జూలై 29, 2016

వసుంధర వెబ్‍సైట్‍లో జూలై 29 టపాలు

Posted in బుల్లితెర "కోతికొమ్మచ్చి", ముఖాముఖీ వద్ద 10:32 ఉద. ద్వారా వసుంధర

వ్యంగ్యరేఖలు- డెక్కన్ క్రోనికిల్

నివాళిః మహాశ్వేతాదేవి

మన పాఠ్యాంశాలు- ఒక పరిశీలన

వ్యంగ్యరేఖలు- ఈనాడు

ప్రశంసః సినారె

నివాళిః పరబ్రహ్మశాస్త్రి

కబాలిలో మై ఫాదర్ బాలయ్య

 

నవంబర్ 25, 2014

తెలుగుతనానికి గానపథం

Posted in పాడుతా తీయగా వద్ద 7:56 సా. ద్వారా వసుంధర

ఈటివిలో వచ్చే పాడుతా తీయగా- ఆ ఛానెల్లో వచ్చే కార్యక్రమాలకు తలమానికం. సినీ లలిత సంగీతానికి ప్రయోజనాత్మకం.  ఆ కార్యక్రమాన్నిగాన గంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం (బాసు) నిర్వహిస్తున్న తీరు నిరుపమానం, ఔత్సహికులకు గొప్ప వరం. ఇక అమెరికాలోని ఔత్సాహిక గాయకులను ప్రోత్సహించడానికి  బాసు ‘అమెరికాలో రాగసాగరిక’ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఐతే పాత కార్యక్రమాలతో పోల్చితే- ఆ గాయనీ గాయకుల ప్రదర్శన కొంత నిరుత్సాహాన్ని కలిగించింది. సంగీత కార్యక్రమాలకు ప్రతిభకే తప్ప ప్రాంతానికి ప్రాధాన్యం ఇవ్వకూడదని కూడా అనిపించింది. ఇప్పుడు బాసు అమెరికాలో చిన్నారులకోసం కొత్తగా నిర్వహిస్తున్న ‘అమెరికాలో రాగసాగరిక’ కార్యక్రమంలో కూడా  గాన ప్రతిభ అంతంతమాత్రంగానూ, అడపా తడపా బహు చప్పగానూ అనిపిస్తోంది. మరి అమెరికాకోసం ప్రత్యేకంగా ఈ కార్యక్రమం అవసరమా అంటే అవసరమే!

బాసు నిర్వహించే కార్యక్రమం మనకు ప్రతిభావంతుల పాటలు వినిపించడానికి కాదు. మట్టిలో మాణిక్యాల్ని వెలికి తియ్యడానికీ, వజ్రాల్ని సానబెట్టడానికీ, అన్న విషయం- ఇప్పటికే నిరూపితమైంది. ఈ కార్యక్రమం సంగీత శిక్షణ. భాషోచ్చారణకు సవరణ. భావప్రకటనకు వివరణ.

తెలుగుతనానికి గానపథం

తెలుగు పాటలకు బాలు కదం

ఇది సుబ్రమణ్య జనితం

బాల సుబ్రమణ్య పథకం

అని పాడుకోవాలనిపిస్తుంది- ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న అమెరికా తెలుగువారి వేషధారణలో, భాషోచ్చారణలో- అచ్చ తెలుగుతనాన్ని వీక్షించినప్పుడు. నిర్వాహకులు, పాల్గొనువారల నిబద్ధతను గమనించినప్పుడు. మాణిక్యాల్ని వెలికి తియ్యగలవారు- ఒక మట్టికే పరిమితం కాలేరు కదా! ఈ కార్యక్రమం ఇంకా ఎన్నో దేశదేశాలకి విస్తరించి- తెలుగు భాషకీ, తెలుగు తనానికీ- అంతరిస్తాయన్న అనుమానమే లేకుండా చెయ్యగలవని మా నమ్మకం. మచ్చుకి నవంబర్ 24న వచ్చిన అమెరికాలో రాగసాగరిక కార్యక్రమంకోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

ఈటివి, బాసులకి అభివందనాలు.

 

 

నవంబర్ 12, 2014

సీతామాలక్ష్మీ- ఒక విశ్లేషణ

Posted in టీవీ సీరియల్స్ వద్ద 8:30 సా. ద్వారా వసుంధర

seetamalakshmi

ఆంధ్రభూమి

అక్టోబర్ 16, 2014

ఎక్స్‍ట్రా జబర్దస్త్- ఒక మంచి స్పందన

Posted in టీవీ సీరియల్స్ వద్ద 7:13 సా. ద్వారా వసుంధర

extra jabardast

ఆంధ్రభూమి

అక్టోబర్ 10, 2014

ఎక్స్‍ట్రా జబర్దస్త్

Posted in టీవీ సీరియల్స్ వద్ద 3:32 సా. ద్వారా వసుంధర

ఒక పక్క పాడుతా తీయగా వంటి కార్యక్రమాలతో తన అభిరుచిని నిరూపించుకుంటున్న ఈటీవీ- సంసారపక్షం సినిమాలో ఐటమ్ సాంగ్ చూపించినట్లు- టిఆర్‍పిలకోసం ఆరంభించిన కొత్త కార్యక్రమం జబర్దస్త్. దీన్ని నిర్వహించేది మర్యాదకు మారుపేరులా హుందాగా కనిపించే నాగబాబు, ప్రజాప్రతినిధిగా రాజకీయాల్లోనూ రాణిస్తున్న నటి రోజా.  ఈ కార్యక్రమం ఉద్దేశ్యం నవ్వించడమే ఐనా అందుకు ఆదర్శంగా మునిమాణిక్యం, మొక్కపాటి, చిలకమర్తి ప్రభృతుల్ని ఎన్నుకుంటే బాగుందేది. లేదా నేటి జంధ్యాల శ్రీవారికి ప్రేమలేఖ, అహ నా పెళ్లంట చిత్రాల్ని తీసుకున్నా బాగుండేది. మగవాళ్లు ఆడవేషం వెయ్యడం, అసభ్యంగా మాట్లాడ్దం, చెంపదెబ్బలు కొట్టడం, కాళ్లతో తన్నడం, అక్రమ సంబంధాల్ని చతురోక్తులుగా వాడడం- ఇదీ ఇందులో ఎక్కువ భాగం హాస్యం. నటీనటుల ప్రతిభ అసమానంగా అనిపించినా- అసభ్యత పెచ్చు మీరి వారిపట్ల జుగుప్స కూడా కలుగుతోంది. ప్రజాస్వామ్యం మనుగడకు వైను షాపులు అవసరపడ్డట్లు టీవీ చానెల్సు మనుగడకి ఇలాంటి కార్యక్రమాలు అవసరమేమో తెలియదు. వైను షాపుల్ని తప్పు పట్టలేం కాబట్టి, వీటినీ తప్పించుకోవడమే తప్ప తప్పు పట్టలేం. ఆపైన జనం విరగబడి చూస్తుంటే ఇంకేమనగలం? యాంకరుగా తన అభిరుచిని నిరూపించుకున్న ఉదయభాను కూడా ఇలాంటిదే తడాఖా అనే కార్యక్రమం ప్రారంభించి అసభ్యతలో జబర్దస్త్‍కి పోటీ పడడమే ఆశయంగా నిర్వహించింది. ఈ కార్యక్రమాలు నిర్వాహకులకీ, చానెల్‍కీ, నటీనటులకీ  కూడా మచ్చగానే మిగిలిపోతాయన్న విషయం విస్మరించలకూడదు. ఏది ఏమైనా దీనికి లభించిన జనాదరణ కారణంగా ఒక జబర్దస్త్ చాలదని ఈ రోజునుంచి  ఎక్స్‍ట్రా జబర్దస్త్ కార్యక్రమాన్ని అదనంగా మొదలెడుతున్నారు ఈటీవీ వారు.  ఈ కార్యక్రమంలో 10-20 శాతం అంశాలు ఆరోగ్యకరమైన హాస్యంతో అలరిస్తూండడంవల్ల క్రమంగా- ఆ శాతం పెరుగుతుందన్న ఆశకు అర్థముంది. ఎటొచ్చీ ఎక్స్‍ట్రా కబర్దస్త్‍లో ఆ ఎక్స్‍ట్రా అసభ్యతకో, ఉత్తమ హాస్యానికో మరి! ఈ విషయమై ప్రేక్షకుల స్పందన కోరుతున్నాం. ఎక్ఫ్‍ట్రా జబర్దస్త్ గురించిన ప్రకటన ఈ క్రింద ఇస్తున్నాం.

jabardast

                  ఈనాడు

 

తర్వాతి పేజీ