డిసెంబర్ 7, 2014

దేవుడా, నేను రైతుని!

Posted in సాంఘికం-రాజకీయాలు వద్ద 7:33 సా. ద్వారా వసుంధర

ఒకప్పుడు నారదుడికి తనకు మించిన భక్తులు లేరని అహం ఉండేదిట. విష్ణువు ఆయనతో, ‘నీకంటే పరమభక్తుడు ఓ పల్లెటూరి రైతు’ అని చెప్పేట్ట. అతడి భక్తి ఎంతటిదో చూదామని నారదుడు వెళ్లి చూస్తే, ఆ రైతు రోజూ లేచింది మొదలు రాత్రి పడుకునేదాకా స్వంతపనుల్లో తలమునకలైపోయి ఒక్కసారి కూడా దేవుణ్ణి తల్చుకోలేదుట. రాత్రి పడుకునేముందు మాత్రం ఒకసారి విష్ణువుని మనసులో స్మరించుకుని నమస్కరించి పడుకున్నాడుట. నిత్యం హరినామస్మరణ చేసే తనకంటే ఆ రైతు గొప్ప భక్తుడెలాగయ్యాడని నారదుడు హరిని నిలదీసేట్ట. ‘సమాధానం శివుడికి తెలుసు’ అని హరి ఆయనకు అంచు చివరిదాకా వూనె నిండిన ఓ పాత్రని ఇచ్చి, ‘దీన్ని తీసుకుని వెళ్లి శివువికి ఇచ్చి నీ అనుమానం తీర్చుకో. కానీ దారిలో ఎక్కడా ఒక్క నూనె చుక్క కూడా క్రిందకు చిందకూడదు సుమా!’ అని హెచ్చరించాడు.  నారదుడా పాత్రని తీసుకుని బయల్దేరాడు. అంచులదాకా నూనె ఉండడంవల్ల దృష్టంతా దానిమీదే పెట్టి ఎంతో జాగ్రత్తగా ప్రయాణం చేసి వెళ్లి శివుడికి ఆ పాత్రనిచ్చి, దారిలో ఎక్కడా ఒక్క చుక్క చిందలేదని గర్వంగా చెప్పి, శివుడికి ర్నైతు భక్తి గురించి తన సందేహం వినిపించేట్ట. శివుడు నవ్వి, ‘ఈ ప్రయాణంలో నీవు హరిని ఎన్నిమార్లు తల్చుకున్నావు?’ అనడిగేట్ట. అప్పుడు నారదుడికి విషయం అర్థమయింది. రైతు సంసార సాగరంలో తలమునకల్తూ కూడా, ఒక్కసారి భగవంతుని స్మరించాదు. మరి తను ఒక్కసారి చిన్న బాధ్యత అప్పగించేసరికి అది తీరేదాకా ఒక్కసారి కూడా హరిని స్మరించలేదు. 

ఇప్పుడీ కథ తిరగబడింది. రైతులిప్పుడు రోజూ ‘దేవుడా, నేను రైతుని’ అని పదేపదే స్మరించి వేడుకుంటున్నా- ఆయన తన బిజీలోపడి ఒక్కసారి కూడా రైతుని గుర్తు చేసుకోవడం లేదని వాపోతున్న ఈ క్రింది చురక- నేడు ఆంధ్రజ్యోతి ఆదివారం అనుబంధంలో వచ్చింది…..

farmer

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out / మార్చు )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out / మార్చు )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out / మార్చు )

Google+ photo

You are commenting using your Google+ account. Log Out / మార్చు )

Connecting to %s

%d bloggers like this: