నవంబర్ 18, 2022
రాష్ట్రస్థాయి కవితల పోటీః వసుంధర విజ్ఞాన వికాస సమితి
షార్ వాణి శ్రేయోభిలాషులు (వాట్‍సాప్) సౌజన్యంతో
కర్కముత్తారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి కవితల పోటీ
వసుంధర విజ్ఞాన వికాస మండలి
(రినెం.4393/96)
సామాజిక, సాంస్కృతిక విజ్ఞాన వేదిక
తెలంగాణ రాష్ట్రం
గడచిన 30 ఏండ్లుగా సామాజిక, సాంస్కృతిక రంగాలతో పాటు వివిధ రంగాలో కృషి చేస్తున్న వసుంధర విజ్ఞాన వికాస సమితి గతంలోలాగే పాఠశాల విద్యార్థులకు రాష్ట్ర స్థాయి కవితల పోటీ నిర్వహిస్తున్నది. గడచిన కొన్నేండ్లుగా వివిధ అంశాల్లో కవితల పోటీ నిర్వహించిన సంస్థ ఈ ఏడాది కర్కముత్తారెడ్డి స్మారక రాష్ట్ర స్థాయి కవితల పోటీని నిర్వహిస్తున్నది. అక్షరమే ఊపిరి’ అనే అంశం మీద విద్యార్థులు 25 లైన్లకు మించని కవితను పోటీకి పంపాలి. రెండు తెలుగు రాష్ర్టాలకు చెందిన పదవతరగతి లోపు విద్యార్థిని విద్యార్థులు మాత్రమే ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు. విద్యార్థుల విద్యార్హతలను నిర్ధారిస్తూ పాఠశాల ప్రధానోపాధ్యాయులు దృవీకరించిన పత్రంతో పాటు కవితా తమ సొంతమనే హమీ పత్రం తప్పనిసరి. కవితతోపాటు పాఠశాల చిరునామా, విద్యార్థి పూర్తి వివరాలు చిరునామాతో పాటు పోటో జతచేయాలి. అందుబాటులో ఉండే మొబైల్ నెంబర్‌ను కూడా పేర్కొనాలి.ఒకరు ఒక కవిత మాత్రమే పంపాలి. మాకు వచ్చిన కవితల్లో మొత్తం ఐదు ఉత్తమ కవితలను ఎంపిక చేసి ఐదుగురికి సమాన బహుమతులు అందజేస్తాం. వివరాలకు 8096677409 నెంబర్‌లో సంప్రదించగలరు.కవితలు చేరాల్సిన చివరి తేది- డిసెంబర్-15, 2022
- వి. మధుకర్ రెడ్డి, వ్యవస్థాపకులు, చదువు వెంకటరెడ్డి అధ్యక్షులు, కట్కూరి శంకర్ వర్కింగ్ ప్రెసిడెంట్
కవితలు పంపాల్సిన చిరునామా
వి.సుమలత, 8096677409
ఇ.నెం-13-1-3/3/6/2E
అవంతినగర్ తోట, మోతినగర్
హైదరాబాద్-500018
స్పందించండి