శతజయంతిః శ్రీ జొన్నలగడ్డ సోమేశ్వర అచ్యుత రామచంద్రరావు (ఫిబ్రవరి 1922- జూన్ 1996)

శ్రీ సోమేశ్వర అచ్యుత రామచంద్రరావు బంధువర్గంలో సోమరాజుగా ప్రసిద్ధులు. ఆయననకు ఎనిమిదవ ఏట శ్రీమతి (చింతపెంట) మహాలక్ష్మితో వివాహమైంది. అప్పటినుండి ఈ దంపతులు ఆ జన్మాంతం కలిసే ఉంటూ పుణ్యదంపతులుగా గౌరవించబడ్డారు. ఎవరు వారిని తలచినా జంటగానే ప్రస్తావించడం రివాజు. 1991లో శ్రీమతి మహాలక్ష్మి, 1996లో శ్రీ సోమరాజు దివంగతులైనారు. వారి పిల్లలు వారిని అనుదినం స్మరించుకుంటూనే ఉంటారు.
శ్రీ సోమరాజుగారు కవి, పండితుడు, నిస్వార్థజీవి, యోగి. ఆయన వ్యక్తిత్వం విలక్షణం, విశిష్టం. ఆయన గురించి అక్షరజాలం పాఠకులు తెలుసుకోవాల్సిన ఆసక్తికరమైన విశేషాలు ఎన్నో ఉన్నాయి.
రేపటితో శ్రీ సోమరాజుగారికి వందేళ్లు నిండుతాయి. రేపటితో ప్రారంభించి- ఈ పుటలో ఆయనకీ, ఆ పుణ్యదంపతులకీ సంబంధించిన విశేషాలను ఒకటొక్కటిగా అందించగలం……