జూన్ 3, 2022

తెలుగు సాహితీ సదస్సుః కథలకూ ఆహ్వానం

Posted in కథాజాలం, సాహితీ సమాచారం వద్ద 6:18 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

మిత్రులారా,

రాబోయే సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో న్యూజిలాండ్ దేశం లో ఆక్లాండ్ మహా నగరం కేంద్రంగా 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వహించబడుతోంది అని తెలియజేయడానికి సంతోషంగా ఉంది. న్యూజీలాండ్ తెలుగు సంఘం వారి రజతోత్సవాల సందర్భంగా అంతర్జాలంలో 24 గంటలు నిర్విరామంగా జరిగే ఈ సదస్సు వీక్షించి, ఆనందించమని కోరుతూ ముందస్తుగానే మీకు ఆహ్వానం పలుకుతున్నాం.

ఐదు ఖండాల లోని యాభై పైగా దేశాల సాహితీవేత్తలు పాల్గొనే ఈ సాహితీ సదస్సు ప్రాథమిక వివరాలు ఇందుతో జతపరిచాం. ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సులో ప్రసంగించారు దలచుకున్న వారు మమ్మల్ని సంప్రదించండి.

“వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా” (హ్యూస్టన్ & హైదరాబాద్), న్యూజీలండ్ తెలుగు సంఘం (ఆక్లండ్), ‘తెలుగు మల్లి’ పత్రిక (ఆస్ట్రేలియా), “శ్రీ సాంస్కృతిక కళా సారధి” (సింగపూర్), మలేషియా తెలుగు సంఘం (కౌలా లంపూర్), వంశీ ఇంటర్ నేషనల్ (హైదరాబాద్, భారత దేశం), ‘వీధి అరుగు” (ఆస్లో, నార్వే), దక్షిణ ఆఫ్రికా తెలుగు సాహిత్య వేదిక (జొహానెస్ బర్గ్), ‘తెలుగు తల్లి’ పత్రిక (టొరంటో, కెనడా), తదితరులు ఈ ప్రతిష్టాత్మక 8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు నిర్వాహకులు.
ఈ సందర్భంగా వెలువడే “డయాస్పోరా తెలుగు కథానిక -16వ సంకలనం” లో ప్రచురణకి కథలు ఆహ్వానిస్తున్నాం. ఆ వివరాలు కూడా ఇక్కడ జతపరిచాం.

సెప్టెంబర్ 17-18, 2022 తేదీలలో 24 గంటలు నిర్విరామంగా జరిగే ఈ సదస్సు చూసి ఆనందించడానికి మీ సమయం కేటాయించమనీ, సదస్సులో ప్రసంగించే ఆసక్తి ఉన్న వారు మమ్మల్ని సంప్రదించమనీ కోరుకుంటూ…..

భవదీయులు,

8వ ప్రపంచ తెలుగు సాహితీ సదస్సు కార్యనిర్వాహక వర్గం

వంగూరి చిట్టెన్ రాజు, శాయి రాచకొండ (Houston, TX), శ్రీలత మగతల (న్యూజీలాండ్), రావు కొంచాడ (ఆస్ట్రేలియా), రత్నకుమార్ కవుటూరి (సింగపూర్), డా. వెంకట ప్రతాప్: (మలేషియా), రాపోలు సీతారామరాజు (జోహానెస్ బర్గ్), రాధిక మంగిపూడి (భారత దేశం, సింగపూర్): వంశీ రామరాజు (భారత దేశం), వెంకట్ తరిగోపుల- (ఆస్లో, నార్వే), లక్ష్మి రాయవరపు : (టొరంటో, కెనడా), రాధాకృష్ణ గణేశ్న (సింగపూర్) మధు చెరుకూరి (ఆర్లండో, ఫ్లారిడా)

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: