సెప్టెంబర్ 27, 2022

ఆహ్వానంః జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

Posted in సాహితీ సమాచారం వద్ద 4:24 సా. ద్వారా వసుంధర

షార్ వాణి శ్రేయోభిలాషులు (వాట్‍సాప్) సౌజన్యంతో

నవంబర్ 19 , 20 తేదీలలో జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు

సాహిత్య, సాంస్కృతిక, కళా రంగాలకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో కరోనా వ్యాప్తి అనంతరం ఒక పెద్ద శూన్యత ఏర్పడిందనే చెప్పాలి. ఏవో చిన్న చిన్న పుస్తకావిష్కరణలు తప్ప కవులు, రచయితలు, కళాకారులు మనస్ఫూర్తిగా పాల్గొనే, హృదయపూర్వకంగా ఆస్వాదించే కార్యక్రమాలేవీ జరగడం లేదు ఆంధ్రప్రదేశ్ లో. ముఖ్యంగా సాంస్కృతిక రాజధాని విజయవాడలో. ఇలాంటి గడ్డకట్టిన సందర్బాల్ని, మోడువారిన సాంస్కృతిక వాతావరణాన్ని, అగాధంలా ఏర్పడిన ఒక పెద్ద శూన్యతని ‘మల్లెతీగ’ సాహిత్య సేవాసంస్థ గుర్తించింది. అందుకే విజయవాడలో రెండురోజులపాటు కవులు, రచయితలు, కళాకారుల కోసం ఓ మెగా కార్యక్రమాన్ని రూపొందించింది. ‘
జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు’ పేరుతో నవంబరు 19, 20 తేదీలు శని, ఆదివారాల్లో ఒక గొప్ప కార్యక్రమాన్ని తలపెట్టింది. గతంలో ఇలాంటి కార్యక్రమాల నెన్నింటితో ‘మల్లెతీగ’ విజయవాడ, తిరుపతి, అవనిగడ్డలలో నిర్వహించి, విజయవంతమైంది.
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో వున్న కవులు, రచయితలు, కళాకారులు… అలాగే తెలంగాణలో నివసిస్తూ అక్కడ వెలివేయబడుతున్న కవులు, రచయితల్నీ, ఇతర రాష్ట్రాల్లో నివసించే తెలుగు కళాకారుల్ని, రచయితల్నీ ఈ వేదికపైకి తెచ్చేందుకు సిద్ధమైంది మల్లెతీగ. వారందరికీ ఈ ప్రకటన ద్వారా ఆహ్వానం పలుకుతోంది.

రండి! కరోనానంతర కాలానికి కొత్త ఉత్సాహం కలిగిద్దాం. కళలతో, సాహిత్యంతో వాతావరణాన్ని సువాసన భరితంగా మార్చేద్దాం

2022 నవంబరు 19 శనివారం ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే ఈ జాతీయ సాంస్కృతిక ఉత్సవాలు 20వ తేదీ ఆదివారం సాయంత్రం 6 గంటలకు ముగుస్తాయి.
రెండు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాల్లో సాహిత్యంలో వస్తున్న మార్పులు, నేటి సాహిత్యంలో వేళ్లూనుకుపోతున్న అవాంఛిత పరిణామాలపై చర్చలు, కొత్తతరం రచయితల కోసం లబ్దప్రతిష్టులైన రచయితలతో సాహిత్య శిక్షణా తరగతులు, ఆయా రంగాల్లో సేవ చేసిన కళాకారులకు, రచయితలకు సత్కారాలు, సన్మానాలు, కవి సమ్మేళనాలు, కొత్త పుస్తకావిష్కరణలు, కళారూపాల ప్రదర్శనలు వుంటాయి.,

ఈ ఉత్సవాలకు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి ప్రవేశ రుసుము లేదు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: