ఆగస్ట్ 4, 2022

ఆహ్వానంః 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు

Posted in సాహితీ సమాచారం వద్ద 12:04 సా. ద్వారా వసుంధర

సాహిత్య సమాచారకలశం (వాట్‍సాప్) సౌజన్యంతో

మిత్రులారా,
వచ్చే నెల సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో న్యూజీలాండ్ వేదికగా జరగనున్న 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సుకు ప్రపంచవ్యాప్తంగా ఉన్నతెలుగు భాషా,సాహిత్యాభిమానులకి సాదర ఆహ్వానం.
అటు ఆక్లండ్ మహానగరం (న్యూజీలాండ్) లో సభా ప్రాంగణంలో వైభవంగానూ, ఇటు అంతర్జాలం లో ఆత్మీయంగానూ 24 గంటలకి పైగా నిర్విరామంగా జరిగే ఈ 8వ సాహితీ సదస్సులో సుమారు 50 దేశాల సాహితీవేత్తలు పాల్గొంటున్నారు. ఆయా విశేషాలు విశదీకరించే
రెండవ వీడియో ప్రకటన వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారి You Tube Chanel లో ఈ క్రింద లింక్ లో చూడండి. గత కొద్ది రోజుల క్రితం ఈ సదస్సు గురించి మేము విడుదల చేసిన మొదటి వీడియో యూట్యూబ్ లో వీక్షించి స్పందించి ప్రోత్సహించిన సుమారు 13 వేల మంది సాహిత్యాభిమానులకు వేనవేలధన్యవాదాలు.
Link of our Video Invitation -2
https://www.youtube.com/watch?v=qEd5u8U6fzc
మరో మంచి విషయం:
మా ఆహ్వానాన్ని మన్నించి అనేక దేశాల నుండి ఇప్పటి దాకా స్పందించిన వక్తలు అందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియ చేసుకుంటున్నాం. ఆహ్వానిత సినీరంగ సాహితీవేత్తలు, సాహితీ రంగంలో నిష్ణాతులు న్యూజీలాండ్ లో వ్యక్తిగతంగా పాల్గొంటున్నారు.
మీ అందరి సౌకర్యార్ధం ప్రసంగ వ్యాసాలు, తదితర వివరాలు మాకు అందవలసిన ఆఖరి తేదీ ఆగస్ట్ 15, 2022 (భారత దేశం అమృతోత్సవ దినం) కి పొడిగించబడింది.
ప్రసంగ వ్యాసం, ఇతర వివరాలు పంపించవలసిన నమోదు పత్రం లింక్ (Please copy & paste the link).
https://tinyurl.com/8va-prapanca-sadassu
ఈ సదస్సులో పాల్గొనే దేశ విదేశాల ప్రతినిధులకు, అంతర్జాలంలో వీక్షించ దల్చుకున్న సాహిత్యాభిలాషులకీ కావలసిన వివరాలతో కూడిన మూడవ సమగ్ర ప్రకటన మరి కొద్ది రోజుల్లో వెలువడుతుంది.
ఐదు ఖండాల తెలుగు సాహితీవేత్తలు పాల్గొనే ఈ 8వ ప్రపంచ సాహితీ తెలుగు సదస్సు గత 7వ ప్రపంచ సదస్సులో (2020) సాధించిన వీక్షకుల రికార్డు (సుమారు 30 వేల మంది) ని అధిగమిస్తుంది అని అందరి నమ్మకం.
భవదీయులు,
8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం
వంగూరి చిట్టెన్ రాజు (vangurifoundation@gmail.com; WhatsApp: 1 832 594 9054)శ్రీలత మగతల (న్యూజీలాండ్) (+64 210 275 0346):
శాయి రాచకొండ (హ్యూస్టన్, టెక్సాస్), , రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరు (సింగపూర్), డా. వెంకట ప్రతాప్ (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్): వంశీ రామరాజు (భారత దేశం), వెంకట్ తరిగోపుల (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు:(టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లాండో, ఫ్లోరిడా)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: