నవంబర్ 3, 2022

భువినుండి దివికి

Posted in మన పాత్రికేయులు వద్ద 9:18 సా. ద్వారా వసుంధర

రంజని మిత్రులు (వాట్‍సాప్) సౌజన్యంతో

పరిణత పాత్రికేయ శిఖరం ఒరిగింది!

వయోధిక పాత్రికేయ సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు గోవర్ధన సుందర వరదాచారి (92) గారు అనారోగ్యంతో ఈ రోజు మధ్యాహ్నం కన్నుమూశారు. శ్రీ వరదాచారి గారు 1948లో ఆంధ్ర జనత పత్రికతో జర్నలిజం వృత్తిలోకి అడుగుపెట్టారు. ఈనాడు, ఆంధ్రభూమి దిన పత్రికలలో వివిధ హోదాలలో పనిచేసిన ఆయన తెలుగు భాషోద్యమ సమాఖ్య ఉపాధ్యక్షునిగానూ సేవలు అందించారు.

తెలుగు విశ్వ విద్యాలయంలో జర్నలిజం విద్యార్థులకు విజిటింగ్ ప్రొఫెసర్ గా పాఠాలు బోధించారు. ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ లో కీలక బాధ్యతలు నిర్వర్తించిన ఆయన, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శి పదవులనూ నిర్వర్తించారు. ఉద్యోగ విరమణ అనంతరం వయోధిక పాత్రికేయ సంఘం స్థాపించి, సీనియర్ జర్నలిస్టులకు ఓ గుర్తింపును, గౌరవాన్ని అందించే ప్రయత్నం చేశారు. తెలుగు పాత్రికేయంపై పలు పుస్తకాలు రాసిన శ్రీ వరదాచారి, తన జీవితానుభావాలను ‘జ్ఞాపకాల వరద’ పేరుతో గ్రంథస్థం చేశారు.
జాగృతి పాత్రికేయ శిక్షణా శిబిరంలో ఆయన మాకు బోధించిన పాఠాలను ఎప్పటికీ మరువలేను! పాత్రికేయులకు ప్రాతః స్మరణీయులైన వరదాచారి గారి ఆత్మకు సద్గతులు ప్రాప్తించాలని ఆ భగవంతుడిని ప్రార్థిద్దాం.

సెప్టెంబర్ 21, 2022

2022 ఉత్తమ పాత్రికేయుడు శ్రీ భాస్కర్

Posted in మన పాత్రికేయులు, సాంఘికం-రాజకీయాలు వద్ద 12:10 సా. ద్వారా వసుంధర

ప్రియమైన మీకు…

శృతిలయ ఆర్ట్స్ అకాడమీ సంస్థ గత 22 ఏళ్లుగా మీడియా అవార్డ్స్ ఇస్తోంది! అక్కినేని నాగేశ్వరరావు గారు ఈ అవార్డ్స్ ప్రారంభించారు.

ఈసారి 2022 వ సంవత్సరానికి బెస్ట్ జర్నలిస్ట్ గా నన్ను ఎంపిక చేశారని తెలియజేయడానికి సంతోషిస్తున్నాను. పురస్కార ప్రదానం
ఈనెల 21వ తేదీ, బుధవారం అంటే నేటి సాయంత్రం 7 గంటలకు రవీంద్రభారతి లో. తెలంగాణ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి చేతుల మీదుగా జరగనుంది. ఈ పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమానికి మీరు తప్పకుండా వస్తారని ఆశిస్తూ… ఆకాంక్షిస్తూ…
మీ డీ వీ ఆర్ భాస్కర్…
సాక్షి మీడియా గ్రూప్

ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం వరకూ అక్కినేని పాటల కార్యక్రమం ఉంటుంది. సాయంత్రం 7 గంటల నుంచి పురస్కార ప్రదాన కార్యక్రమం జరుగుతుంది. స్వయంగా రాలేని వారు కార్యక్రమం లైవ్ లింక్ ద్వారా వీక్షించ వచ్చు.

ఇక్కడ క్లిక్ చెయ్యండి.

సెప్టెంబర్ 2, 2022

సంస్మరణః శ్రీ నండూరి రామమోహనరావు

Posted in మన పాత్రికేయులు, సాహితీ సమాచారం వద్ద 7:42 సా. ద్వారా వసుంధర

రంజని మిత్రులు (వాట్‍సాప్) సౌజన్యంతో

సైన్సు రచయితలకూ, సాహిత్య అనువాదకులకు ఆరాధ్యుడు నండూరి రామమోహనరావు వర్ధంతి ఈరోజు:

కొడవటిగంటి కుటుంబరావు గొప్ప రచయితే కాదు, గొప్ప సంపాదకుడు కూడా! అలాగే నార్ల వెంకటేశ్వరరావు గొప్ప సంపాదకుడే కాదు గొప్ప రచయిత కూడా!! అయినా మనం కొకును రచయితగా, నార్లను సంపాదకుడుగానే గుర్తుంచుకుంటున్నాం. వీరిద్దరిలాగే రెండు రంగాలలో రాణించి, ఈ ఇద్దరితో పనిచేసిన రచయిత, పాత్రికేయుడు, సంపాదకుడు నండూరి రామమోహనరావు. తనకు ఫస్ట్ లవ్ సాహిత్యం, సెకండ్ లవ్ సైన్స్ అని వీరు అంటారు. కానీ నండూరి రామమోహనరావును ‘విశ్వరూపం’, ‘నరావతారం’ రచయితగానే గుర్తుపెట్టుకుంటున్నాం. మార్క్ ట్వయిన్, లూయీస్ స్టీవెన్ సన్ వంటి వార్ల రచనలు రాజు-పేద, టాంసాయర్, విచిత్రవ్యక్తి, కాంచనద్వీపం పేరున హాయిగా అనువదించిన సాహితీవేత్త.
అంతేకాదు, యద్దనపూడి సులోచనారాణి వంటి వారిని తొలుత గుర్తించి, ప్రోత్సహించి, ఆదరించిన ఉదారవాది కూడా రామమోహనరావే. వారు సుమారు ఐదున్నర దశాబ్దాలపాటు పత్రికా రంగంలో పనిచేశారు. అయితే మొత్తం సర్వీసు రెండు పత్రికలు, రెండు నగరాలకు పరిమితం అయ్యింది. మొదటిది వీక్లీ జర్నలిజం కాగా, రెండవది డెయిలీ జర్నలిజం. ఇప్పటి పరుగులు తీసే తరానికి ఈ విషయాలు బోధపడటం కష్టం కావచ్చు.

1927 ఏప్రిల్ 24 న జన్మించిన రామమోహనరావు 2011సెప్టెంబర్ 2 న కనుమూశారు. రాజమండ్రిలో డిగ్రీ చదువుకునే సమయంలో సహాధ్యాయి కూచిమంచి సత్యసుబ్రహ్మణ్యం గారు ఎమర్జెన్సీ సమయంలో ‘ఆంధ్రప్రభ’ దినపత్రికకు సంపాదకులుగా పేరుగాంచిన పాత్రికేయులు.

నండూరి రామమోహనరావుగారిలో నెమ్మదిగా కష్టపడటం, నాజూకుగా చక్కదనాన్ని చెక్కడం చూడవచ్చు. పరుషంగా మాట్లాడటం కన్నా తనలో తనే ఇబ్బంది పడటం ఆయన మిత్రులకు బాగా తెలుసు. దానినే మరికొంతమంది సర్దుకుపోవడంగా పరిగణిస్తారు. 1996-2002 మధ్యకాలంలో నండూరి రామమోహన రావును చాలా తరచు కలిసేవాడిని. చాలా ఆదరంగా చూసేవారు, చాలా విషయాలు సందర్భోచితంగా చెపుతూండేవారు. చాలా సున్నితమైన వ్యక్తి. అందరితో హాయిగా ఉండలేని రోజులని పరోక్షంగా అంటూండేవారు.

వారు 21 సంవత్సరాల వయస్సులో 1948లో మద్రాసు ఆంధ్రపత్రిక ఉద్యోగంలో చేరారు. అక్కడ మహామహులైనవారు పనిచేసేవారు.. కొడవటిగంటి కుటుంబరావుగారు ఆంధ్రపత్రిక వీక్లీలో పలు మార్పులు చేసి, సర్క్యులేషన్ పెంచి పిమ్మట ‘చందమామ’ పత్రికలో చేరిపోయారు. దాంతో నండూరి రామమోహనరావుగారి సామర్థ్యానికి పెద్ద అవకాశం దొరికింది. వారు మద్రాసులో ఒక పుష్కరం మించి పనిచేసినపుడు జర్నలిజంలో, రచనలో పునాది గట్టిగా పడింది. ఆ సమయంలోనే పలు ప్రసిద్ధమైన ఆంగ్ల నవలలు చక్కని తెలుగులోకి అనువాదం చేశారు. ఈ ప్రయత్నాలే వారి సాహిత్య స్థానాన్ని భద్రపరిచాయి. విమర్శకుడిగా పేరు తర్వాత వచ్చింది. నండూరి వారి ప్రతిభను పోటీపత్రిక నుంచి గమనించారు నార్ల వెంకటేశ్వరరావు. 1960లో విజయవాడ నుంచి కొత్త పత్రిక ‘ఆంధ్ర జ్యోతి’ ప్రారంభించినపుడు నండూరిని నార్ల ఆహ్వానించి, అవకాశం కల్పించారు. ఆ పత్రికలో 34 సంవత్సరాలు పనిచేశారు రామమోహనరావు.

కొకు సారథ్యంలో ప్రఖ్యాత నవలల అనువాదాలు ప్రారంభిస్తే, నార్ల నాయకత్వంలో మంచి సైన్స్ రచననలు చేశారు. రామమోహనరావుగారి పరిశీలన చాలా విశేషమైంది. నార్ల షష్ఠిపూర్తి సందర్భంగా వెలువడిన ‘ది స్టడీస్ యిన్ తెలుగు జర్నలిజం’ సంకలనంలో తెలుగులో ప్రసిద్ధమైన పత్రిక, ప్రభ, జ్యోతి వారపత్రికల తీరు గురించి లోతుగా చెబుతారు. ఈ మూడు పత్రికలు నేడు చరిత్ర దర్పణాలుగా పేరు మిగుల్చుకున్నాయి. మహిళలు, పిల్లలు కూడా చదువుకునేలా నార్ల ప్రభ వీక్లీను మలచారు. పిమ్మట అదే నార్ల జ్యోతి వీక్లీ ప్రారంభించినపుడు సైన్స్, క్రీడలకు సంబంధించి పెద్ద పీట వేశారని రామమోహనరావు విశ్లేషిస్తారు.
తాను సైన్స్ చదువుకోకపోయినా దానిపట్ల ఎంతో అభిమానముంది నండూరి వారికి. ‘ఆంధ్ర పత్రిక’ వీక్లీలో పలు సైన్స్ విషయాల గురించి ఎన్నో వ్యాసాలు రాశారు. నండూరి వారు తటపటాయించినా నార్ల ‘విశ్వరూపం’ కృషి కి శ్రీకారం చుట్టించారు. విశ్వానికి సంబంధించిన భౌతిక రూపం గురించి వివరించే విజ్ఞాన శాస్త్రమిది. అందరికీ బోధపడేలా ఉండాలని ప్రాథమిక విషయాలను కూడా పొందుపరుస్తూ ‘విశ్వరూపం’ కొనసాగించారు. హాయిగా చదివించే శైలి వారిని సైన్స్ రచయితగా చిరంజీవిని చేసింది. జీవ శాస్త్రాన్ని వివరించే పరిణామక్రమం ‘నరావతారం’. ఇదీ ప్రఖ్యాతమైనదే! లెక్కకు మించిన పరిశోధనలు ఈ రంగాలలో రావడంతో ఈ రచనలను క్రమం తప్పక సంప్రదించేవారు. అందువల్లనే ఈ రచనలు పుస్తకాలుగా కూడా విజయవంతమయ్యాయి.

‘విశ్వరూపం’, ‘నరావతారం’ – ఈ ప్రపంచం, మనిషి పరిణామం గురించి చర్చించగా – ‘విశ్వదర్శనం’ మనిషి ఆలోచనల పరిణామాన్ని చిత్రికపట్టింది. వీరి “రచనా ప్రణాళిక చక్కనిది” అని కుటుంబరావు అభినందించారు. అయితే నండూరి ఆ ప్రణాళిక దానికదే ఎవాల్వ్ అయిందని నాతో ఒక విజయవాడ ఆకాశవాణి పరిచయంలో పేర్కొన్నారు. ఇపుడు వారిని ప్రధానంగా చక్కని సైన్స్ రచయితగా గౌరవిస్తున్నాం.
ఏ ఉద్యోగం చేసినా ఎంతో కొంత కృషి ఉంటుంది. అయితే మీడియా వంటి ‘విజిబుల్’ రంగంలోని పరిశ్రమ సమకాలీన కాలంలో విశ్లేషించే అవకాశం లేదు. తర్వాతి తరంలో వారిని అధ్యయనం చేసే వీలు పెద్దగా ఉండదు. అందువల్ల నండూరి రామమోహనరావు సంపాదకుడిగా కాంట్రిబ్యూషన్ ఏమిటని పెద్దగా విశ్లేషించిన దాఖలాలు లేవు. అయితే సైన్స్ రచయితలకూ, సాహిత్య అనువాదకులకూ ఆరాధ్యనీయుడయిన కృషీవలుడు ఆయన. నార్ల, గోరాశాస్త్రికి సంబంధించిన మూడు అపురూపమైన గ్రంథాలు నాకు తన సొంత కాపీలు బహూకరించారు. ఆ మూడు పుస్తకాలు నా పాత్రికేయరంగపు పరిశోధనకు ఎంతగానో దోహదపడుతున్నాయి. ఆ పుస్తకాలు నాకు కనబడిన ప్రతిసారీ నండూరి రామమోహనరావును గుర్తు చేస్తాయి!

(నండూరి రామమోహన రావు వర్థంతి సెప్టెంబరు 2)
డా. నాగసూరి వేణుగోపాల్
9440732392

డిసెంబర్ 31, 2021

అరుణ్ సాగర్ విశిష్ట పురస్కారాలు

Posted in మన పాత్రికేయులు, సాహితీ సమాచారం వద్ద 3:52 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

అరుణ్

నవంబర్ 5, 2021

ప్రశంసః రామోజీరావు

Posted in మన పాత్రికేయులు, సాహితీ సమాచారం వద్ద 3:14 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

తర్వాతి పేజీ