జనవరి 7, 2022

సూపర్ రైటర్స్ అవార్డ్స్-2ః ప్రతిలిపి

Posted in కథల పోటీలు, సాహితీ సమాచారం వద్ద 12:06 సా. ద్వారా వసుంధర

లంకె

నమస్తే

మీరు లక్షలాది మంది పాఠకుల అభిమాన రచయితగా ఉండాలనుకుంటున్నారా మరియు మిమ్మల్ని మీరు స్థిరపడిన రచయితగా చూడాలనుకుంటున్నారా? అయితే ప్రతిలిపి ప్రత్యేకమైన పోటీలో పాల్గొని మా తదుపరి సూపర్ రైటర్ అయ్యే అవకాశాన్ని పొందండి.

గమనిక : దయచేసి చివరి వరకు అన్ని వివరాలను జాగ్రత్తగా చదవండి. 

బహుమతులు:

మొదటి బహుమతి : Rs.50,000/- మరియు మీ పుస్తకాన్ని ప్రతిలిపి బుక్స్ అనే మా సహ సంస్థ ముద్రించి ప్రచురిస్తుంది.

రెండవ బహుమతి   : Rs.30,000/-

మూడవ బహుమతి : Rs.15,000/- 

తరువాతి 5 మందికి ఒక్కొక్కరికి 1000 రూపాయల చొప్పున నగదు బహుమతి పంపడం జరుగుతుంది.

మొదటి 10 మంది విజేతలు నేరుగా ప్రతిలిపి ప్రీమియం విభాగానికి అర్హత పొందుతారు, మరియు పోటీలో పాల్గొన్న రచయితలందరికీ ప్రశంసా పత్రం పంపడం జరుగుతుంది.

ప్రతిలిపి ప్రీమియం గురించి : ప్రతిలిపి ప్రీమియం విభాగానికి అర్హత ఉన్న రచయితలు నెలకు వేలాది రూపాయలు సంపాదిస్తారు. ప్రతిలిపిలో 2.7 లక్షలకు పైగా రచయితలు ఉన్నారు, కానీ ఇప్పటి వరకు కొద్దిమంది రచయితలు మాత్రమే ప్రతిలిపి ప్రీమియానికి అర్హత పొందారు.

ఈ పోటీ ద్వారా మీరు ప్రతిలిపి ప్రీమియం విభాగానికి అర్హత పొందుతారు. తద్వారా మీరు వేలాది రూపాయలు సంపాదించే అవకాశం పొందవచ్చు. దీని గురించి మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి: ప్రతిలిపి ప్రీమియం గురించి.

మీరు ఈ పోటీలో పాల్గొనాలా, వద్దా అని ఇంకా ఆలోచిస్తున్నారా? అయితే, ఇక్కడ మా పోటీలలో పాల్గొన్నప్పుడు వారికి లభించే అదనపు ప్రయోజనాలను చదవండి: ఈవెంట్స్ రచయితలకు ఎలా ఉపయోగపడతాయి?

నియమాలు:

1. ఈ పోటీలో ఎవరు పాల్గొనవచ్చు?

సూపర్ ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ కి అర్హత గల రచయితలందరూ ఈ పోటీకి అర్హులే.

2. నేను ఫ్యాన్ సబ్స్క్రిప్సన్ కి అర్హత పొందానా? లేదా? అని ఎలా తెలుసుకోవాలి?

మీరు మీ ప్రొఫైల్ పైన గోల్డెన్ బ్యాడ్జ్ కలిగి ఉన్నట్లయితే సూపర్ ఫ్యాన్  సబ్‌స్క్రిప్షన్ కి అర్హత పొందారని అర్థం. దీనికి సంబంధించిన మరిన్ని వివరాల కొరకు ఈ లింక్ పైన క్లిక్ చేయండి: అర్హత పొందిన రచయితలFAQS 

3. నాకు ప్రస్తుతం అర్హత లేదు, నేను ఏమి చేయాలి?

మీరు అర్హత పొందవచ్చు, దయచేసి ఈ లింక్‌లో అర్హత ప్రమాణాలను చదవండి :సూపర్ ఫ్యాన్ సబ్స్క్రిప్షన్ కి అర్హత పొందని రచయితల faqs

4. నేను ఏమి రాయాలి?

 • ఈ పోటీకి మీ సిరీస్/నవల రాయాల్సి ఉంటుంది. మీ సిరీస్/నవల ఏ శైలిలోనైనా లేదా ఏ అంశంపైనైనా వ్రాయవచ్చు. 
 • మీ నవల/సిరీస్ సూపర్‌ ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో జత చేయాలి.

5. సూపర్‌ ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో నా సిరీస్‌ని ఎలా నమోదు చేయాలి?

మీరు గోల్డెన్ బ్యాడ్జ్‌ అర్హత గల రచయిత అయితే మీ సిరీస్/నవల ఆటోమేటిక్‌గా నమోదు చేయబడుతుంది. కానీ మీరు సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్ నుండి సిరీస్‌ను తీసివేస్తే, అది పోటీలో పరిగణించబడదు! కాబట్టి మీ సిరీస్ సూపర్‌ఫ్యాన్ సబ్‌స్క్రిప్షన్ ప్రోగ్రామ్‌లో ఉందో లేదో నిర్ధారించుకోండి.

6. పద పరిమితి, ఎపిసోడ్ పరిమితి మరియు ప్రవేశ పరిమితి అంటే ఏమిటి?

 • మీ సిరీస్/నవలలోని ప్రతీభాగం కనీసం 800 పదాలు కలిగి ఉండాలి.
 • మీ సిరీస్/నవల కనీసం 30 భాగాలు కలిగి ఉండాలి.
 • మీరు 800 కు మించి ఎన్ని పదాలు అయినా రాయవచ్చు. మరియు 30కి పైగా ఎన్ని భాగాలు అయినా రాయవచ్చు.
 • మీరు ఎన్ని సిరీస్/నవలలైనా రాయవచ్చు.

7. నేను పోటీలో ఎలా పాల్గొనాలి?

 • మీరు ఈ పోటీలో పాల్గొనడానికి మీ సిరీస్/నవలని స్వీయ ప్రచురణ చేయాలి. మీ సిరీస్/నవల ని ప్రచురించేటప్పుడు తప్పనిసరిగా వర్గం “సూపర్ రైటర్” ని సెలెక్ట్ చేసుకోవాలి.
 • ప్రతిలిపిలో మీ నవలలను స్వీయప్రచురణ ఎలా చేయాలో తెలుసుకోవడానికి ఈ లింక్ పైన క్లిక్ చేయండి.
 • సిరీస్/నవల పూర్తిగా మీ సొంతమై ఉండాలి. ప్రతిలిపిలో ఇంతకముందు ప్రచురించిన మీ సిరీస్ పోటీకి స్వీయప్రచురణ చేయరాదు. మరెక్కడైనా ప్రచురణ అయిన సిరీస్ పోటీకి ప్రచురించవచ్చు.
 • మీరు రచించిన సిరీస్ ని ఇచ్చిన గడువు అనగా 31 మే 2022 లోపు మీ ప్రొఫైల్ లో స్వీయ ప్రచురణ చేయాలి. అలా పూర్తికాని సిరీస్ పోటీకి పరిగణించబడవు.

ముఖ్యమైన తేదీలు :

మీ సిరీస్/నవల స్వీయప్రచురణ చేయడానికి ప్రారంభ తేది: 09 డిసెంబర్ 2021.

మీ సిరీస్/నవల స్వీయప్రచురణ చేయడానికి చివరి తేది: 31 మే 2022.

ఫలితాలు ప్రకటించే తేది:  01 ఆగష్టు 2022.

విజేతల ఎంపిక ప్రక్రియ ఎలా ఉంటుంది?

డిజిటల్ మరియు ప్రింట్ విభాగాల నుండి మా ఎడిటర్‌ల బృందం ఈ క్రింది అంశాల ఆధారంగా ఎంట్రీలను ఖచ్చితంగా అంచనా వేస్తుంది:

 • భాష యొక్క నాణ్యత (పదజాలం, స్పెల్లింగ్ మరియు వ్యాకరణం)
 • అంశం యొక్క నాణ్యత

కాబట్టి దయచేసి మీరు అన్ని నియమాలను పాటిస్తూ మరియు మీ ఉత్తమ సిరీస్‌ని పోటీలో ప్రచురించండి.

ముఖ్యమైన సాంకేతిక సమాచారం:

 1. దయచేసి మీరు ప్రతిలిపి యాప్ యొక్క తాజా వెర్షన్‌ని ఉపయోగిస్తున్నారో లేదో నిర్ధారించుకోండి.

 2. మీ రచనను ప్రచురించేటప్పుడు, మీరు రచయిత ప్యానెల్‌లో ‘సూపర్ రైటర్స్’ వర్గాన్ని చూడలేకపోతే, దయచేసి మమ్మల్ని వీలైనంత త్వరగా మెయిల్ (events@pratilipi.com) ద్వారా సంప్రదించండి మరియు మా బృందం మీకు సహాయం చేస్తుంది.

 3. ‘లీడర్‌ బోర్డ్’ అనేది పోటీకి సంబంధించినది కాదు. ఇది అన్ని విభాగాలతో అనుసంధానమై వుంటుంది కావున మీరు కంగారు పడవలసిన పని లేదు.

 4. మీరు ఈ పేజీ క్రింద ఉన్న ‘అన్ని ఎంట్రీలు’ శీర్షికను చూస్తున్నట్లయితే, ఇది కేవలం సాంకేతిక సమస్య మరియు దీనికి పోటీతో లేదా దాని ఎంట్రీలతో ఎటువంటి సంబంధం లేదు, ఇది ఏ సందర్భంలోనైనా ఖాళీగా ఉంటుంది మరియు మేము ‘అన్ని ఎంట్రీలు’ అనే టెక్స్ట్ తొలగించడానికి ప్రయత్నిస్తున్నాము. అసౌకర్యానికి చింతిస్తున్నాము.

ఏవైనా సమస్యలు, సందేహాలు లేదా ప్రశ్నలు ఉన్నాయా?

events@pratilipi.com మెయిల్ చేయండి మా బృందం మీకు సహాయం చేస్తుంది.

కాబట్టి మీరు దేని కోసం ఎదురు చూస్తున్నారు?

ఇప్పుడే పాల్గొనండి మరియు సూపర్ రైటర్స్ అవార్డ్స్ విజేత మీరే కావచ్చు. మీ పుసకాన్ని ముద్రించే అవకాశాన్ని పొందండి.

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: