ఆగస్ట్ 16, 2022

గడువు తేదీ పెంపు- కథల పోటీః తెలుగు కథా వేదిక,టొరాంటో, కెనడా

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 4:53 సా. ద్వారా వసుంధర

శ్రీమతి పివి శేషారత్నం (వాట్‍సాప్) సౌజన్యంతో

తెలుగు కథా వేదిక,టొరాంటో, కెనడా.
నిర్వాహకులు: డా. నెల్లుట్ల నవీన చంద్ర nakshatra1364@gmail.com

కథా వేదిక ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా, కథావేదిక – టొరాంటో, లేఖిని – రచయిత్రుల వేదిక సంయుక్తంగా ఈ కథల పోటీ నిర్వహిస్తున్నది. ఈ పోటీలో దేశ, విదేశాలలోని తెలుగు రచయితలు అందరూ పాల్గొనవచ్చు. ఈ పోటీలో బహుమతి పొందిన కథలతో పాటు మాకు పోటీకి వచ్చిన పది ఉత్తమ కథలను కూడా నిర్వాహకులు అర్హమైనవిగా నిర్ణయిస్తే అన్ని కథలతో ఒక కథా సంపుటిగా ప్రచురించడం జరుగుతుంది. అంతేకాక గత సంవత్సరం నుంచి కథావేదికలో కథకులు చదివిన కథలు కూడా ఈ సంపుటిలో చేర్చడం జరుగుతుంది.

నిబంధనలు:

 1. ఈ కథల పోటీకి పంపవలసిన కథలు మత, కుల, వర్గ వాదాలకు తావు లేకుండా ఉండాలి. సామాజిక, కుటుంబ, ప్రేమ, క్రైమ్ వీటిలో ఏ అంశం అయినా ఫర్వాలేదు. శైలి, పంక్చుయేషన్ మార్క్స్, భాష ప్రధానంగా అర్హమైనవిగా స్వీకరించబడతాయి.
 2. కథ నిడివి ఏ 4 సైజులో పది పేజీలకు మించకూడదు.
 3. ప్రపంచం లోని ఏ దేశంలో ఉన్న తెలుగు రచయితలు అయినా ఈ పోటీలో పాల్గొనడానికి అర్హులు.
 4. కథలు మాకు చేరవలసిన చివరి తేదీ ఆగస్టు 31.
 5. కథలు యూనికోడ్ లో మాత్రమే ఉండాలి.
 6. కథలు ఇంతకుముందు ప్రింటు, సామాజిక, సాంకేతిక మాధ్యమాలలో కానీ, వ్యక్తిగత బ్లాకులో కానీ ప్రచురింపబడి ఉండకూడదు. కేవలం కథావేదిక కథల పోటీకి మాత్రమే వ్రాసినవి అయి ఉండాలి.
 7. కథలు పంపవలసిన అడ్రెస్సులు:
 8. A. Vijayalakshmi, Flat No. 205, A.K. Sai sadan, Vivekanagar, Chikkadapally, Hyderabad – 500- 020.
 9. Lekhinikathaavedika@gmail.com
 10. కథతో పాటు ఈ కథ తమ స్వంత రచన అని, ఇంతకుముందు ఎక్కడా ప్రచురింపబడలేదని, హామీపత్రం జత చేయాలి.

బహుమతుల వివరాలు:

ప్రథమ బహుమతి రూ.7500
ద్వితీయ బహుమతి రూ.5000
తృతీయ బహుమతి రూ.3000

Cansolation బహుమతులు పది ఒక్కొక్కటి రూ! 508/-

వివరాలకు శ్రీ నవీన్ చంద్ర, టొరాంటో, అత్తలూరి విజయలక్ష్మి, హైదరాబాద్ ని సంప్రదించగలరు
[11:32 pm, 15/08/2022] Ratnam: ఫైన తెలిపిన కథల పోటీకి కథలు పంపవలసిన చివరి తేదీ సెప్టెంబర్ 15 అర్ధరాత్రి (భారతకాలమానం ప్రకారం ) 12.00 వరకు పొడిగించబడింది..

1 వ్యాఖ్య »

 1. r.damayanthi said,

  chaalaa viluvaina samaachaaraanni amdistunnamduku meeku naa abhivamdanaalu..


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: