జూన్ 9, 2022

నిక్ అంటే ప్రేరణః పుస్తక పరిచయం

Posted in పుస్తకాలు, సాహితీ సమాచారం వద్ద 6:22 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం బాలసాహితీశిల్పులు సౌజన్యంతో

నిన్ననే ఈ పుస్తకాన్ని పోస్ట్ లో అందుకున్నాను.ఈ పుస్తకాన్ని రాసినవారు శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారు.ఈ పుస్తకం పుట్టుకతో నే కాళ్ళు, చేతులు లేని వ్యక్తి యొక్క ఎదుగుదల ని,క్రమాన్ని పట్టుదలతో అతను సాధించిన విజయాన్ని కూలంకషంగా మనకు వివరిస్తుంది.ఆ వ్యక్తి పేరు “నికోలస్ జేమ్స్ వుయచిచ్…” ప్రతీ పేజీ చదువుతుంటే ఆశ్చర్యం వేస్తోంది.నికోలస్ యొక్క శైశవ దశనుండీ అతని ఎదుగుదల, ఎదుర్కొన్న సమస్యలు,అంశాల వారిగా సంకల్ప బలంతో అతను అధిగమించిన తీరు చూస్తుంటే,చదువుతుంటే శారీరక వైకల్యం ఉన్నా,సంకల్ప బలం,సాధించాలనే పట్టుదల అందుకు తగ్గ కృషి ,ప్రేరణ ఉంటే శిఖర స్థాయి కి(అత్యున్నత స్థాయి) చేరుకోవచ్చుననే విషయాన్ని నిరూపించింది.ఈ పుస్తకం ఎంతో మందికి ప్రేరణ లా ఉంటుందనడంలో అతిశయం లేదు.చిన్న సమస్యలకే భయపడి పోయి, భూతద్దం లో పెద్దదిగా చేసుకుంటూ..అభివృద్ధి కి ఆటంకం ఏర్పడిందని కుచించుకు పోయి తనకు తానే మానసికంగా,శారీరకంగా పతనావస్థకు చేరుకున్నానని దీనంగా గడిపే వారికి ఈ పుస్తకం ఒక స్ఫూర్తి కెరటం లా ఉపయోగ పడుతుంది.మొదటి పదిహేను పేజీలు చదివాక ..అభిప్రాయం చెప్పకుండా,రాయకుండా ఉండలేక పోయాను. ప్రత్యేకించి ఈ పుస్తక రచనలో రచయిత్రి శ్రీమతి సమ్మెట ఉమాదేవి తీసుకున్న శ్రద్ధ, కృషి ఆమె మాటల్లో విని ఆశ్చర్య పోయాను.మనకు తెలిసిన బంధువుల, స్నేహితుల గురించి రాయడానికి వారి వద్దకు వెళ్లి విషయాన్ని సేకరిస్తాం. రాస్తాం.మన ప్రాంతం పరిధిలో ఉంటే ఆ ప్రాంతానికి వెడతాం. కానీ ఇక్కడ నికోలస్ దేశం కానీ దేశం మనకు చాలా దూరంలో ఉన్నాడు.కేవలం సాంకేతికత ద్వారా అతని చరిత్రను బాగా తెలుసుకుని ఫోటోలు సేకరించి అదే నెట్ ద్వారా వారి కుటుంబానికి విషయం తెలియ పరచి ఈ పుస్తకాన్ని రాశారు. కధ రాయడానికి ఓపిక ఉంటే చాలు.కానీ ఇలా రాయడానికి సహనం కావాలి.ఇష్టంగా కష్టపడాలి.ఇంత శ్రమకోర్చి చక్కగా రాసిన శ్రీమతి సమ్మెట ఉమాదేవి గారికి హృదయ పూర్వక అభినందనలు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: