అక్టోబర్ 7, 2022

జోహారు ఉమాదేవీ!

Posted in ఆరోగ్యం, సాంఘికం-రాజకీయాలు వద్ద 12:01 సా. ద్వారా వసుంధర

నిన్ను అనుకరించాలనుంది, అనుసరించాలనుంది

స్వార్థం, మోహం – ఇంకా ఎన్నో అడ్డొస్తున్నాయి….

నిన్ను అభినందించాలనుంది, దీవించాలనుంది

సిగ్గు, అభిమానం – ఇంకా ఏవీ అడ్డు రావడం లేదు….

ఆ అదృష్టాన్ని మనసారా స్వీకరిస్తూ

జోహారు ఉమాదేవీ జోహారు!

రంజని మిత్రులు, ఇతరులు (వాట్‍సాప్) సౌజన్యంతో

విరాళ దాత డా. ఉమా గవిని ఎవరనేది ఏ పత్రికా వార్తలలోనూ ప్రచురితం కాలేదు. ఆమె తెనాలి తాలూకా కూచిపూడికి చెందిన ప్రముఖ హేతువాది, విఖ్యాత రచయిత, మానవవాది కీ.శే. డా. గవిని వెంకట కృష్ణ రావు (1914 – 1979 ) గారి రెండవ కుమార్తె.
జి. వి. కె. గా ప్రసిద్ధులైన గవిని వెంకట కృష్ణరావు ఎం. ఏ. చదవకుండానే బి. ఏ. పట్టా మీదనే 1955 లో మద్రాసు విశ్వవిద్యాలయం నుంచి పిహెచ్. డి. పొందటం ఒక విశేషం కాగా పింగళి సూరన రాసిన తెలుగు కావ్యం ‘ కళాపూర్ణోదయం’ మీద జివికె గారు ఆంగ్లంలో రాసిన పరిశోధనా పత్రానికి ఆ డాక్టరేట్ పొందటం మరొక విశేషం. ‘ ఆంధ్రప్రభ’ లో ఉపసంపాదకునిగా, ‘రాడికల్ డెమొక్రాట్’, ‘కౌముది’, ‘ విహారి’ మొదలైన పత్రికలకు సంపాదకునిగా సుదీర్ఘకాలం పనిచేసిన తరువాత ఆయన 1952 – 1962 మధ్య పదేళ్ళపాటు తెనాలి వి. యస్. ఆర్. కళాశాలలో తెలుగు లెక్చరర్ గానూ, ఆ తరువాత పొన్నూరు సంస్కృత కళాశాల ప్రిన్సిపల్ గానూ పనిచేశారు. 1963 – 1973 మధ్యకాలంలో ఆయన ఆకాశవాణిలో స్పోకెన్ వర్డ్ ప్రొడ్యూసర్ గా పనిచేశారు. 1979 ఆగస్టులో మృతిచెందిన జి వి కె. ఏకకాలంలో పండితునిగా, కవిగా, నాటకకర్తగా, అనువాదకునిగా, విశ్లేషకునిగా, విమర్శకునిగా పేరొందడం గొప్ప విశేషం. ఆయన నవలలలో ‘ కీలుబొమ్మలు’, ‘ పాపికొండలు’, నాటిక ‘భిక్షాపాత్ర’, ఆయన అనువాద గ్రంథం గ్రీకు తత్త్వవేత్త ప్లేటో రాసిన ‘రిపబ్లిక్ ‘ కి తెలుగు అనువాదం ‘ఆదర్శ రాజ్యం’ ప్రసిద్ధి పొందాయి. ఆయన తన జీవితకాలంలో ఎన్నడూ హేతు దృష్టిని వీడకుండా, తాను శాస్త్రీయంగా ఆలోచిస్తూ, చదువరులను సైతం శాస్త్రీయంగా ఆలోచింపజేసే రచనలే చేయడం మరొక విశేషం.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: