జనవరి 25, 2023

ఆహ్వానంః కార్టూన్ పోటీ బహుమతి ప్రదానోత్సవం

Posted in కార్టూన్ల పోటీ వద్ద 7:36 సా. ద్వారా వసుంధర

హాస్యానందం (వాట్‍సాప్) సౌజన్యంతో

జనవరి 24, 2023

కార్టూన్ల పోటీః ఎన్‍సిసిఎఫ్

Posted in కార్టూన్ల పోటీ వద్ద 6:40 సా. ద్వారా వసుంధర

హాస్యానందం (వాట్‍సాప్) సౌజన్యంతో

NCCF (North Coastalandhra Cartoonists Forum), విశాఖపట్నం వారి ఆధ్వర్యంలో కార్టూన్ల పోటీ మరియు విశాఖపట్నం లో కార్టూన్ల ప్రదర్శన


శోభకృత్ సంవత్సర ఉగాది సందర్భంగా జాతీయస్థాయి కార్టూన్ పోటీలు NCCF వారు నిర్వహిస్తున్నారు.ఈ పోటీలో వచ్చిన కార్టూన్లలో అత్యుత్తమమైన ఐదు కార్టూన్లను ఎంపికచేసి ఒక్కోదానికి రూ 1000/- చొ.న నగదు బహుమతి మరియు ఉత్తమమైన ఐదు కార్టూన్లకు రూ 500/-చొ.న ఇవ్వనున్నారు.
నిబంధనలు:
1) దేశవిదేశాల్లోనున్న తెలుగుకార్టూనిస్టులందరూ పాల్గొనవచ్చును.
2) ప్రతీ కార్టూనిస్టూ మూడు కార్టూన్ల వరకు పంపవచ్చును
3) A4 సైజులో 300 dpi లో jpg/jpeg ఫైల్ ఫార్మాట్ లో కలర్ లోగానీ/ బ్లాక్ అండ్ వైట్ లో గానీ వేసిపంపాలి.
4) మీకు నచ్చిన సబ్జెక్టుపై వినూత్నంగా వేసిన నవ్వించే కార్టూన్లను మాత్రమే పంపండి. కేప్షన్ లెస్ కార్టూన్లకు ప్రాధాన్యత ఉంటుంది.
5) మీ కార్టూన్లను 20-2-2023 తేదీ లోగా ఈ క్రింది ఈ మెయిల్ కు పంపవలెను.
nccfvisakhapatnam@gmail.com
6) బహుమతి పొందిన పది (ఐదు +ఐదు)) కార్టూన్లు ఏప్రిల్2023 హస్యానందం సంచికలో ప్రచురించబడతాయి.

 1. పోటీకి వచ్చిన కార్టూన్లనుంచి బహుమతి పొందినవే కాక, ఇతర మంచి కార్టూన్లు ఎంపికచేసి ఉగాది పర్వదినాన “కార్టూన్ల ప్రదర్శన” విశాఖపట్నం లో ఏర్పాటు చేయడం జరుగుతుంది.
  8) ఈ పోటీలు హాస్యానందం వారి సౌజన్యంతో నిర్వహించబడుతుంది.
  9) ఇతర వివరాలకు ఈ క్రింది నెంబర్లను సంప్రదించగలరు.

టి ఆర్ బాబు గారు
9440561425
లాల్ గారు
9247783307
20-1-2023

జనవరి 19, 2023

ఆహ్వానంః పురస్కార ప్రదానోత్సవ సభ

Posted in కార్టూన్ల పోటీ వద్ద 1:55 సా. ద్వారా వసుంధర

హాస్యానందం (వాట్‍సాప్) సౌజన్యంతో

జనవరి 16, 2023

కార్టూన్ల పోటీ ఫలితాలుః తానా

Posted in కార్టూన్ల పోటీ వద్ద 3:47 సా. ద్వారా వసుంధర

హాస్యానందం (వాట్‍సాప్) సౌజన్యంతో

ఉత్తరఅమెరికా తెలుగుసంఘం (తానా) సాహిత్య విభాగం – “తానా ప్రపంచసాహిత్య వేదిక” ఆధ్వర్యం లో అంతర్జాతీయ స్థాయిలో సంక్రాంతి పర్వదిన సందర్భం గా “తెలుగు భాష, సంస్కృతిపై” నిర్వహించిన కార్టూన్ల (వ్యంగ్య చిత్ర) పోటీల ఫలితాలు:

అత్యుత్తమ కార్టూన్ల విభాగంలో విజేతలు -12 మంది (ఒక్కొక్కరికి 5,000/- రూ. నగదు బహుమానం): –

 1. ధర్, విజయవాడ
 2. పైడి శ్రీనివాస్, వరంగల్
 3. నాగిశెట్టి, విజయవాడ
 4. ప్రసిద్ధ, హైదరాబాద్
 5. సముద్రాల, హైదరాబాద్
 6. వర్చస్వీ, హైదరాబాద్
 7. సుధాకర్, జైపూర్-ఒరిస్సా
 8. హరికృష్ణ, కలువపాముల
 9. యస్వీ. రమణ, హైదరాబాద్
 10. ప్రేమ, విశాఖపట్నం
 11. పిస్క వేవుగోపాల్, జగిత్యాల
 12. తోపల్లి ఆనంద్, హైదరాబాద్

ఉత్తమ కార్టూన్ల విభాగంలో విజేతలు -13 మంది (ఒక్కొక్కరికి 3,000/- రూ. నగదు బహుమానం)

 1. బాల, విజయవాడ
 2. కామేష్, హైదరాబాద్
 3. యం.ఏ. రహూఫ్, కోరట్ల
 4. గోపాలకృష్ణ, పెనుగొండ
 5. దొరశ్రీ, నెల్లూరు
 6. శేఖర్, రాజమండ్రి
 7. కాష్యప్, విశాఖపట్నం
 8. ఆనంద్ గుడి, రాజుపాలెం
 9. లేపాక్షి, హైదరాబాద్
 10. బొమ్మన్, కంకిపాడు
 11. భూపతి, కరీంనగర్
 12. అంతోటి ప్రభాకర్, కొత్తగూడెం
 13. డి. శంకర్, కోరుట్ల

ఈ పోటీలకు న్యాయనిర్ణేతలుగా కిరణ్ ప్రభ (అమెరికా) గారు, శ్రీమతి ప్రశాంతి చోప్రా (దుబాయి) గారు, అరవిందా రావు (లండన్) గారు వ్యవహరించారు.

విజేతలకు బహుమతులు జనవరి 22, ఆదివారం విజయవాడలో జరిగే సభలో అందజేయబడతాయి.

పాల్గొన్నవారికి, విజేతలకు శుభాకాంక్షలు. నిర్వాహక సంఘ సభ్యులకు, న్యాయనిర్ణేతలకు ధన్యవాదములు.

డా. ప్రసాద్ తోటకూర,
తానా ప్రపంచ సాహిత్యవేదిక.

జనవరి 2, 2023

కార్టూన్ల పోటీః నవ మల్లెతీగ

Posted in కార్టూన్ల పోటీ, చిత్రజాలం వద్ద 5:10 సా. ద్వారా వసుంధర

హాస్యానందం (వాట్‍సాప్) సౌజన్యంతో

తర్వాతి పేజీ