తెలుగు సాహితీ సుధా కథా వేదిక
Posted in నాటిక, లఘుచిత్రాల పోటీలు వద్ద 4:36 సా. ద్వారా వసుంధర
శ్రీమతి పివి శేషారత్నం (వాట్‍సాప్) సౌజన్యంతో
స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.
·
పి.రాజేంద్రప్రసాద్ said,
ఆగస్ట్ 7, 2022 వద్ద 8:25 ఉద.
నేను 1979 నుండి 1982 దాకా రచనా వ్యాసంగంలో ఉన్నప్పటికీ ఉద్యోగబాధ్యతల వలనా, ప్రవాసాంధ్రుడనై పోవడం వలనా 38 సంవత్సరాల అంతరాయం తరువాత మళ్ళీ రచనా రంగం వైపు దృష్టి సారించాను. రెండు సందర్భాలలోనూ నేను అతి చిన్న, అనుభవం పెద్దగా లేని రచయితనే అని సవినయంగా విన్నవించుకుంటున్నాను. అయితే కొన్ని విషయాలు, నాకు బాధ కలిగించినవి, మీతో పంచుకుంటాను.
మొదటి మూడు సంవత్సరాలలో రచయితల పట్ల దృష్టికీ ఇప్పటి పత్రికల నిర్వాహకులకు ఉన్న దృష్టికీ హస్తి మశకాంతరం తేడా ఉన్నది.
నాకు కలిగిన చేదు అనుభవాన్ని మీతో పంచుకుంటాను. 25.06.22 ‘సహరి’ అనే పత్రిక లో నా కథ ‘అంజలి’ అచ్చయింది. వారు నాకు నా కథ ప్రచురితమైన 5 పేజీలు, వారి పత్రికను ఇతర నా స్నేహితులకు పరిచయం చేయమని కోరుతూ 9 పేజీలు నాకు పంపించడం జరిగింది. ‘పూర్తి ప్రతిని రచయితకు పంపించరా’ అని అడిగినందుకు ‘ మీకు మామూలు పత్రికకూ ఆన్ లైన్ పత్రికకూ తేడా తెలియదా? ఆన్ లైన్ పత్రికను ఎవరికైనా ఎలా పంపిస్తారు?’ అంటూ ఎద్దేవా చేశారు. రచయితలపై వారికి ఆ స్థాయిలో గౌరవం ఉంది. పైగా ఈ పత్రికను పాఠకులు వెల చెల్లించి కొనుక్కోవాలి. అందుకు రచయితలే ప్రకటనదారులు కావాలి.
ఈ విధమైన పద్ధతిలో వెళితే తెలుగు సాహిత్యం ఏ దిశలో వెళుతోందో అర్థం కావటం లేదు.
ఇకపోతే ‘కథామంజరి’ అనే ఉచిత ఆన్ లైన్ పత్రికలో నా కథ ఒకటి బహుమతి పొందగా రెండు కథలు మామూలు ప్రచురణ పొందాయి. ఈ పత్రిక కొంతమంది ఆర్థిక సహాయంతో నడుస్తున్నప్పటికీ రచయితల పట్ల చాలా గౌరవంతో వ్యవహరిస్తోంది. ఇది చాలా సంతోషకరమైన విషయం.