అక్టోబర్ 22, 2022

మీరు, మేము, పుస్తకాలు- అంతే!

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం వద్ద 4:06 సా. ద్వారా వసుంధర

శ్రీ కస్తూరి మురళీకృష్ణ (వాట్‍సాప్) సౌజన్యంతో

లతా మంగేష్కర్ జీవిత చరిత్ర, రామకథాసుధ కథల సంకలనం పుస్తకాలను ఒక విభిన్నమైన పద్ధతిలో ఆవిష్కరించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. పుస్తకావిష్కరణ అంటూ ఒక సభను నిర్వహించి, పెద్దలను పిలిచి ఉపన్యాసాలిప్పించటం కాకుండా, వినూత్నమయిన విధంలో పుస్తకావిష్కరణ జరుగుతుంది.
పుస్తకాలను పెట్టుకుని రచయితలు ఫుట్ పాత్‍లపై కూర్చోవటం చూశాము.
చిన్న పిల్ల రచయిత్రులు అంకుల్ నా పుస్తకం కొనండి ప్లీజ్ అని అభ్యర్ధించి పుస్తకాలు అమ్మటం చూశాం.
పుస్తకం అట్టపై ఆర్ట్ పేరిట స్త్రీ నగ్న శరీరాన్ని ప్రదర్శించి పుస్తకాలు అమ్మటమూ చూశాము.
పుస్తకాలను ఆధునికం పేరిట బార్‍లలో ఆవిష్కరించటం కూడా చూశాము.
ఇలాంటి చీప్ ట్రిక్స్, ఓవర్ యాక్షన్ నౌటంకీలు లేకుండా, కేవలం పుస్తకం రచన నాణ్యతను, నైపుణ్యాన్ని ఆధారం చేసుకుని ఎలాంటి, వందిమాగధభజన బ్రందాల కేకలబాకాలు లేకుండా, రచయిత, పాఠకుడు, పుస్తకం మాత్రమే వుండేలా ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలని నిశ్చయించాము.

పుస్తకాలను అందించేందుకు ఒక గమ్మత్తయిన పద్ధతిని ఆలోచించాము. ఒక గమ్మత్తయిన కార్యక్రమం నిర్వహిస్తున్నాము. ఈ కార్యక్రమం పేరు

HAVE A BOOK, HAVE COFFEE WITH US…
పుస్తకం కొనండి.. మాతో కాఫీ తాగండి..

నవంబర్ 9, ఆదివారం ఉదయం నుంచి సాయంత్రంవరకు పుస్తకం కొనాలనుకునేవారు, పుస్తకం కొని చదివి రచయితను, కథా సంకలనం సంపాదకులను ప్రశ్నించాలనుకునేవారు, తిన్నగా మా ఇంటికి రావచ్చు. పుస్తకం కొని కాఫీ తాగుతూ పుస్తకం చదవవచ్చు. ఏమైనా సందేహాలుంటే అడగవచ్చు. పుస్తకాలపై నిర్మొహమాటమయిన అభిప్రాయాలు చెప్పవచ్చు. ఇష్టమయినంతసేపు వుండి వెళ్ళవచ్చు…
అంతే, ఉపన్యాలు, కితాబులూ ఏమీ వుండవు.
మీరు, మేము, పుస్తకాలు- అంతే! మిగతావన్నీ అనవసరం… (బాకీ సబ్ బక్వాస్)
ఈ కార్యక్రమంలో పాల్గొనాలనుకునేవారు తమ ఆసక్తిని, సంసిద్ధతను తెలియచేస్తే సంతోషిస్తాము….ఇంటి చిరునామా, లొకేషన్ అందచేస్తాము.
నవంబర్ 9, ఆదివారం, ఉదయం పది నుండి సాయంత్రం వరకూ…
సాహిత్యాభిమానులందరికీ స్వాగతం!!!!
హైదెరాబాద్‍లో ఈ కార్యక్రమానికి లభించిన ఆదరణను చూసి, నగరంలో ఇతర ప్రాంతాలలోనేకాదు, రెండు రాష్ట్రాలలో పలి ప్రాంతాలలో ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తాము….

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: