డిసెంబర్ 4, 2022

“శాక్రమెంటో తెలుగు వెలుగు” పత్రిక – డిసెంబర్ 2022 సంచిక

Posted in మన పత్రికలు, సాహితీ సమాచారం వద్ద 4:24 సా. ద్వారా వసుంధర

శాక్రమెంటో తెలుగు వెలుగు ఈమెయిల్) సౌజన్యంతో

“శాక్రమెంటో తెలుగు వెలుగు” పత్రిక – డిసెంబర్ 2022 సంచిక

పాఠక మిత్రులారా, 
 
ఆంగ్ల సంవత్సరం పూర్తి చేసుకుంటూ కొత్త సంవత్సరం లో అడుగిడడానికి సన్నద్ధం అవుతున్న సందర్భంగా పాఠక మిత్రులందరికి శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ..”శాక్రమెంటో తెలుగు వెలుగు” పత్రిక – డిసెంబర్ 2022 సంచిక మీ ముందుకు వచ్చింది. ఈ సంచిక కోసం ఈ లంకెను క్లిక్ చెయ్యండి.
https://tinyurl.com/TagsTeluguVelugu32
లేదా 

ఈ డిసెంబర్ మాస పత్రికతో 2022 సంవత్సరానికి  ప్రయోగాత్మకంగా జనవరి నుండి డిసెంబర్ వరకు మొత్తం 12 సంచికలు వెలువరించాలి అన్న మా ప్రయత్నం సఫలం అయ్యింది. ఈ ఏడాది క్రతువులో మా సంపాదకీయ బృందం, రచయితలు, అక్షర దోషాల పని పట్టే బృందం ఇంకా కార్యకర్తలు, మరెందరో ఈ 12 సంచికలకు మూల స్తంభంగా నిలిచారు. వారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు. 

కరోనా కారణంగా మరి ఇతరత్రా కారణాల చేత శాక్రమెంటో తెలుగు సంఘం కార్యక్రమాలు ప్రతి నెలా జరపడం అసాధ్యంగా మారింది. దానికి తోడు అనివార్యమైన కారణాల చేత  “UAN మూర్తి 5వ  కథ – కవితల పోటీ” నిర్వహణ ప్రస్తుతానికి వాయిదా వేయబడినది. అంతేకాక వనరుల లేమి, తదితర కారణాలతో  2023 సంవత్సరానికి శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికను మాస పత్రికగా కొనసాగించడం కష్టసాధ్యంగా మారింది. అయితే శాక్రమెంటో తెలుగు వెలుగు పాఠకులను నిరాశపరచకుండా శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికను “వార్షిక సంచిక” రూపంలో తీసుకురావాలని సంకల్పించాం. ఇకపై ప్రతి సంవత్సరం జనవరి నెలలో శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికను “వార్షిక సంచిక” రూపంలో సంక్రాంతి కానుకగా పాఠకులకు అందించాలని నిర్ణయించడం జరిగింది. పాఠకమిత్రులు ఎప్పటివలె శాక్రమెంటో తెలుగు వెలుగు పత్రికను ఆదరించి, మనసారా ఆశీర్వదించాలని కోరుకుంటున్నాము.

కొత్త రచనలకు, కొత్త రచయితలకు స్వాగతం:
“శాక్రమెంటో తెలుగు వెలుగు” వార్షిక పత్రిక ఎప్పటికప్పుడు కొత్త రచనలను, కొత్త రచయితలను ఆహ్వానిస్తుంది. ఈ సందర్భంగా పాఠకుల నుండి, కొత్త కలాలనుండి, అలాగే అనుభవజ్ఞులైన రచయితలనుండి కూడా ఒక అభిప్రాయ సేకరణ కార్యక్రమానికి మేము పూనుకొన్నాము. ఈ అభిప్రాయ సేకరణలో పాల్గొని మీ అభిప్రాయాలు తెలియజేసినవారందరికీ మా కృతజ్ఞతలు. అభిప్రాయ సేకరణలో ఇంకా పాల్గొననివారు చెయ్యవలసిందల్లా, ఒక్క ఐదు నిమిషాలు ఈ పనికి కేటాయించి ఈ క్రింది లంకెను నొక్కి మీ అభిప్రాయాలను, ప్రాధాన్యతలను మాకూ తెలియజెయ్యడమే. 
https://tinyurl.com/TagsTeluguVeluguSurvey2022 
ఇకపోతే  ఈ సంచిక లో శ్రమకోర్చి మేము పొందుపరచిన రచనలు, శీర్షికలు మీకు నచ్చుతాయని ఆశిస్తున్నాం. టాగ్స్ “శాక్రమెంటో తెలుగు వెలుగు” సంచికకు తమ రచనలు, శీర్షికలు అందజేసిన సాహితీ సైనికులందరికీ మా వందనాలు.

ఆరు ఏండ్ల క్రితం ‘తెలుగు వెలుగు పత్రిక’ ద్వారా తెలుగు సాహిత్య సేవకు శ్రీకారం చుట్టింది టాగ్స్ సంస్థ.   ఇది మనందరి పత్రిక.. మనదైన అచ్చ తెనుగు పత్రిక. ఈ తెలుగు భాషా సేవ యజ్ఞంలో ప్రపంచవ్యాప్తంగా  ఉన్న తెలుగు వారంతా భాగస్వాములు కావాలి. మీ అందరికీ ఇదే మా ఆహ్వానం…మీ రచనలు ఈరోజే మా ఈమెయిలు telugusac@yahoo.com  కు పంపండి. మీ అమూల్యమైన అభిప్రాయాలను దయచేసి మాకు తెలుపండి. “శాక్రమెంటో తెలుగు వెలుగు” పత్రిక పూర్వ సంచికలకు ఈ లంకెను http://sactelugu.org/tags-patrika/    క్లిక్ చెయ్యండి. 

ధన్యవాదాలు,
శాక్రమెంటో తెలుగు పత్రిక సంపాదక బృందం 
Telugu Association Of Greater Sacramento (TAGS)
Post Box: 1666
Folsom, CA-95763, USA
Website: http://sactelugu.org/tags-board  
Facebook: https://facebook.com/sacTelugu Our TAGS, the 3000+ member Telugu community for Telugu people in and around Sacramento, CA region in the USA.
TAGS Website: www.sactelugu.org
TAGS Facebook: https://facebook.com/sacTelugu

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: