మే 6, 2022

సూర్యుడి పెదాలపైః ప్రతిలిపి కథల పోటీ

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 5:47 సా. ద్వారా వసుంధర

నమస్తే..

ప్రతిలిపి కథల పోటికి స్వాగతం. ఈ నెల కథల పోటిలో భాగంగా “సూర్యుడి పెదాలపై” అనే శీర్షికతో ప్రతిలిపి మీ ముందుకు వచ్చింది. సూర్యుడు అగ్గిని కక్కుతున్నట్లున్నాడు. తన వేడిని చల్లార్చుకునేందుకు వర్షం కోసం ఎదురుచూస్తున్నాడు. అలాగే మీలోని రచయితను మేల్కొలిపి, మీ భావాలను కథలుగా రాసి, మీ ప్రొఫైల్ లో కనీసం 5 రచనలు ప్రచురించి,గోల్డెన్ బ్యాడ్జ్  పొందడం కోసం ఎదురుచూడండి.  

గమనిక: తప్పకుండా కనీసం 5 కథలు విడివిడిగా ప్రచురించాలి. అంతకు మించి ఎన్ని కథలైనా ప్రచురించవచ్చు. ఒక్కో కథ కనీసం 600 పదాలు ఉండేలా చూసుకోవాలి.

బహుమతులు:

మొదటి బహుమతి:5000

రెండవ బహుమతి:3000

మూడవ బహుమతి:2000

మీ రచనను స్వీయప్రచురణ చేయడానికి ఈ క్రింది విధానాన్ని అనుసరించగలరు. 

మీ ప్రొఫైల్ లో ఉన్న రాయండి బటన్ మీద క్లిక్ చేయండి. కొత్త రచనను జోడించండి. మీ రచనను కొనసాగించి,రచనకు తగ్గ శీర్షికను ఇచ్చి ప్రచురించండి. ఫోటో గ్యాలరీలో మీ రచనకు తగ్గ ఫోటోని జోడించి, విభాగం  అనే చోట “కథ” సెలెక్ట్ చేసి, వర్గం “సూర్యుడి పెదాలపై” అని సెలెక్ట్ చేసి, నేను అంగీకరిస్తున్నాను అనే బటన్ పైన క్లిక్ చేసి చివరగా ప్రచురించండి. సూర్యుడి పెదాలపై అనే వర్గంతో పాటు మరో రెండు వర్గాలను తప్పనిసరిగా సెలెక్ట్ చేసుకోవాలి. అలాగే సంగ్రహం తప్పనిసరిగా రాయాలి. 

మరింత వివరంగా తెలుసుకోవడానికి ఈ క్రింది లింక్ పైన క్లిక్ చేయగలరు. https://youtube.com/shorts/CFE8MGOCCkA?feature=share

ముఖ్యమైన తేదీలు:

1. మీ కథలు స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది: 2.మే.2022

2. మీకథలు స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది: 31.మే.2022

3. ఫలితాలు ప్రకటించే తేది: 6.జూన్.2022

తరచుగా అడిగే ప్రశ్నలు:

1.నేను ఎప్పుడూ పోటిలో పాల్గొనలేదు. నేను ఇప్పుడు పాల్గొనవచ్చా?

తప్పకుండా పాల్గొనవచ్చు. కొత్త రచయితలు కూడా పాల్గొని గోల్డెన్ బ్యాడ్జ్ పొందే అవకాశాన్ని పొందండి.

2.పోటీలో ఎన్ని కథలైనా రాయవచ్చా?

అవును. ఈ పోటీలో ఒక రచయిత ఎన్ని కథలైనా రాయవచ్చు. కాకపోతే ఇచ్చిన గడువు లోపు పూర్తి చేయాలి.

3.పోటిలో ఎలాంటి కథలు రాయాలి?

మీ చుట్టూ జరిగిన, మీరు చూసిన, ఎదుర్కొన్న లేదా ఉహించుకున్న సందర్భాలను కథలుగా రాయవచ్చు. మీరు ప్రకృతికి సంబంధించిన కథలైనా, మనుషులకు సంబంధించిన కథలైనా, ఎలాంటి ప్రేమ కథలైనా రాసి పోటీలో పాల్గొనవచ్చు.

4.మాకు గోల్డెన్ బ్యాడ్జ్ ఉంది. మేము పోటిలో పాల్గొనవచ్చా?

తప్పకుండా పాల్గొనవచ్చు.

సలహాలు-సూచనలు:

1.మీరు కథ రాయవలసి ఉంటుంది. ఈ పోటికి కనీసం 5 కథలను రాసినవారే అర్హత పొందుతారు. 

2.ఈ పోటిలో పాల్గొన్న రచయితలు తక్కువ సమయంలో గోల్డెన్ బ్యాడ్జ్ పొందే అవకాశం ఉంటుంది. కావున ఎక్కువ సంఖ్యలో రచయితలు పాల్గొనాలని ఆశిస్తున్నాము.

సందేహాలకు events@pratilipi.com కి మెయిల్ చేయగలరు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: