ఏప్రిల్ 5, 2022

కథలు, కవితల పోటీః తెల్సా

Posted in కథల పోటీలు, కవితల పోటీలు, కవితాజాలం, సాహితీ సమాచారం వద్ద 8:46 సా. ద్వారా వసుంధర

తెల్సా కథలు, కవితల పోటీకి ముగింపు తేదీ మే 31 అని సవరిస్తూ, పోటీ ప్రకటనకు లంకె ఇచ్చిన శ్రీ సురేష్ పిళ్లై గారికి ధన్యవాదాలు. లంకె కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి.

తెల్సా కథలు, కవితల పోటీ – 2022

బహుమతులు – కథలు : ₹50,000, ₹30,000, ₹20,000
బహుమతులు – కవితలు: ₹20,000 చొప్పున 2

ఈమెయిల్ ద్వారా రచనలు చేరవలసిన తేదీ: మే 31, 2022
పంపవలసిన చిరునామా: telsa.competitions@gmail.com

2019 లో బహుమతి పొందిన కథలు, నాటికలు తెల్సా ప్రత్యేక సంచిక “సంగతి”లో చదవండి.

నిబంధనలు:

  • కథలు, కవితలు ఇంతకు ముందు ఏ అచ్చు పత్రికలోనూ, ఎలక్ట్రానిక్ పత్రికలోనూ, బ్లాగులోనూ, ఫేస్ బుక్, వాట్సాప్ లాంటి సాంఘిక మాధ్యమాల్లోనూ ప్రచురించినవి కారాదు.
  • పోటీ కథలు, కవితలు నాటికరూపంగా రంగస్థలాన గాని ఇతరమాధ్యమాలలో గాని ప్రదర్శించబడి వుండరాదు.
  • పోటీకి పంపే రచనలు మరే పత్రిక, బ్లాగు, ఇతర ప్రచురణ, పోటీలలో పరిశీలనలో ఉండకూడదు.
  • స్వంత కథలు, కవితలు మాత్రమే పరిశీలించబడతాయి. అనువాదాలు, అనుసరణలు, అనుసృజనలు అనర్హం. ఈ విధమైన హామీ జతపరచాలి.
  • ఇతివృత్తం వర్తమాన, సమీపగత, తెలుగు జీవనగతిని, మానవస్థితిని (human condition), తెలుగుజీవితాన్ని ప్రతిబింబించేదిగా వుండాలి.
  • రచనలు డిజిటల్ రూపేణా మాత్రమే, యూనికోడులో వర్డ్ ఫార్మాట్‌లో, ఎటువంటి అచ్చుతప్పులు లేకుండా ప్రచురణకు సిద్ధంగా telsa.competitions@gmail.com కు పంపించాలి. PDF, చేతివ్రాత ప్రతులు పరిశీలించలేము.
  • కథలు అచ్చులో 10-11 పేజీలు (8.5″ x 11″) మించకుండా ఉంటే మంచిది. కవితలు 1-2 పేజీలకు మించరాదు.
  • మా దృష్టిలో బహుమతియోగ్యమైన రచనలుఅందకపోతే, బహుమతికి ఏ రచనా ఎన్నుకోకుండా వుండే హక్కు మాకు వుంటుంది. ఈ విషయంలో నిర్ణేతలదే ఆఖరిమాట. ఉత్తర ప్రత్యుత్తరాలకు తావు లేదు.
  • రచనలతో పాటు అన్ని నిబంధనలను ఆమోదిస్తున్నట్టు, తమసంతకంతో కూడిన హామీ పత్రాన్ని రచయితలు జతపరచాలి.
  • ఆమోదించ బడిన రచనలు, మా వెబ్‌సైట్లో ప్రచురించిన తర్వాత మాత్రమే, ఇతర ప్రచురణలకు పంపించుకోవచ్చు.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: