అక్టోబర్ 17, 2018

రచయితలకు ఆహ్వానం

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం, Uncategorized వద్ద 7:47 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచార కలశం సౌజన్యంతో

సరస్వతీ మానస పుత్రిక…!!!  ఫ్లెమింగో (రాజహంస) సచిత్ర మాస పత్రిక…!!!
💐విశాఖపట్నంనుంచి నవ్య వీక్లీ సైజ్ లో వెలువడనున్న మాస పత్రికలో ప్రచురణకు 10 పేజీలలోపు కథలు, 3పేజీలలోపు బాలలు కథలు, 20 లైన్లులోపు కవితలు, వివిధ జిల్లాల నుంచి ప్రత్యేక వ్యాసాలు పంపగలరు…!!!
💐ప్రచురణకు స్వీకరింపని కథలను తిప్పి పంపగోరువారు తగినన్ని స్టాంపులు అతికించిన కవరు జతపరచాలి…!!!
💐రంగుల పేజీలతో అన్ని జిల్లాల ప్రాతినిధ్యంతో
ఫ్లెమింగో(రాజహంస) పేరుతో ఈ పత్రిక వెలువడనుంది…!!!
💐ఇంక ఆలస్యం ఎందుకు…త్వరగా కథలు పంపండి…!!!
💐కథలు పంపవలసిన చిరునామా…!!!

ఎడిటర్.

ఫ్లెమింగోసచిత్ర మాస పత్రిక(రాజహంస,

27-15/4, టి.పి.టి.కాలనీ.

సీతమ్మధార, విశాఖపట్నం 13.

మొబైల్: 7337234555.
🙏పొత్తూరు రాజేంద్రప్రసాద్ వర్మ…!!!

అక్టోబర్ 9, 2018

ప్రస్థానం – పత్రిక

Posted in మన పత్రికలు, Uncategorized వద్ద 8:45 సా. ద్వారా వసుంధర

sahitya prasthanam sp

సెప్టెంబర్ 25, 2018

రచనలకు ఆహ్వానం

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం, Uncategorized వద్ద 10:07 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం సాహితీపల్లవం సౌజన్యంతో

wanted sp

సెప్టెంబర్ 22, 2018

జాగృతి వారపత్రిక

Posted in మన పత్రికలు, Uncategorized వద్ద 10:18 ఉద. ద్వారా వసుంధర

చక్కని రచనలను అందిస్తూ, ప్రతి ఏటా పోటీలను నిర్వహిస్తూ – తెలుగు కథకు మంచి వేదికగా ఉంటున్న జాగృతి వారపత్రికను అంతర్జాలంలో చదవాలనుకుంటున్నారా?

ఇటీవలి కొన్ని సంచికలకు ఇక్కడ లంకెలు ఇస్తున్నాం.

డిసెంబర్ 10 2018(ఇందులో ప్రోత్సాహక బహుమతి కథ ‘కేలిక’ ఉంది)

డిసెంబర్ 3 2018

నవంబర్ 19 2018 (ఇందులో తృతీయ బహుమతి కథ ఉంది)

దీపావళి ప్రత్యేక సంచిక 2018 (ఇందులో బహుమతి కథలు ఉన్నాయి)

అక్టోబర్ 22, 2018   (ఇందులో పాలగుమ్మి పద్మరాజు ‘గాలివాన’ కథ ఉంది. తప్పక చదవండి)

అక్టోబర్ 15, 2018

అక్టోబర్ 8, 2018

అక్టోబర్ 1, 2018

సెప్టెంబర్ 24, 2018

సెప్టెంబర్ 17, 2018

సెప్టెంబర్ 10, 2018

సెప్టెంబర్ 3, 2018

ఆగస్ట్ 27, 2018

మే 28, 2018

ప్రతివారినీ రచయితల్ని చేసే ప్రతిలిపి

Posted in మన పత్రికలు, Uncategorized వద్ద 6:41 సా. ద్వారా వసుంధర

ప్రతిలిపి ఒక వినూత్న ప్రయోగం. ఈ వెబ్‍సైట్‍లో ఎవరికి వారే తమ రచనల్ని వ్రాసి ప్రచురించుకోవచ్చు. విశేషమేమిటంటే ఆ కథలకు బొమ్మలు కూడా రచయితలే (వీలైతే internet నుంచి download చేసుకుని) అందజెయ్యాలి. ఆ ఫలితం ఎలా ఉంటుందో నన్న కుతూహలం ఉన్నవారు మా హారర్ కథ జారి పడకు చదవండి.

గతంలో ప్రతిలిపి నిర్వాహకులు ఆంధ్రభూమి దినపత్రికలో ప్రచురితమైన మా చిరునవ్వు వెల ఎంత కథని పునర్ముద్రించారు. 

పై రెండు కథలూ వసుంధర పేరుతో వ్రాయబడినవే ఐనా వారు – రాజగోపాలరావు జొన్నలగడ్డ – పేరుతో ప్రచురించారు. ఐతే వసుంధర కలం పేరులో రాజగోపాలరావు పేరుకి రామలక్ష్మి జత పడే ఉంటుందన్న విషయాన్ని మేము ప్రత్యేకించి చెప్పనవసరం లేదనుకుంటాను. ఆ రెండూ వసుంధర రచనలే.

ప్రతిలిపిలో కథల తీరుకి ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈ వెబ్‍సైట్ అడపా తడపా నిర్వహించే పోటీల వివరాలు అక్షరజాలంలో ఇస్తూ వచ్చాం.

 

తర్వాతి పేజీ