ఫిబ్రవరి 26, 2016

దేశమంటే?

Posted in సాంఘికం-రాజకీయాలు వద్ద 6:01 సా. ద్వారా వసుంధర

ఈ దేశంలో 20 కోట్లకు పైగా ముస్లిములు ప్రతి శుక్రవారం నమాజు చేస్తారు. ఆదివారం వస్తే చర్చిలు జనంతో క్రిక్కిరిసిపోతాయి. ఇక హిందువుల విషయానికొస్తే- మొన్న మేడారం జాతరకి కోటిమంది భక్తులు పోటెత్తారు. తిరుపతి, కాశి, పూరీ వగైరా హిందూ పుణ్యక్షేత్రాలకి ప్రతిరోజూ కోట్లసంఖ్యలో భక్తులు వెడుతూనే ఉంటారు. వీరిలో దళితుల సంఖ్యే అధికం. ఇటీవల కెసిఆర్ చేసిన యాగం హిందూ సంప్రదాయాన్ని అనుసరించినదే. అందుకు ఆయన్నెవరూ నిరసించలేదు సరికదా, ఎక్కడ ఎన్నికలొచ్చినా బ్రహ్మరథం పడుతున్నారు. సంస్కృతి అంటే మతం కాదనీ, దేశమంటే మనుషులే కానీ మతాలు కాదనీ ఎవరు ఘోషించినా నిజం నిజం కాకపోదు. మత మౌఢ్యంతో ఇతరుల్ని నిరసించడం ఎంత తప్పో – హిందూమత ద్వేషంతో జాతి వ్యతిరేక నినాదాలు చెయ్యడం అంతకంటే పెద్ద తప్పు. అందుకు శిక్ష పడుతుందన్న భయం లేకపోతే – ఈ తప్పు ఇలాగే కొనసాగిపోతుంది. విరాట్ కోహ్లీని అభినందిస్తూ భారత జాతీయ పతాకాన్ని ఊపాడన్న కారణంతో – ఓ క్రీడాభిమానికి పదేళ్లు జైలు శిక్ష విధించిన దురభిమాన, అసహన దేశం మనకు పొరుగునే ఉంది. ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తూ మనకి పక్కలో బల్లెంగా ఉన్నది. ఇది మనమెంతో జాగరూకులమై ఉండాల్సిన సమయం. స్వేచ్ఛ పేరిట జాతి వ్యతిరేక నినాదాల్ని చెయ్యడం అమాయకత్వంగా సరిపెట్టుకునేందుకిది సమయం కాదు.  

పై విషయాల్ని దృష్టిలో ఉంచుకుని – ఈ క్రింది వ్యాసంలోని కుతర్కాన్ని పక్కన పెట్టి మంచిని గ్రహించవలసిందిగా వీక్షకులకు మనవి.

ఆంధ్రజ్యోతి

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు / మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు / మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు / మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు / మార్చు )

Connecting to %s

%d bloggers like this: