ఆగస్ట్ 3, 2022

జననీ-జన్మభూమి కథల పోటీః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 6:38 సా. ద్వారా వసుంధర

లంకెః https://telugu.pratilipi.com/event/ub9a2o87s8

ప్రతిలిపి మూడ్ అఫ్ ది మంత్  పోటీలో భాగంగా జననీ-జన్మభూమి అనే శీర్షికతో మీ ముందుకు వచ్చాము. భారతదేశ 75 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా మన దేశానికి స్వాతంత్ర్యం రావడానికి కృషి చేసిన మహానుభావులను, త్యాగమూర్తులను స్మరించుకుంటూ దేశభక్తి కథలను రాసి మీ ప్రొఫైల్ లో స్వీయప్రచురణ చేయగలరు. భావి భారత తరానికి మీ కథలు మార్గదర్శకంగా నిలుస్తాయని మేము నమ్ముతున్నాము. మీ కథలో స్వతంత్రం, స్వేచ్చ అనే అంశాలు ఉండేలాగా చూసుకోండి.

గమనిక: ఈ పోటీలో ఒక రచయిత ఎన్ని కథలైనా రాయవచ్చు. కనీసం 400 పదాలు ఉంటే చాలు, అంతకు మించి ఎన్ని పదాలైనా ఉండవచ్చు.

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

మీ కథలను మా న్యాయనిర్ణేతలు చదివి కథలో శిల్పం, ఎత్తుగడ, నాణ్యత తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని విజేతలను ప్రకటించడం జరుగుతుంది.

బహుమతులు :

  • మొదటి పది మంది విజేతలకు ప్రతిలిపి ప్రశంసా పత్రం  వారి ఇంటికే పంపడం జరుగుతుంది. 
  • విజేతల ప్రొఫైల్స్ ప్రతిలిపి సంబంధిత సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడం జరుగుతుంది. తద్వారా వారి రచనలు ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది.

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు. 

మీ ప్రొఫైల్ లో ఉన్న రాయండి బటన్ మీద క్లిక్ చేయండి. కొత్త రచనను జోడించండి. మీ రచనను కొనసాగించి, రచనకు తగ్గ శీర్షికను ఇచ్చి ప్రచురించండి మీద క్లిక్ చేయండి. ఫోటో గ్యాలరీలో మీ రచనకు తగ్గ ఫోటోని జోడించి, విభాగం  అనే చోట “కథ” సెలెక్ట్ చేసి, వర్గం “జననీ-జన్మభూమి” అని సెలెక్ట్ చేసి, నేను అంగీకరిస్తున్నాను అనే బటన్ పైన క్లిక్ చేసి చివరగా ప్రచురించండి. జననీ-జన్మభూమి అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సంగ్రహం తప్పనిసరిగా రాయాలి. 

మరిన్ని వివరాల కొరకు ఈ వీడియో చూడగలరువీడియో లింక్

ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది: 1.ఆగష్టు.2022

2. మీకథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది: 31.ఆగష్టు.2022

3. ఫలితాలు ప్రకటించే తేది: 9.సెప్టెంబర్.2022

తరచుగా అడిగే ప్రశ్నలు:

1.నేను ఎప్పుడూ పోటిలో పాల్గొనలేదు. నేను ఇప్పుడు పాల్గొనవచ్చా?

తప్పకుండా పాల్గొనవచ్చు. 

2.పోటీలో ఎన్ని కథలైనా రాయవచ్చా?

అవును. ఈ పోటీలో ఒక రచయిత ఎన్ని కథలైనా రాయవచ్చు. ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలి.

3.పోటిలో ఎలాంటి కథలు రాయాలి?

మీ చుట్టూ జరిగిన, మీరు చూసిన, ఎదుర్కొన్న లేదా ఉహించుకున్న సందర్భాలను కథలుగా రాయవచ్చు. మీ కథలో స్వతంత్రం, స్వేచ్చ అనే అంశాలు ఉండేలాగా చూసుకోండి.

నియమాలు:

  • ప్రతి రచయిత ఎన్ని కథలైనా ప్రచురించవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.
  • వేరొకరి ప్రొఫైల్ నుండి సేకరించినవి, ఇదివరకే ప్రతిలిపిలో ప్రచురించిన రచనలు పోటీకి తీసుకోబడవు.
  • సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.

సలహాలు-సూచనలు:

ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ రచయితలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కావున ఈ పోటిలో పాల్గొని అధిక సంఖ్యలో కథలను ప్రచురించి, ఎక్కువ మంది అనుచరులను పొందండి. తద్వారా మీరు త్వరగా గోల్డెన్ బ్యాడ్జ్ పొందగలుగుతారు.

సందేహాలకు events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: