జూలై 31, 2022

సంస్మరణః రావిశాస్త్రి

Posted in మన కథకులు, సాహితీ సమాచారం వద్ద 1:31 సా. ద్వారా వసుంధర

ఆంధ్రజ్యోతి దినపత్రిక సౌజన్యంతో

జూలై 25, 2022

భువి నుండి దివికిః శ్రీ రెడ్డి రాఘవయ్య

Posted in బాల బండారం, మన కథకులు, సాహితీ సమాచారం వద్ద 6:27 సా. ద్వారా వసుంధర

చందమామలు (వాట్‍సాప్) సౌజన్యంతో

ప్రముఖ బాలసాహితీవేత్త, కేంద్ర సాహిత్య అకాడమీ బాల పురస్కార గ్రహీత శ్రీ రెడ్డి రాఘవయ్యగారు ఈ రోజు సాయంత్రం 4 గంటలకు హైదరాబాదు బాలానగర్ లోని ఆయన స్వగృహంలో తుది శ్వాస విడిచారు.
రెడ్డి రాఘవయ్య గారు గుంటూరు జిల్లా అమృతలూరు మండలం ప్యాపర్రు గ్రామంలో శ్రీమతి మహా లక్ష్మమ్మ, కిష్టయ్య దంపతులకు 1940 జూలై 01న జన్మించారు, ప్యాపర్రు, నిడుబ్రోలు లో పాఠశాల విద్య అభ్యశించారు. నెల్లూరు పారిశ్రామిక శిక్షణా సంస్థలో శిక్షణ పొంది, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అయిన హిందూస్తాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ సంస్థలో ఉద్యోగంలో చేరి, బెంగుళూరు మరియు హైదరాబాదు లో పనిచేసి, 2000 సంవత్సరంలో పదవీ విరమణ పొందారు.
రెడ్డి రాఘవయ్య గారు ఆది నుండి బాలసాహిత్యంలోనే కృషి చేశారు. 1955 డిసెంబర్ 25 వ తేదీ విశాలాంధ్ర దిన పత్రికలో వచ్చిన సలహా అనే కథ వీరి మొదటి రచన.
1979 లో వీరి పదాలు, పద్యాలు కలిపి, ‘బాల నీతిమాల’ పేరుతో మొదటి పుస్తకం వెలుగు చూసింది. అది మొదలు మణిదీపాలు, నవరత్నాలు, బాలల లోకం, పసిడి పాటలు, మంచి పూలు, జ్ఞానులు-విజ్ఞానులు, పూలతోట, రంగుల రాట్నం ఇలా సంవత్సరానికి ఒక పుస్తకం చొప్పున వెలువడ్డాయి. రెండు రోజుల క్రితమే డీ.టీ.పీ. పూర్తీ చేసుకున్న ఆయన పుస్తకాన్ని ప్రూఫులు దిద్దుతూ కుమార్తె, రాజేశ్వరితో ఇదే నా చివరి పుస్తకం అని పదే పదే అనడం విశేషం.
వీరు స్వయంగా బాలసాహితీ వేత్త కాకుండా, ఏంతో మంది యువ బాలసాహితీ రచయితలను ప్రోత్సహించారు. బాలసాహిత్య కృషి చేస్తున్న రచయితల వివరాలన్నీ సేకరించి, 1995 ప్రాంతంలో వార్త దినపత్రిక ద్వారా వారం వారం ప్రపంచానికి పరిచయం చేశారు. ఆ వివరాలన్నీ కలిపి తెలుగు బాలల రచయితల సంఘం 2002 లో పుస్తకంగా తీసుకువచ్చింది.
రాఘవయ్య గారు బాలసాహిత్యంలో చేసిన కృషికి గుర్తింపుగా వారి నేతాజీ సుభాష్ చంద్రబోస్
పుస్తకానికి 2003 సంలో శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉత్తమ బాల సాహిత్య పురస్కారంలభించింది.
చిరుదివ్వెలు పుస్తకానికి గాను, 2012 సంలో కేంద్ర సాహిత్య అకాడెమీ బాలసాహిత్య పురస్కారం, లభించింది.
బాలసాహిత్యంలో విశేష కృషి చేసిన శ్రీ రెడ్డి రాఘవయ్య గారిని తెలుగు నేలపై బాలసాహిత్యం రంగంలో ఇచ్చే గుంటూరు నన్నపనేని మంగాదేవి అవార్డు, చిలుమూరు, తెనాలి చక్రపాణి-కొలసాని అవార్డు, పార్వతీపురం మంచిపల్లి సత్యవతి జాతీయ అవార్డు వంటి అన్ని పురష్కారాలూ వరించాయి. ఇందులో వాత్సల్య, రామినినేని ఫౌండేషన్ వంటివి కూడా ఉండటం విశేషం. రాఘవయ్య గారు చాలా పట్టుదల గల మనిషి. ఒక లక్ష్యం మనసులో అనుకున్నారంటే, ఆయన నిదుర పోరు అవతల వారిని నిదుర పోనివ్వరు. ఆ పని జరుగాల్సిందే!
రాఘవయ్య గారికి భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు.
రేపు ఉదయం అనగా 25-07-2022 సోమవారం మధ్యాహ్నం ఎర్రగడ్డలోని ఇ.ఎస్.ఐ సమీపంలో ఉన్న స్మశాన వాటికలో అంత్యక్రియలు జరుగుతాయని వారి కుమార్తె రాజేశ్వరి గారు తెలియజేశారు.
రాఘవయ్య గారి మరణం బాలసాహిత్య లోకానికి తీరని లోటు.
బాలసాహిత్య పరిషత్తు రాఘవయ్య గారికి అశ్రునివాళి.
వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తోంది.
-దాసరి వెంకట రమణ
కార్యదర్శి
బాలసాహిత్య పరిషత్, హైదరాబాదు
9000572573

బాలసాహితీశిల్పులు (వాట్‍సాప్) సౌజన్యంతో

జూలై 21, 2022

ప్రశంసః కృష్ణస్వామిరాజు

Posted in బాల బండారం, మన కథకులు, సాహితీ సమాచారం వద్ద 4:02 సా. ద్వారా వసుంధర

హాస్యానందం (వాట్‍సాప్) సౌజన్యంతో

జూలై 11, 2022

ప్రశంసః చొక్కాపు

Posted in మన కథకులు, సాహితీ సమాచారం వద్ద 5:33 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీ శిల్పులు సౌజన్యంతో

జూలై 10, 2022

పరిచయం: డా. వడ్డేపల్లి

Posted in బాల బండారం, మన కథకులు, సాహితీ సమాచారం వద్ద 12:06 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

తర్వాతి పేజీ