నవంబర్ 12, 2022
ఆహ్వానంః చరిత్ర పునరుద్భావం
బాలసాహితీ శిల్పులు (వాట్సాప్) సౌజన్యంతో
మిత్రులకు నమస్కారాలు
ఆజాదీకా అమృత్ మహోత్సవ్ సందర్భంగా భారత ప్రభుత్వం ఆధీనంలో స్వాతంత్ర సమరయోధుల చరిత్రను రాయడం జరుగుతుంది. దీనిని సిసిఆర్టి అంటే సెంట్రల్ కల్చరల్ అండ్ రిసోర్స్ ట్రైనింగ్ సెంటర్ ద్వారా ఈ యొక్క బృహత్తర కార్యక్రమం చేపడుతున్నారు. కావున మనవారు ఎవరైనా * స్వాతంత్ర సమరయోధులు ఉన్నట్టయితే వారికి సంబంధించిన కుటుంబ సభ్యులు,మిత్రులు ఎవరైనా స్పందించి సమాచారం ఇచ్చినట్లయితే మరచిపోయిన మన వారి చరిత్రను మళ్లీ పునరుద్భావం పొందేలా చరిత్రలో భాగంగా లిఖించబడుతుంది. కావున ఎవరైనా వారి సమాచారం ఇచ్చినట్లైతే వారిని చరిత్ర పుస్తకంలో చేర్చబడుతుంది.
ఈ సమాచారం నాకు తెలియపరచినట్టయితే నేను వారిని సంప్రదించి సమాచాసేకరణ చేస్తాను.
ధన్యవాదాలు
ఇట్లు
డా. మావిశ్రీమాణిక్యం రిసోర్స్ పర్సన్
HYD wing CCRT- NEW DELHI
ఫోన్ నెంబర్ 7893930104 వాట్స్అప్
జూన్ 12, 2022
ఆర్ ఆర్ ఆర్ నాడు-నేడు
ఇటీవల విడుదలై విజయ ఢంకా మ్రోగిస్తున్న ఆర్ ఆర్ ఆర్ చిత్రం – ఒక అసహాయ గోండ్ బాలికని సరదాపడి పెంపుడు జంతువులా తీసుకుపోయిన దారుణానికి ప్రతిఘటనను ‘రాజమౌళి’ తరహాలో చిత్రించింది. ఆ చిత్రం చూస్తుంటే బ్రిటిష్ హాయాంలో మనమెంత అసహాయులం అన్న భావన రక్తాన్ని ఉడికిస్తుంది.
పరిశోధనాత్మక కథల్ని సేకరించి పాఠకుల ముందుంచడంలో అద్వితీయుడైన శ్రీ పొత్తూరి రాజేంద్ర ప్రసాద్ వర్మ – ఇక్కడ 1837లో భీమిలిలో జరిగిన ఒక దారుణ ఘటనని వెలికి తెచ్చారు. పై ఘటన రక్తాన్ని ఉడికిస్తే, ఇది అదనంగా నిలువెల్లా ఒడలు జలదరింప జేస్తుంది. అక్కడ కిడ్నాప్, ఇక్కడ హత్య! అది కల్పన. ఇది చరిత్ర. అది దృశ్యకావ్యం. ఇది దృశ్యకావ్యంలాంటి కథనం. అది సృజనకు కోట్లు ఆర్జించిపెట్టే సాధనం. ఇది నిజ స్మరణలో మనో మధనం. అది చాలావరకూ వినోదం. ఇది అలా జరక్కుండా ఉండిఉంటే ఎంత బాగుండేది అనిపించే విషాదం.
ఇది జరిగిన కథ మాత్రమే కాదు. జరుగుతున్న చరిత్ర కూడా కావడం రచయిత ఆర్తికి కారణం. అదే అతి పెద్ద విషాదం!
హిస్టరీ చింపేస్తే చిరిగిపోదు, చెరిపేస్తే చెరిగిపోదు – అన్నారు ముళ్లపూడి. ఈ హిస్టరీ కాగితాల్ని చిరగనివ్వకండి. మనసులోంచి చెరగనివ్వకండి. అదీ మనకిప్పుడు అవసరం…….


