జూలై 5, 2022

కథా ఊట- జాతీయ కథల పోటీః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 8:57 సా. ద్వారా వసుంధర

కథా ఊట

పెద్దలు చెప్పినట్టు ఒక రచన రచయిత కలం నుండి జాలువారాలి అంటే రచయిత ప్రసవ వేదన చెందాలి. బిడ్డకు జన్మ ఇవ్వడానికి తల్లి పడిన శ్రమతో రచయితను పోల్చడం అంటే రచయితకు సమాజంలో ఉన్న విలువ ఏంటో అర్థం చేసుకోవచ్చు.  ఎన్నో ప్రయత్నాలు చేసిన తర్వాత క్షీరసాగర మదనం నుండి అమృతం వచ్చింది. అలాగే రచయిత తన మనసును, మెదడు తీవ్రంగా మదిస్తేనే కథలు ఊటలా ఊరుతాయి.   మీ మనసును, మేధస్సును మదించి కథా ఊట పోటీకి మీ కథలను స్వీయ ప్రచురణ చేయండి. మీలో అనేక ఆలోచనలు ఉన్నాయని మా నమ్మకం, వాటిని సరైన క్రమంలో పిట్ట గూడు అల్లినట్టు కథలను నిర్మించండి. 

గమనిక: ఈ పోటీలో ఒక రచయిత ఎన్ని కథలైనా రాయవచ్చు. కనీసం 400 పదాలు ఉంటే చాలు, అంతకు మించి ఎన్ని పదాలైనా ఉండవచ్చు.

న్యాయనిర్ణేత అందించే ఫలితాలు ఆధారంగా:-

మీ కథలను మా న్యాయనిర్ణేతలు చదివి మీరు ఎలాంటి  కథాంశం తీసుకున్నారు, కథలో శిల్పం, తదితర అంశాలు పరిగణలోకి తీసుకొని విజేతలను ప్రకటించడం జరుగుతుంది.

బహుమతులు :

  • మొదటి ఐదు మంది విజేతలకు ప్రతిలిపి ప్రశంసా పత్రం  వారి ఇంటికే పంపడం జరుగుతుంది. తరువాతి ఐదు మంది(6-10) విజేతలకు ప్రతిలిపి ప్రశంసాపత్రం మెయిల్ చేయడం జరుగుతుంది.
  • విజేతల ప్రొఫైల్స్ ప్రతిలిపి సంబంధిత సామాజిక మాధ్యమాలలో షేర్ చేయడం జరుగుతుంది. తద్వారా వారి రచనలు ఎక్కువ మందికి చేరే అవకాశం ఉంది.

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు. 

మీ ప్రొఫైల్ లో ఉన్న రాయండి బటన్ మీద క్లిక్ చేయండి. కొత్త రచనను జోడించండి. మీ రచనను కొనసాగించి, రచనకు తగ్గ శీర్షికను ఇచ్చి ప్రచురించండి మీద క్లిక్ చేయండి. ఫోటో గ్యాలరీలో మీ రచనకు తగ్గ ఫోటోని జోడించి, విభాగం  అనే చోట “కథ” సెలెక్ట్ చేసి, వర్గం “కథా ఊట” అని సెలెక్ట్ చేసి, నేను అంగీకరిస్తున్నాను అనే బటన్ పైన క్లిక్ చేసి చివరగా ప్రచురించండి. కథా ఊట అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సంగ్రహం తప్పనిసరిగా రాయాలి. 

ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది: 1.జూలై.2022

2. మీకథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది: 31.జూలై.2022

3. ఫలితాలు ప్రకటించే తేది: 8.ఆగష్టు.2022

తరచుగా అడిగే ప్రశ్నలు:

1.నేను ఎప్పుడూ పోటిలో పాల్గొనలేదు. నేను ఇప్పుడు పాల్గొనవచ్చా?

తప్పకుండా పాల్గొనవచ్చు. 

2.పోటీలో ఎన్ని కథలైనా రాయవచ్చా?

అవును. ఈ పోటీలో ఒక రచయిత ఎన్ని కథలైనా రాయవచ్చు. ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలి.

3.పోటిలో ఎలాంటి కథలు రాయాలి?

మీ చుట్టూ జరిగిన, మీరు చూసిన, ఎదుర్కొన్న లేదా ఉహించుకున్న సందర్భాలను కథలుగా రాయవచ్చు. మీరు ప్రకృతికి సంబంధించిన కథలైనా, మనుషులకు సంబంధించిన కథలైనా, ఎలాంటి ప్రేమ కథలైనా రాసి పోటీలో పాల్గొనవచ్చు.

నియమాలు:

  • ప్రతి రచయిత ఎన్ని కథలైనా ప్రచురించవచ్చు. కథలు పూర్తిగా మీ సొంతమై ఉండాలి.
  • వేరొకరి ప్రొఫైల్ నుండి సేకరించినవి, ఇదివరకే ప్రతిలిపిలో ప్రచురించిన రచనలు పోటీకి తీసుకోబడవు.
  • సాధ్యమైనంత వరకు అక్షర దోషాలు లేకుండా చూసుకోండి.

సలహాలు-సూచనలు:

ప్రతిలిపిలో గోల్డెన్ బ్యాడ్జ్ రచయితలకు ఎన్నో అవకాశాలు ఉన్నాయి. కావున ఈ పోటిలో పాల్గొని అధిక సంఖ్యలో కథలను ప్రచురించి, ఎక్కువ మంది అనుచరులను పొందండి. తద్వారా మీరు త్వరగా గోల్డెన్ బ్యాడ్జ్ పొందగలుగుతారు.

సందేహాలకు events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: