాహికంగా ప్రచురించబడి పలువురి ప్రశంసలందుకుంది. వాహినీ పబ్లికేషన్స్ ద్వారా పుస్తక రూపం ధరించి ఎన్టీ రామారావు ట్రస్టు వారి పురస్కారం పొందింది.  ఈ నవల “కథ వెనుక కథ” డిసెంబరు (2009) చతుర మాసపత్రిక ప్రచురించింది. చిన్న ఇతివృత్తమ్నుంచి పెద్ద నవల ఎలా పుడుతుందో తెలుసుకోగోరే వారి సౌకర్యార్థం- ఇక్కడ ఆ కథకూ (ఎవరి జీవితం వారిది), కథ వెనుక కథ కూ లింకులు ఇస్తున్నాం. 
kathavenuka
evari jeevitam varidi