మే 17, 2022

ఆహ్వానంః ఖమ్మం ఈస్థటిక్స్ -2022 పురస్కారాలు

Posted in కథల పోటీలు, కథాజాలం, కవితాజాలం, సాహితీ సమాచారం వద్ద 12:36 సా. ద్వారా వసుంధర

వాట్‍సాప్ బృందం సాహిత్య సమాచారకలశం సౌజన్యంతో

ఖమ్మం ఈస్థటిక్స్ -2022 పురస్కారాలకు ఆహ్వానం !
అత్యుత్తమ సాహిత్య పురస్కారాలకు ఖమ్మం వేదిక కానుంది. ఖమ్మం ఈస్తటిక్స్ పేరిట ప్రతి యేటా ఒక ఉత్తమ కవితా సంకలనానికి, మూడు ఉత్తమ కథలకు పురస్కారాలు ఇవ్వనున్నారు . మూడు ఉత్తమ కధలకు ప్రధమ, ద్వితీయ, తృతీయ పురస్కారాలు ఇవ్వడమే కాక మరో తొమ్మిది కధలను కూడా ఎంపిక చేసి పన్నెండు కధలను ఒక పుస్తకంగా అచ్చెయ్యడం జరుగుతుంది. మూడు ఉత్తమ కధలకు మొదటి బహుమతిగా 25వేలు, రెండవ బహుమతిగా 15 వేల రూపాయలు, మూడవ బహుమతిగా 10 వేల రూపాయలు అందచేస్తారు. ఉత్తమ కవితా సంకలనానికి 40 వేల రూపాయల నగదు బహుమతి ఉంటుంది. విజేతలకు నగదు బహుమతితో పాటు ప్రశంసా పత్రం ఇచ్చి ప్రత్యేక సత్కారం ఉంటుంది.

కవితా సంకలనాలు 2021 ఏప్రిల్, 2022 మార్చ్ నడుమ ప్రచురితమై ఉండాలి. కనీసం 25 కవితలకు తగ్గకుండా సంకలనం ఉండాలి. పురస్కారం కోసం కవితా సంకలనం నాలుగు ప్రతులను పంపాల్సి ఉంటుంది.

పోటీకి పంపే కధలు కేవలం ఈ పురస్కారం కోసం మాత్రమే రాసినవై ఉండాలి. ఏ ఇతర పోటీకీ పంపలేదని హామీ పత్రం జతచేయ్యాలి. కథ ప్రింట్ నాలుగు ప్రతులను, యూనికోడ్ సాఫ్ట్ కాపీని పంపాలి. ఖమ్మంలో ప్రతి యేటా నవంబర్ నెల లో జరిగే వేడుకలో అవార్డుల ప్రదానం ఉంటుంది

ఈ అవార్డుల కోసం కధలు ,కవితా సంకలనాలు పంపగోరేవారు ఆగస్ట్ 31/2022 లోపు క్రింది చిరునామాకు పంపాలి.

కవితా సంకలనాలు,కథ లు పంపాల్సిన చిరునామా.

ఖమ్మం ఈస్తెటిక్స్ సాహిత్య పురస్కారాలు
11-2-51
బాలాజీ నగర్
ఖమ్మం
507001
mobile-9849114369.

ఈ అవార్డుల కమిటీకి ఓల్గా, ఎల్లెస్సార్ ప్రసాద్ గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తారు.

ఖమ్మం ఈస్థటిక్స్ సభ్యులుగా ప్రసేన్, సీతారాం,మువ్వశ్రీనివాసరావ్,రవిమారుత్,
ఫణి మాధవి, వంశీ కృష్ణ, పగిడిపల్లి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారు.

ఈ అవార్డుల కమిటీకి ఓల్గా, ఎల్లెస్సార్ ప్రసాద్ గౌరవ సలహాదారులుగా వ్యవహరిస్తారు.

ఖమ్మం ఈస్థటిక్స్ సభ్యులుగా ప్రసేన్, సీతారాం,మువ్వశ్రీనివాసరావ్,రవిమారుత్,
ఫణి మాధవి, వంశీ కృష్ణ, పగిడిపల్లి వెంకటేశ్వర్లు వ్యవహరిస్తారు.

2 వ్యాఖ్యలు »

 1. K Lakshmi sailaja said,

  కథలు పంపే address ఇవ్వండి

  • టపాలో చిరునామాను పొందుపర్చడం జరిగింది. మీ సౌకర్యం కోసం ఇక్కడ కూడా ఇస్తున్నాంః
   కవితా సంకలనాలు,కథ లు పంపాల్సిన చిరునామా.
   ఖమ్మం ఈస్తెటిక్స్ సాహిత్య పురస్కారాలు
   11-2-51
   బాలాజీ నగర్
   ఖమ్మం
   507001
   mobile-9849114369.


స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: