జనవరి 5, 2023
ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలుః మనతెలుగుకథలు.కామ్
ఉగాది 2023 సీరియల్ నవలల పోటీలు
ఏకైక ప్రథమ బహుమతి రూ: 15000 /-
ఐదు ప్రత్యేక బహుమతులు ఒక్కొక్కటి రూ: 1000 /-
మీరు నూతన రచయితలయినా, లబ్ద ప్రతిష్ఠులైన రచయితలైనా బహుమతులు పొందడానికి సమాన అవకాశాలు వున్నాయి. బహుమతుల ఎంపిక నిష్పక్షపాతంగా జరుగుతుంది. బహుమతుల ఎంపికలో పాఠకుల అభిప్రాయాలు కూడా పరిగణనలోకి తీసుకొనబడతాయి.
నిబంధనలు :
*సీరియల్ నవల కనీసం పది భాగాలుగా ఉండాలి. అంతకన్నా ఎక్కువ ఉండవచ్చు.
*ప్రతి భాగంలో సుమారు 8౦౦ పదాలు ఉండాలి.
*వారానికి ఒక ఎపిసోడ్ ప్రచురింపబడుతుంది.
*మొత్తం నవల ఒకేసారి పంపాలి.
*రచయితలు తామే ఎన్ని వారాలు ప్రచురించాలనుకుంటున్నారో అన్ని భాగాలుగా విభజించి పంపాలి.
*మరుసటి భాగం కోసం పాఠకులు ఎదురు చూసేలా రాయాలి.
*సీరియల్ నవలలు పంపాల్సిన చివరి తేదీ 15/01/2023.
*కాపీ నవలలు, ఇదివరకే ప్రచురింపబడ్డ నవలలు, అనువాద నవలలు, ఇతర పత్రికలలో పరిశీలనలో ఉన్న నవలలు పంపరాదు.
*మీ రచనల్లో అచ్చు తప్పులు, వ్యాకరణ దోషాలు లేకుండా ఒకటికి రెండు సార్లు పరిశీలించి పంపండి.
*ఇదివరకే ప్రింట్ మీడియాలో గానీ, వెబ్ సైట్లలో గానీ , బ్లాగ్ లలో గానీ ఇతర గ్రూప్ లలో గానీ ప్రచురింపబడ్డ నవలలు బహుమతులకు పరిగణింపబడవు. ఆ మేరకు హామీ పత్రం జత చేయాలి.
*ఒకరు ఎన్ని సీరియల్ నవలలైనా పంపవచ్చును.
*వెంటనే మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.
* మీ నవలలను మా వెబ్ సైట్ లోని అప్లోడ్ లింక్ ద్వారా పంపండి.
లేదా story@manatelugukathalu.com కు text document/odt/docx రూపంలో మెయిల్ చెయ్యవచ్చు.
*పి.డి.ఎఫ్ రూపంలో పంపే నవలలు పరిశీలింపబడవు.
*ఫలితాలు 15/04/2023 న ‘మనతెలుగుకథలు.కామ్’ లో ప్రచురింపబడతాయి.
*తుది నిర్ణయం ‘మనతెలుగుకథలు.కామ్’ వారిదే.
*ఈ విషయమై ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
*గమనిక: ప్రచురింపబడే అన్ని రచనల పైనా మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ( పోడ్కాస్ట్ చెయ్యడం, యు ట్యూబ్ లో ఉంచడం లాంటివి) ఉంటాయి.
*మనతెలుగుకథలు.కామ్ లో ఒకసారి ప్రచురింపబడ్డ కథలు, నవలలు ఎట్టి పరిస్థితులలోను తొలగింప బడవు. ఇందుకు సమ్మతించేవారే తమ రచనలను పంపవచ్చు.
*మనతెలుగుకథలు.కామ్’ యాజమాన్యం, వారి కుటుంబ సభ్యులు, సన్నిహితులు బహుమతులకు అనర్హులు.
*బహుమతులను పాక్షికంగా గానీ, పూర్తిగా గానీ రద్దు చేయడానికి, మార్పులు చేయడానికి మనతెలుగుకథలు.కామ్ వారికి పూర్తి హక్కులు ఉన్నాయి.
స్పందించండి