ఫిబ్రవరి 3, 2023

మనవి

Posted in ముఖాముఖీ వద్ద 3:04 సా. ద్వారా వసుంధర

వ్యక్తిగతమైన ప్రయాణాలు, వేడుకలు కారణంగా- ఫిబ్రవరి 3-15 వరకూ అక్షరజాలంలో అంశాలు సక్రమంగా అందకపోవచ్చును. అసౌకర్యానికి మన్నించమని మనవి.

జనవరి 7, 2023

భూవారసత్వ సంరక్షకుల ‘2023 పంచాఙము’

Posted in ముఖాముఖీ వద్ద 12:50 సా. ద్వారా వసుంధర

శ్రీ రచన శాయి (వాట్‍సాప్) సౌజన్యంతో

జనవరి 1, 2023

శుభాకాంక్షలు

Posted in ముఖాముఖీ వద్ద 8:57 సా. ద్వారా వసుంధర

అక్షరమంటే అర్థమే నాశనం లేనిదని! అక్షరాన్ని ఆశ్రయించడంవల్ల భాషకు శాశ్వతత్వం లభించింది.

అందం, చందం, పదవి, సంపద- ఏవీ మనిషికి శాశ్వతం కాదు. ఉన్నన్నాళ్లూ వాటిని అనుభవించి ఆస్వాదించాల్సిన మనిషి- భాష జోలికి వెడితే- కలకాలముండని మనిషి నశిస్తాడు. కానీ, భాష నిలబడుతుంది. ఐతే మనిషిని ఆశ్రయించుకున్న జాతి బలహీనపడుతుంది.

అశాశ్వతమైన మనిషి, శాశ్వతమైన భాషను బలపరుస్తూ, జాతిని బలపర్చుకునేందుకు మనుగడ కొనసాగించాలని కోరుకుంటూ-

నూతన సంవత్సర శుభాకాంక్షలు

జూన్ 10, 2022

సాహిత్యమా- నీవు ప్రౌఢమా, ముగ్ధమా?

Posted in ముఖాముఖీ, సాహితీ సమాచారం వద్ద 3:41 సా. ద్వారా వసుంధర

ఇటీవల విశిష్టమైన రచనలు చేసే ఒక ప్రముఖ రచయిత్రినుంచి- కథల పుస్తకాన్ని అందుకున్న ఒకరు-

ప్రౌఢ సాహిత్యం వ్రాస్తున్నవారు అవార్డులకోసం బాలసాహిత్యం వ్రాస్తున్నారు’ అని బదులిచ్చేరుట.

అది వ్యంగ్యం కావచ్చు. ఆక్రోశమే కావచ్చు. కానీ ఆ వ్యాఖ్య చేసినవారు ఈ క్రింది రెండు విషయాల్నీ పరిగణనలోకి తీసుకునే ఉంటారనుకోవాలిః

ఒకటిః

మానసిక స్పందనకు అక్షరరూపమే సాహిత్యం. దానికి బాల, శృంగార, నేర, ప్రౌఢ, ముగ్ధ విభాగాలు పాఠకులు ఏర్పరచుకోవాలే తప్ప వ్రాసినవారికుండవు.

రెండుః

అవార్డులు సాహిత్యం వ్రాస్తే రావు. అవి సాహితీ పరమేశ్వరుల ద్వారా వస్తాయి. సాహితీ పరమేశ్వరులకు సమకాలీన సాహిత్యం గురించి తెలియదు. వారి సాహిత్య పరిజ్ఞానం పూజార్పితంగా తమకు అందిన పుస్తకాలకే రిమితం. వారిచ్చే అవార్డులు తమ చుట్టూ ప్రదక్షిణాలు చేసే గణపతులకే పరిమితం చెయ్యాలనుకుంటారు.

ఐతే దేనికైనా మినహాయింపులుంటాయి కాబట్టి అంతా ఇలాగే, అన్నీ ఇలాగే అనుకోకూడదు.

కానీ అసలు సిసలు సాహితీపరులు అవార్డులకోసం వ్రాయరు. తమ భావజాలాన్ని పంచుకుందుకూ, మానసిక తృప్తికీ వ్రాస్తారు. కాబట్టి వారు సాహితీ పరమేశ్వరులెవరో తెలుసుకుని, వారికి ప్రదక్షిణాలు చేసే ప్రయత్నాలకిచ్చే సమయాన్ని కూడా- రచనా వ్యాసంగానికే ఇస్తారు.

ఏప్రిల్ 2, 2022

2022 ఉగాది శుభాకాంక్షలు

Posted in ముఖాముఖీ వద్ద 4:49 సా. ద్వారా వసుంధర

చుక్కలనంటే ధరలు, అవినీతి రాజకీయాలు, అదుపు తప్పుతున్న నేరాలు-ఘోరాలు

ఇవన్నీ ఎప్పుడూ ఉండేవే!

ఎండ-వాన, చీకటి-వెలుగు, చావు-బ్రతుకు వగైరాల్లాగే అవీ అనుకుని

సద్దుకుపోవడం అలవాటు చేసుకున్నాం.

అలాగే అలవాటు చేసుకోకపోమా అన్న నమ్మకంతోనో ఆశతోనో

2020లో కరోనా వచ్చింది

ఆదిలో తడబడ్డా నెమ్మదిగా ఎదురుతిరిగాం

రెండేళ్లపాటు త్యాగాలు చేశాం క్రమశిక్షణ పాటించాం

మనకంటే సంపన్నం మనకంటే ఆధునికం అనుకున్న దేశాలను మించి

పోరాటంలో గెలుపు సాధించాం

ఇప్పుడు కరోనా వెళ్లిపోయిందంటున్నారు

మరి రాదని కూడా అంటున్నారు

రాదని నమ్ముదాం

కరోనాపై పోరాటస్ఫూర్తిని మాత్రం మర్చిపోకుండా

సద్దుకుపోయే అలవాటుని పక్కనపెట్టి

మిగతావాటిపైనా ఎదురుతిరుగుదాం

అప్పుడు అంతా మనది భూతలస్వర్గం అంటారు

అలస్యమెందుకూ….

వచ్చేసింది శుభకృత్ నామ సంవత్సరం – పేరులోనే శుభాన్ని ఇముడ్చుకుని!

అందరికీ

శుభకృత్ నామ సంవత్సరాది శుభాకాంక్షలు

తర్వాతి పేజీ