ఆగస్ట్ 3, 2022

విభిన్న ప్రేమ కథల పోటీః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 6:35 సా. ద్వారా వసుంధర

లంకెః https://telugu.pratilipi.com/event/wiyjfvakgr

నమస్తే, 

ప్రతిలిపి ఒక ప్రత్యేక సిరీస్ రచనల పోటీని నిర్వహిస్తోంది, ఇక్కడ మీరు దిగువ థీమ్‌లలో దేనినైనా ఆధారంగా సిరీస్ వ్రాయవలసి ఉంటుంది. 

 1. వాంపైర్ లవ్ సిరీస్ 
 2. బాస్/CEOతో లవ్ సిరీస్ 
 3. కాంట్రాక్ట్  లవ్ సిరీస్ / కాంట్రాక్ట్  వివాహం 

ప్రతిలిపిలో  పాఠకులు ఎక్కువగా పైన తెలిపిన విభిన్న సిరీస్ లను చదవడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ‘ప్రతిలిపి ప్రీమియం’ విభాగంలో ఎక్కువగా రీడ్ కౌంట్ ఉన్న సిరీస్ లు కూడా అవే. అలాగే రచయితలు పై థీమ్స్ లో సిరీస్ రాసినప్పుడు చాలా త్వరగా వేలాది మంది పాఠకులను పొందే అవకాశం ఉన్నది. కాబట్టి పై థీమ్‌లలో దేనిపైనైనా ఒక అద్భుతమైన ప్లాట్‌ని ఆలోచించండి మరియు ఈరోజే రాయడం ప్రారంభించండి!

నియమాలు, పోటీ సమయం మరియు బహుమతుల గురించి మరిన్ని వివరాలు  తెలుసుకోవడానికి డ్రాఫ్ట్ ని చివరి వరకు చదవండి.

మీకు సహాయం చేయడానికి మేము కొన్ని ఆసక్తికరమైన ప్లాట్‌లను అందించాము. చూడడానికి  ఇక్కడ క్లిక్ చేయండి. మీరు వాటిలో దేనినైనా ఎంచుకోవచ్చు లేదా మీ స్వంత ప్లాట్‌ను సృష్టించడం ద్వారా స్వేచ్ఛగా వ్రాయవచ్చు.

నియమాలు

 • మీరు ఈ పోటీ కోసం కొత్త సిరీస్‌ను ప్రచురించాలి.
 • మీ సిరీస్ తప్పనిసరిగా కనీసం 10 భాగాలను కలిగి ఉండాలి. 
 • ప్రతి భాగంలో కనీసం 600 పదాలు ఉండాలి. అంతకంటే ఎక్కువగా కూడా రాయవచ్చు కానీ తక్కువ లేకుండా చూసుకోండి. 
 • మీరు మీ సిరీస్ ప్రచురించేటప్పుడు ‘విభిన్న ప్రేమకథ’ అనే వర్గం తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి.
 • ఏ రచయిత అయినా ఈ పోటీలో పాల్గొనవచ్చు (వారికి గోల్డెన్ బ్యాడ్జ్ ఉందా లేదా అనే దానితో సంబంధం లేకుండా).
 • మీ సిరీస్ ముగింపు తేదీకి ముందే పూర్తి చేయాలి. పూర్తి  కాని సిరీస్ లు పోటీకి తీసుకోబడవు.

 ముఖ్యమైన తేదీలు 

 • పోటీ ప్రారంభ తేదీ: 4 జూలై, 2022
 • పోటీ ముగింపు తేదీ: 31 ఆగస్టు , 2022
 • పోటీ ఫలితాల తేదీ: 15 అక్టోబర్, 2022

బహుమతులు 

 • మొదటి బహుమతి: 7000/- 
 • రెండవ బహుమతి: 5000/- 
 • మూడవ బహుమతి: 3000/- 
 • తదుపరి 10 మంది విజేతలకు ఒక్కొక్కరికి 1000/- నగదు బహుమతి లభిస్తుంది!!
 • టాప్ 13 విజేతలు ప్రత్యేకంగా రూపొందించిన విజేత సర్టిఫికేట్‌లను కొరియర్ ద్వారా వారి ఇంటికి పంపడం జరుగుతుంది. 
 • తదుపరి 30 మంది రచయితలకు ప్రతిలిపి నుండి ప్రత్యేక ‘డిజిటల్ సర్టిఫికేట్ ఆఫ్ పార్టిసిపేషన్’ పొందుతారు.

___________________________________________________________________

‘ప్రతిలిపిలో సిరీస్‌ను సులభంగా ఎలా ప్రచురించాలి’ అని తెలుసుకోవడానికి ఈ క్రింది వీడియో చూడగలరు.

వీడియో లింక్- వీడియో చూడడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

____________________________________________________________________

మా న్యాయనిర్ణేతల బృందం పోటీకి వచ్చిన అన్ని రచనలను పరిశీలిస్తుంది మరియు దిగువ పరమితుల ఆధారంగా ఉత్తమ సిరీస్ లను ఎంపిక చేస్తుంది. 

 • ప్రత్యేక ప్లాట్ 
 • పాత్రల నిర్మాణం 
 • వివరణ మరియు డైలాగ్ రైటింగ్
 • రచన మొత్తం నాణ్యతగా ఉండాలి 
 • వ్యాకరణం సరిగా ఉండాలి. పంచువేషణ్ మార్క్స్ సరిగా ఉపయోగించండి. 

గోల్డెన్ బ్యాడ్జ్ రచయితలకు ప్రత్యేక గమనిక-

ఈ పోటీ అందరికీ అందుబాటులో ఉన్నందున ఈ పోటీకి మీ సిరీస్‌ను సబ్‌స్క్రిప్షన్‌లో ఉంచడం తప్పనిసరి కాదు. కానీ మీరు ప్రచురించిన ప్రతి కొత్త సిరీస్ ని ఎల్లప్పుడూ సబ్‌స్క్రిప్షన్‌లో ఉంచుకోవాలని మేము మీకు సూచిస్తాము. ఇది ప్రతిలిపిలో త్వరగా విజయవంతం కావడానికి మరియు మీ సిరీస్ నుండి రాయల్టీని సంపాదించడానికి మీకు సహాయం చేస్తుంది.

అద్భుతమైన బహుమతులను గెలుచుకోండి మరియుఎక్కువ మంది అనుచరులను పొందండి. నేటి నుండే రాయడం ప్రారంభించండి! ఏదైనా సందేహం కోసం events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

అభినందనలు 

ప్రతిలిపి పోటీల విభాగం 

2 వ్యాఖ్యలు »

 1. పి.రాజేంద్రప్రసాద్ said,

                        నేను 1979 నుండి 1982 దాకా రచనా వ్యాసంగంలో ఉండి ఉద్యోగబాధ్యతల వలనా, ప్రవాసాంధ్రుడనై పోవడం వలనా 38 సంవత్సరాల అంతరాయం తరువాత మళ్ళీ రచనా రంగం వైపు దృష్టి సారించాను.  రెండు సందర్భాలలోనూ నేను అతి చిన్న , అనుభవం పెద్దగా లేని రచయితనే అని సవినయంగా విన్నవించుకుంటున్నాను. అయితే కొన్ని విషయాలు, నాకు బాధ కలిగించినవి, మీతో పంచుకుంటాను.                          మొదటి మూడు సంవత్సరాలలో రచయితల పట్ల దృష్టికీ ఇప్పటి పత్రికల నిర్వాహకులకు ఉన్న దృష్టికీ హస్తి మశకాంతరం తేడా ఉన్నది.
          నాకు కలిగిన చేదు అనుభవాల వరుసను మీతో పంచుకుంటాను. 25.06.22 ‘సహరి’ అనే పత్రిక లో నా కథ ‘అంజలి’ అచ్చయింది. వారు నాకు నా కథ ప్రచురితమైన 5 పేజీలు, వారి పత్రికను ఇతర నా స్నేహితులకు పరిచయం చేయమని  కోరుతూ 9 పేజీలు నాకు పంపించడం జరిగింది. ‘పూర్తి ప్రతిని రచయితకు పంపించరా’ అని అడిగినందుకు ‘ మీకు మామూలు పత్రికకూ ఆన్ లైన్ పత్రికకూ తేడా తెలియదా? ఆన్ లైన్ పత్రికను ఎవరికైనా ఎలా పంపిస్తారు?’ అంటూ ఎద్దేవా చేశారు. రచయితలపై వారికి ఆ స్థాయిలో గౌరవం ఉంది. పైగా ఈ పత్రికను పాఠకులు వెల చెల్లించి కొనుక్కోవాలి. అందుకు రచయితలే ప్రకటనదారులు కావాలి.
            ఇకపోతే ‘కథామంజరి’ అనే ఉచిత ఆన్ లైన్ పత్రికలో నా కథ ఒకటి బహుమతి పొందగా రెండు కథలు మామూలు ప్రచురణ పొందాయి. ఈ పత్రిక కొంతమంది ఆర్థిక సహాయంతో నడుస్తున్నా రచయితల పట్ల చాలా గౌరవంతో వ్యవహరిస్తోంది. ఇది చాలా సంతోషకరమైన విషయం.
               అదే సమయంలో ‘ప్రతిలిపి’ అనే వెబ్ సైట్ ఒకటి ఉన్నది. అందులో ఏ విధమైన ప్రమాణాలు పాటిస్తారో తెలియదు. నా రచన ఒకటి మంచి ప్రజాదరణ పొందుతున్న సమయంలో వెబ్ సైటు నుండి పూర్తిగా తొలగించి వేరొక రచనకు ప్రజాదరణ ఆధారంగా బహుమతి ఇచ్చారు. తొలగింపుకు ముందు నా రచనకు వచ్చిన స్పందన కూడా ఈ రచనకు వచ్చిన దానికంటే ఎక్కువే. తొలగింపుకు కారణం ఎట్టి పరిస్థితులలోనూ జవాబు రాలేదు. ఇక మరొక పోటీ లో న్యాయ నిర్ణేతలు నిర్ణయించిన మొదటి మూడు బహుమతి పొందిన రచనలూ పూర్తి (అంటే ప్రతీ లైను లోనూ కూడా) అక్షరదోషాలు ఉన్నవి. ఇదేమిటని అడిగితే ‘అక్షర దోషాలు మేము పట్టించుకోము.’ అని సమాధానం వచ్చింది. ఈ విధమైన పద్ధతిలో వెళితే తెలుగు సాహిత్యం ఏ దిశలో వెళుతోందో అర్థం కావటం లేదు.

  • మీరు వ్రాసినవి మాతో సహా ఎందరో రచయిత(త్రు)లకు స్వానుభవం. కథామంజరి కథను సేవించుకోవాలన్న తాపత్రయంతో నడపబడుతున్న పత్రిక. ఆమేరకు వారి సంస్కారం అభినందనీయం. సహరి స్వాతి తరహాలో నడుపబడుతున్న వ్యాపారపత్రిక. ఒక పద్ధతిలో క్రమశిక్షణతో నడపబడుతున్న ఆ పత్రిక మనుగడకోసం రచయితలనుంచి చందా, ప్రచారం కోరడం గర్హించతగినది కాదు. రచయితలకు ఆథర్ కాపీ పిడిఎఫ్ గా పంపడం అభినందనీయం. మేమా పత్రికకు చందాదారులం. ఐతే ‘మామూలు పత్రికకూ ఆన్ లైన్ పత్రికకూ తేడా తెలియదా?’ అని రచయితలను ఎద్దేవా చెయ్యడం సమర్థనీయం కాదు. ఇక ప్రతిలిపి విషయానికొస్తే- ఇటీవల గుర్తింపు కోసం ప్రాకులాడే రచయితల సంఖ్య బాగా పెరిగిపోయింది. అటువంటివారికోసమే అది వేదిక. మన కథలు కొన్ని ఎక్కువమందికి చేరాలని అనుకున్నప్పుడు అందులో కొన్ని కథలు ఉంచవచ్చు. ఆ పని చెయ్యడం మినహాగా మేమా వేదికను ఎక్కువగా పట్టించుకోవడం లేదు. దశాబ్దాలుగా నడుస్తున్న కౌముది కాక ఇటీవలి వెబ్ పత్రికల్లో – షార్ వాణి, తెలుగు సొగసు, మనతెలుగుకథలు.కామ్ వగైరాలు కొంత పద్ధతిగా ఉంటున్నాయి. గుర్తింపుకి అతీతంగా ఆలోచిస్తూ- తమ కథలకి సరైన వేదికలను అన్వేషించే వారికి మేమిస్తున్న ఈ సమాచారం ఉపయోగపడుతుంది. అక్షరజాలం వెబ్సైటులో కూడా ఈ తరహా సమాచారం లభిస్తుంది. ప్రయోజనాత్మకమైన మీ స్పందనకు అభినందనలు, ధన్యవాదాలు.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: