జనవరి 26, 2023
అభినందనః శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి
రంజని మిత్రులు (వాట్‍సాప్) సౌజన్యంతో

మా చిన్నతనంలో కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథ ఉన్నదంటే రాత్రి తొమ్మిది అని పదిగంటలకు మొదలయ్యేది. నాలుగు గంటలపాటు కోట సచ్చిదానంద శాస్త్రి గారి హరికథ చెప్పేవారు. ఎన్నో భక్తిగీతాలు సందర్భోచితంగా ఎంతో హృద్యంగా పాడుతూ రసవత్తరంగా కథను చెప్పటంలో ఆయనే నెంబర్ వన్. తెలుగునాట హరికథ చెప్పటంలో ఆరు దశాబ్దాలకు పైగా ఖ్యాతిని పొందిన కళాకారులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి.
ఎంతోమంది శిష్యులను హరికథ కళాకారులుగా తీర్చిదిద్దిన ఘనత వారిది.
న్యూఢిల్లీలో ఉన్న ఏ.పి. భవన్ లోనూ వారి హరికథ ఏర్పాటు చేసినట్లు విన్నాను.
ఆలస్యంగా నైనా తెలుగునాట ఒక హరికథ కళాకారుడికి పద్మశ్రీ లభించటం ఎంతైనా ఆనందదాయకం.
అభినందనలు.

స్పందించండి