డిసెంబర్ 3, 2014

ఇదీ మన వరస

Posted in సాంఘికం-రాజకీయాలు వద్ద 12:15 సా. ద్వారా వసుంధర

అందరికీ సమాన హక్కులున్న దేశం మనది. మరిక్కడ మైనారిటీలు ఎవరు? కేవలం ఓట్లకోసం మతం, కులం పేరిట జనాన్ని విభజించాలనుకుంటున్నారు మన రాజకీయవాదులు. కులం, మతం పూర్తిగా వ్యక్తిగతం. దేశానికి సంబంధించి ప్రజలు రెండే రెండు వర్గాలు- ధనికులు, పేదలు.  గుజరాత్‍లో అల్లర్ల మూలాలను పూర్తిగా విస్మరించి, ఆ మూలానికి వచ్చిన స్పందనకు మోదీని మాత్రమే తప్పు పట్టడం సెక్యులరిజంగా చెలామణీ ఔతోంది. 2002 తర్వాత గుజరాత్‍లో మతకలహాలు లేకపోయినా అందుకు మోదీని మెచ్చుకోరు. ఆ తర్వాత ఉత్తరప్రదేశ్ వంటి ఇతర రాష్ట్రాల్లో మతకలహాలు పదేపదే జరిగినా, అందుకూ మోదీనో, బిజెపినో తప్పు పట్టడం వారికి వ్యసనంగా మారింది. దేశం మోదీని నాయకుడిగా గుర్తించింది. ప్రపంచం కూడా ఆయన వ్యక్తిత్వానికి జోహారులంటోంది. మనదేశంలో ఇతర మతాలవారు కూడా ఆయనవైపే మొగ్గుతున్నారు. ఆ నిజాన్ని జీర్ణించుకునేందుకు అలవాటు పడాలి. కుల, మత, వర్గ ధోరణులు – పాతబడిన విద్యలని గ్రహించాలి. నానావతి మన అభిప్రాయానికి సరిపడ నివేదికని ఇస్తే, అది నిజంమనీ – వేరేగా ఇస్తే అది పాక్షికమనీ భావించే తత్వంనుంచి బయటపడేదాకా, మనకి ప్రగతి ఉండదు. ఘటనల్ని వ్యక్తులకో, వ్యక్తిత్వాలకో ముడిపెట్టడం మాని, యథాతథంగా విశ్లేషించగలగాలి. అప్పుడు తెలుస్తుంది- స్వచ్ఛభారత్ అంటే చీపురు పట్టుకుని ఫొటో దిగడం కాదు – చేతిలోని పోలితీన్ సంచిని రోడ్డుమీదకు విసరకుండా, చెత్తబుట్టలో వెయ్యడమని! ఈ నేపథ్యంలో నేడు ఆంధ్రజ్యోతి దినపత్రికలో వచ్చిన ఈ వార్త మీ ముందు….

nanavati

ప్రకటనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

గూగుల్+ చిత్రం

You are commenting using your Google+ account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

w

Connecting to %s

%d bloggers like this: