మార్చి 30, 2023

నివాళిః శ్రీధర్ శ్రీకంఠం

Posted in సంగీత సమాచారం, సాహితీ సమాచారం వద్ద 11:01 ఉద. ద్వారా వసుంధర

ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో

మార్చి 14, 2023

ఆహ్వానంః సినీ సంగీత విభావరి

Posted in సంగీత సమాచారం వద్ద 10:49 ఉద. ద్వారా వసుంధర

రంజని మిత్రులు (వాట్‍సాప్) సౌజన్యంతో

మార్చి 6, 2023

పలకరింపుః గీతామాధురి, హీనా ఖాన్

Posted in వినోదం, సంగీత సమాచారం వద్ద 6:23 సా. ద్వారా వసుంధర

ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో

జనవరి 26, 2023

మహాభారతం- డా. గజల్ శ్రీనివాస్ నోట

Posted in సంగీత సమాచారం, సాహితీ సమాచారం వద్ద 3:54 సా. ద్వారా వసుంధర

రంజని మిత్రులు (వాట్‍సాప్) సౌజన్యంతో

శ్రీ పూజ్యశ్రీ శంకర విజయేంద్ర సరస్వతీ శంకరాచార్య మహా స్వామి, కంచి వారి ఆదేశానుసారం, కవిత్రయం రచించిన శ్రీ అంధ్ర మహాభారతం లోని 108 పద్యాలను డా. గజల్ శ్రీనివాస్ గానం చేశారు.

పర్యవేక్షణ: శ్రీ పంతుల వెంకటేశ్వరరావు, తెలుగు ఆచార్యులు.

సమర్పణ: సేవ్ టెంపుల్స్ భారత్ & ఆంధ్ర సారస్వత పరిషత్

లంకె

జనవరి 13, 2023

నివాళిః సంగీత దర్శకుడు సత్యం

Posted in వినోదం, వెండి తెర ముచ్చట్లు, సంగీత సమాచారం వద్ద 3:56 సా. ద్వారా వసుంధర

శ్రీ చెళ్లపిళ్ల సత్యం

రంజని మిత్రులు (వాట్‍సాప్) సౌజన్యంతో

వర్ధంతి/నివాళి.. స్వర పారిజాతం.. సత్యం..

మూడు దశాబ్దాలకు పైగా సంగీత ప్రపంచంలో విహరింపజేసిన.. ఏ దివిలో పారిజాతమో.. అనదగ్గ స్వర మాంత్రికుడు సత్యం ఒక ఉన్నత సంగీత కుటుంబం నుంచి వచ్చిన సంగీత జ్ఞాని. ఈయన ముత్తాత ప్రసిద్ధ తిరుపతి వేంకటకవులలో ఒకరైన చెళ్లపిళ్ల వేంకటకవి. సంగీత మేధావుల వంశం నుంచి వచ్చిన సినీ సంగీత దర్శకుడు సత్యం తనదైన శైలిలో రెండున్నర దశాబ్దాలు సినీ సంగీత సామ్రాజ్యాన్ని ఏలారు.

తొలుత పి ఆదినారాయణ రావు వద్ద శిష్యరికం చేశారు. హిందీ సువర్ణ సుందరి కొన్ని పాటల రికార్డింగ్ సత్యం ఆధ్వర్యంలో జరిగింది. ఈ వాద్య బృందంలో బాలీవుడ్ అగ్ర సంగీత దర్శకులు లక్ష్మీకాంత్ ప్యారేలాల్ ఉండటం విశేషం.

1963లో ఇండిపెండెంట్ సంగీతదర్శకుడిగా తొలిచిత్రం ఎన్టీఆర్ నటించిన సవతి కొడుకు. ఈ సినిమా పరాజయం పొందడంతో తెలుగులో అవకాశాలు రాకపోయినా కన్నడంలో చేసిన చిత్రాలు విజయవంతం కావడంతో అక్కడ బిజీ అయిపోయారు. ఐదేళ్ల తర్వాత ఎస్ భావనారాయణ చిత్రం పాలమనసులు లో అవకాశం ఇచ్చారు. తరువాత సూపర్ స్టార్ కృష్ణ, చలం చిత్రాలకు ఎక్కువగా పనిచేయడం ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం చేత పాడించిన పాటలు బాగా పాపులర్ కావడంతో మరి వెనుదిరిగి చూడలేదు.

రౌడీరాణి, రివాల్వర్ రాణి వంటి లేడీ ఓరియెంటెడ్ ఏక్షన్ చిత్రాలకి, కృష్ణ నటించిన ఏక్షన్ కౌబాయ్ చిత్రాలకి సత్యం సంగీతం ఓ వరంగా నిలిచింది. ఆరుద్ర లిరిక్, సత్యం మ్యూజిక్, ఎల్లారీశ్వరి వాయిస్ గిమ్మిక్ అప్పట్లో ఓ సంచలనమే.

సత్యం చేయిపడితే కనీసం ఓ మూడు హిట్ సాంగ్స్ ఉండేవి ప్రతీ సినిమాలో. తెలుగు కన్నడ హిందీ భాషల్లో కలిపి సుమారు 550 సినిమాలకు సంగీతం అందించారు. ఎన్నో విలువైన మెలోడియస్ సాంగ్స్ అందించారు.

సత్యంపై హిందీ సినిమా సంగీతం ప్రభావం అధికంగా ఉండేది. కొన్ని పాటలు వినగానే ఏదో ఓ హిందీ పాట వరుస లేదా బీట్ స్ఫురిస్తుంది. గానీ వెంటనే గుర్తుకు రాదు. అంత చాకచక్యంగా తన ప్రతిభ కూడా జోడించి ట్యూన్స్ ఇచ్చేవారు.‌ 1975 నుంచి 1989 వరకు సినీ సంగీత సామ్రాజ్యం చక్రవర్తి, సత్యం, మహదేవన్ లదే.

సత్యం రీరికార్డింగ్ కూడా సన్నివేశాలను బాగా ఎలివేట్ చేసేవిధంగా ఉండేది. ఈయన శంకర్ జైకిషన్ లను అమితంగా ఇష్టపడే వారు. వీరిని ఎవరైనా విమర్శిస్తే ఊరుకునేవారు కాదని బాలసుబ్రహ్మణ్యం చాలాసార్లు చెప్పేవారు. వీరిద్దరి మధ్య గాఢమైన అనుబంధం ఉండేది. పిల్లలు లేని సత్యం.. బాలుని కొడుకూ అనిపిలిచేవారు. రెండు మూడు సార్లు మాటా మాటా అనుకున్నా వెంటనే ఇట్టే కలిసిపోయేవారు.

ప్రముఖ గీత రచయిత సి నారాయణ రెడ్డి గారు.. సత్యం మస్తిష్కంలో కొన్ని వేల హిందీ గీతాలు ఎప్పుడూ తిరుగుతుంటాయని అనేవారు. ఎన్నో అజరామర గీతాలు పి సుశీల, యస్ జానకి, ఎల్లారీశ్వరి, బాలసుబ్రహ్మణ్యం చేత పాడించారు.

సత్యం మితభాషి.. కోపం కూడా కొంచెం ఎక్కువే. సత్యం ఆగ్రహానికి ఈయన తొలి పాట రికార్డింగ్ సమయంలో గురైనానని బాలు ‘పాడుతా తీయగా’ లో ఓసారి చెప్పారు. గాయకుడిగా తనకు కోదండపాణి అవకాశం ఇచ్చారని, సింగర్ గా ఎస్టాబ్లిష్ కావడానికి ఆయనతో పాటు మహదేవన్, సత్యం పాటలు కూడా బాగా దోహదం చేశాయని చాలా సందర్భాల్లో బాలు చెప్పారు. తెలుగు సినిమా సంగీతాన్ని బాగా ప్రభావితం చేసిన ఐదుగురు అగ్ర సంగీత దర్శకులలో సత్యం ఒకరు కావడం పెద్ద విశేషం.

దురదృష్టం ఏమిటంటే 1985 తరువాత సత్యం తాగుడుకు బాగా బానిసైపోయారు. ఆరోగ్యం పూర్తిగా పాడయ్యింది. డాక్టర్లు ఎంతచెప్పినా మానలేదు. 56 సంవత్సరాల వయసులోనే 1989లో సరిగ్గా ఈరోజే (జనవరి 12) మరణించారు.

రాజశేఖర్ నటించిన అంకుశం ఈయన చివరి చిత్రం.

సత్యం విజయనగరం జిల్లావాసి. మళ్లీ మళ్లీ పాడాలి ఈ పాటా.. తన పాటలు మనం అనుకునేలా చేసి తొందరగానే భువి నుండి దివి కేగిన స్వర పారిజాతం స్వరకర్త సత్యం (చెళ్లపిళ్ల) 33వ వర్ధంతి సందర్భంగా ఈ చిరునివాళి.

గాదె లక్ష్మీ నరసింహ స్వామి (నాని) ధర్మపురి రోడ్ విజయనగరం ఫోన్ 99855 61852.

తర్వాతి పేజీ