జనవరి 20, 2023
సినీవాలి జనవరి 2023
కథకుల ముఖచిత్రాలు పత్రికలకు సత్సంప్రదాయం, గొప్ప అలంకారం. సినీవాలికి అభినందనలు.

ఈ నెల ‘సినీవాలి మాసపత్రిక’ విడుదల అయింది.
‘రేలపూల’ పరిమళాలు పంచుతూ, తెలుగు సాహితీ లోకానికి గిరిజనుల జీవిత సుగంధాలను పరిచయం చేసిన, అసమాన్య రచయిత్రి Sammeta Umadevi గారు, ఈ మాసపు ముఖపత్ర అతిథి.
వారి గురించిన సంపాదకీయంలోని కొన్ని excerpts..
జీవితం, అందరికీ పూలబాట కాదు. ముళ్ళబాటల్లో ప్రయాణించిన వారికే, పూలబాటల లాలిత్యం తెలుస్తుంది. మనం ముళ్ళబాటల్లో నడిచామని ప్రపంచానికి మన దుఃఖాన్ని పంచకూడదు.
ప్రజల జీవితాల్లో ‘రేలపూలు’ పూయించి నవనవోన్మేష సుమ సుగంధాలను ప్రసరిస్తూ, ఈ దుఃఖభరిత ప్రపంచంలో ఒక ఆశావహ దృక్పథాన్ని నింపుతున్న ఉమాదేవిగారు తమ సాహితీ ప్రయాణంలో మరిన్ని ఉత్కృష్టమైన శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ……
సంపాదకీయం మరియు మిగిలిన కథలు, సీరియల్స్, కవితలు, ‘ఆకాశమే హద్దుగా’ వంటి శీర్షికలు చదవడానికి
http://www.cineevaali.com లింక్ తెరిచి పత్రికలోని సాహితీ గగనంలో విహరించండి.
స్పందించండి