ఆగస్ట్ 4, 2022
ఆహ్వానంః వచన, పద్య కవితా సంపుటాలకు
సాహిత్య సమాచారకలశం (వాట్సాప్) సౌజన్యంతో
డా.తిరునగరి స్మారక పురస్కారం
భారత్ భాషా భూషణ్, కవితిలక,తెలంగాణ ప్రభుత్వ మహాకవి డాక్టర్ దాశరథి సాహిత్య పురస్కార గ్రహీత, డా.తిరునగరి గారి జయంతి (సెప్టెంబర్24) సందర్భంగా కవనమిత్ర సాహిత్య సేవా సంస్థ ‘పద్యం మరియు వచన కవిత్వాలకు’ సాహితీ పురస్కారాలను ఇవ్వడానికి సంకల్పించింది.
ఎంపికైన వచన కవిత్వం మరియు పద్య కవితా సంపుటాలలో రచయితలకు ఒక్కొక్కరికి 5,116 రూపాయల నగదు పురస్కారంతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేయడం జరుగుతుంది.
రచయితలు 2020,2021 సంవత్సరాలలో ప్రచురితమైన తమ కవితా సంపుటాలను 3చొప్పున,హామీ పత్రం జత చేసి 31-8-2022 వ తేదీ లోపు పంపించాలి.
*రచనలు పంపవలసిన చిరునామా:-
పెసరు లింగారెడ్డి,
అధ్యక్షులు,కవనమిత్ర సాహిత్య సేవా సంస్థ,
ఇంటి నం:10-650/1
రవీంద్ర నగర్, నాగారం ,
కీసర మండలం,మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లా, 500083.
మొబైల్:9010292500
స్పందించండి