జూన్ 17, 2022

సూక్ష్మ కావ్యాల పోటీః విశ్వసాహితీ ట్రస్ట్

Posted in కవితల పోటీలు, కవితాజాలం, సాహితీ సమాచారం వద్ద 5:55 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం రంజని మిత్రులు సౌజన్యంతో

‘‘విశ్వ సాహితీ ట్రస్ట్’’ ఆధ్వర్యంలో
ఉత్తమ సరళ శతకం, ఉత్తమ సూక్ష్మ కావ్యాలకు బహుమతులు

తెలుగు సాహిత్యరంగంలో అనేక నూతన ప్రక్రియలు చోటుచేసుకుంటూ తెలుగు భాషను నిత్యనూతనంగా మార్చుతున్నాయి. సంక్లిష్టంగా ఉండే శతకాల కంటే సరళంగా ఉంటే శతకాలపై పాఠకుల్లో మక్కువ ఎక్కువ. చందస్సు సహిత కావ్యగ్రంధాల కంటే సూక్ష్మంలో మోక్షం మాదిరిగా 12పంక్తుల్లో కావ్యాన్ని చదివిన అనుభూతిని ఇచ్చే సూక్ష్మకావ్య ప్రక్రియకు ఆదరణ పెరిగింది. ఈ రెండు నూతన ప్రక్రియలను తెలంగాణ సీనియర్ ఐఎఎస్ అధికారి బుర్రా వెంకటేశం గారు తెలుగు సాహిత్యరంగానికి పరిచయం చేశారు. ‘‘అమ్మ నాన్న’’ పై ఆయన రచించిన సూక్ష్మ కావ్యం విశేషంగా ఆకట్టుకుంది. సరళ శతకం ప్రక్రియలో రచించిన రెండు శతకాలు బుద్ధ శతకం, జీవనధన్య శతకం తప్పక చదవాల్సిన శతకాలుగా పాఠకుల మన్నన పొందాయి. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని అనేక మంది రచయితలు సరళ శతకం, సూక్ష్మకావ్యం ప్రక్రియల్లో రచనలు చేశారు. ఈ రెండు ప్రక్రియల్లో రచనలు చేసిన రచయితలకు మాతృమూర్తి బుర్రా గౌరమ్మ గారి తొలి వర్ధంతి సందర్భంగా బహుమతి ప్రదానం చేయనున్నారు. సూక్ష్మ కావ్యం రచయితలకు తండ్రి గారు కీ.శే. బుర్రా నారాయణ గారి పేరు మీదుగా, సరళ శతకం రచయితలకు అమ్మ గారు బుర్రా గౌరమ్మ పేరు పై బహుమతులు అందిస్తారు.
మే 2021 నుంచి మే 2022 వరకు ప్రచురించ బడిన సూక్ష్య కావ్యాలలో, సరళ శతకాలలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసి ప్రథమ, ద్వితీయ బహుమతులు, ఒక ప్రోత్సాహక బహుమతి అందిస్తారు. తెలుగు భాషను అనేక సరళమైన ప్రక్రియల ద్వారా ముందు తరాల వారికి అందించేందుకు కృషి చేస్తున్న ‘‘విశ్వ సాహితీ ట్రస్ట్’’ ఆధ్వర్యంలో జూన్ 27న హైదరాబాద్ లో నిర్వహించే కార్యక్రమంలో బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది. ఆసక్తి గల రచయితలు తమ సరళ శతకాలను, సూక్ష్మ కావ్యాలను ఈనెల చివరిలోగా పంపించాలి. మరిన్ని వివరాల కోసం 9154102734 నెంబర్ లో సంప్రదించవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: