నవంబర్ 24, 2022
తెల్సా-2022 కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక విడుదల
తెల్సా (ఈమెయిల్) సౌజన్యంతో
అందరికీ నమస్కారం.
తెల్సా-2022 కథలు, కవితల పోటీ ప్రత్యేక సంచిక – “సంగతి’-2022” విడుదలైంది.
https://sangati-2022.telsaworld.org
వచ్చిన కథ, కవితల సంఖ్య ఎక్కువగా వుండడమూ, పురస్కారాలు నిర్ణయించడంలో పోయినసారి కంటే ఎక్కువసార్లు వడపోత పోయవలసి రావడమూ, బొమ్మలు అందడంలో అనుకున్నదానికంటే ఎక్కువ సమయం కావడమూ, తెల్సాలో అందరూ తమతమ ఉద్యోగాలూ, కుటుంబ వ్యవహారాలూ చూసుకుంటూ లేని వ్యవధి కల్పించుకుని ఈ పోటీ పనులు చక్కబెట్టుకోవలసిన రావడమూ వల్ల ఇంతకాలం పట్టింది. పోటీలో పాల్గొన్నవారు, గెలుపొందినవారు ఓపిగ్గా వేచివున్నందుకు కృతజ్ఞులం.
ఈ కథలు, కవితలతో పాటు 2019 తెల్సా కథల పోటీలో సాధారణ ప్రచురణకు ఎంపిక అయిన ఏడు కథలను కూడా ప్రచురిస్తున్నాము. ఈ కథలకు పారితోషికం 2019 సెప్టెంబరు లోనే పంపినా, అనివార్య కారణాలవల్ల ఈ కథలను అప్పుడు ప్రచురించలేకపోయాము. ఆ కథలకు ప్రత్యేకంగా చిత్రాలు వేయించి ఇప్పుడు ప్రచురిస్తున్నాము.
ఈ సంచికలోని కథలూ, కవితలూ చదివి ఆస్వాదిస్తారనీ, మీ నిర్మాణాత్మకమైన అభిప్రాయాలు తెలుపుతారనీ, ఈ సంచికలోని కథలనూ, కవితలనూ, మీ స్నేహితులతోనూ, సోషల్ మీడియాలోనూ పంచుకొంటారని ఆశిస్తాము.
తెల్సాకు సాహితీ లక్ష్యాలు మాత్రమే కాక ఇతర లక్ష్యాలు ఉన్నాయి. మేము చేసిన, చేయబోయే సామాజిక కార్యక్రమాల గురించి About TELSA లో చదవండి.
తెల్సా-2022 పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ధన్యవాదాలు.
తెల్సా బృందం
స్పందించండి